Monday, January 25, 2010

ఒక డిమాండ్

ఆ మధ్య మా తమ్ముడు అన్నాడు. “నువ్వు అన్ని రంగాలలో పనిచేశావు. ఒక్క రాజకీయ రంగమే మిగిలిపోయింది”అని. చాలా సంవత్సరాలుగా చాలామంది పెద్దలు నన్ను ఎన్నికలలో పోటీ చెయ్యమని రెచ్చగొడుతూ వచ్చారు. పార్టీల్లో చేరడానికి ప్రోత్సాహకాలు, తాయిలాలు చూపుతూ వచ్చారు. అయితే ఓపికలేని కారణాన, ఇంత ఆలశ్యంగా పోటీల్లో దిగే శ్రమకి భయపడి ఆగిపోయాను.
పూర్తిగా చదవండి

Sunday, January 17, 2010

ఆదర్శం ఆచరణ

19 సంవత్సరాల కిందట ఓ పధ్నాలుగేళ్ళ అమ్మాయిని మానభంగం చేసి. ఆమె కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేసి ఆమె ఆత్మహత్య చేసుకోడానికి కారణమైన హర్యానా పోలీసు ఇనస్పెక్టర్ జనరల్ రాధోడ్ గారు - మనకి ఓ గొప్ప జీవిత సత్యాన్ని నిన్ననే కోర్ట్ నుంచి బయటికి వస్తూ వివరించారు.
పూర్తిగా చదవండి

Sunday, January 10, 2010

కేక

ప్రస్థుతం ఆంధ్రదేశంలో జరుగుతున్న ఉద్యమ లక్ష్యాలకీ ఈ కాలమ్ కీ ఏ విధమయిన సంబంధం లేదు.
పత్రికల్లో వార్త: ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారు. అందరిమాటా అలావుంచి ముందు రాజకీయ నాయకులు ఆంధోళన వ్యక్తం చేశారు. సామాన్యుడి నడ్డివిరిగిందని తెలుగు దేశం నాయకులు చంద్రబాబు నాయుడుగారు వాపోయారు. వారి పార్టీ అన్ని ఆర్టీసీ డిపోల ముందూ ధర్నా చేస్తోంది, బీజేపీనాయకులు బండారు దత్తాత్రేయగారూ, కిషన్ రెడ్డిగారూ తదితర నాయకులూ ధర్నాలు చేస్తున్నారు. సిపియం నాయకులు రాఘవులుగారు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇవన్నీ ఆయా నాయకుల ప్రజా సంక్షేమ ధృక్పధానికీ, వారి అకుంఠిత దేశ సేవానిరతికీ ప్రత్యక్ష సాక్ష్యాలు. ఆంద్రదేశానికి ఇలాంటి నాయకత్వం ఉండడం ప్రజలు చేసుకున్న పుణ్యం. సందేహం లేదు.
పూర్తిగా చదవండి

Monday, January 4, 2010

అవినీతికి పట్టాభిషేకం

మన దేశంలో అవినీతి అద్భుతమైన పరిణామం చెంది అపూర్వమయిన కళగా స్థిరపడినట్టు మరే దేశంలోనూ లేదు. నిజానికి దొంగతనం కూడా మన పెద్దలు అంగీకరించిన 64 కళలలో ఒకటి.
అది పాతకాలం మాట.ఈ రోజుల్లో అవినీతి అనలేని, అనకుండా ఉండనూలేని ఎన్నో రకాలయిన కొత్త కొత్త అవినీతులు వచ్చాయి. వాటికిశిక్షలు ఉండవు. జవాబుదారీ ఉండదు. చెల్లుబాటవుతుంది. అవినీతి పరుడికి మేలు జరుగుంది. నీతినిద్రపోతుంది. కాని ఎవరూ ఏమీ చెయ్యలేరు.
పూర్తిగా చదవండి