Tuesday, December 31, 2013

సమాధిపై ఆఖరి రాయి

 కుంభకోణం శతాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీకి చరమగీతమని చెప్పవచ్చుఆదర్శం అనే పేరునిదాని అర్ధాన్నీభయంకరంగా అనుభవంఅధికారంఅన్నిటికీ మించి విచక్షణవివేచన తెలిసిన నాయకులు భ్రష్టు పట్టించడానికి ఇది పరాకాష్ట.దేశంలో ఒక న్యాయాధిపతి జె.ఏ.పాటిల్ఒక మాజీ ప్రధాన కార్యదర్శి పి.సుబ్రహ్మణ్యం  కుంభకోణాన్ని పరిశీలించి ఇచ్చినరిపోర్టుని ఒక్కసారి చూద్దాం.
పూర్తిగా చదవండి 

Thursday, December 26, 2013

ఒక నేరం ఒక నిరూపణ

ఈ మధ్య మన దేశంలో రెండు అపురూపమైన సంఘటనలు జరిగాయి. శంకర రామన్‌ హత్యకేసులో అరెష్టయి నూరు రోజులు జైలులో ఉన్న కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతీ స్వామి మీద నేరం రుజువు చేయలేకపోయారని పుదుచ్చేరి కోర్టు కేసు కొట్టివేసింది.
పూర్తిగా చదవండి

Sunday, December 15, 2013

చీపురు రాజకీయం

చీపురుని ఎన్నికల గుర్తుగా ఉంచాలని ఆలోచించిన వారెవరో నిజంగా మహానుభావులు. ఇంతకంటే ఇంటి ముంగిట్లో, వీధుల్లో, గదుల్లో తిష్ట వేసుకు కూర్చునే సాధనం మరొకటి ఉండదు. దాని అవసరం లేని రోజూ, అవసరం లేని మనిషీ, అవసరం లేని సందర్భమూ ఉండదు. నిజానికి 'చీపురు'ని ఎన్నికల గుర్తు చేయగానే సగానికి సగం విజయం సాధించినట్టే లెక్క. అందునా ఈ మధ్య సమాజంలో చెత్త ఎక్కువయి, చెత్త రాజకీయాలు తల బొప్పి కట్టించే నేపధ్యంలో ఎలాంటి చీపురుతో ఈ చెత్తని బుట్టదాఖలు చెయ్యాలా అనే ఆలోచనతో దేశంలో చాలామంది జుత్తు పీక్కుంటున్నారు.
పూర్తిగా చదవండి

Monday, December 9, 2013

నల్ల సూర్యుని అస్తమయం

2003లో మా అబ్బాయి క్రికెట్‌ ప్రపంచ కప్పు ఆటలకు దక్షిణాఫ్రికా వెళ్లి వస్తూ నాకో బహుమతిని తెచ్చాడు. నెల్సన్‌ మండేలా ఆత్మకథ -ఎ లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడమ్‌. "స్వాతంత్య్రానికి సుదీర్ఘ ప్రయాణం" దాదాపు తెనుగు సేత. అప్పటికి ఆత్మకథల మోజులో ఉన్న నేను -నా ఆత్మకథ రచనకు ఉపక్రమించబోతున్న నేను -వదలకుండా కొన్ని రోజులు చదివాను. చదివాక కొన్ని సంవత్సరాలు నన్ను వెంటాడిన పుస్తకం -కాదు -వెంటాడిన జీవితం మండేలాది. మండేలాకీ మన దేశానికీ దగ్గర బంధుత్వం ఉంది. మహాత్ముని అహింసాయుతమైన పోరాటాన్ని -శాంతియుత సమరాన్ని స్ఫూర్తిగా తీసుకున్న రెండో వ్యక్తి -నెల్సన్‌ మండేలా. మొదటి వ్యక్తి -మార్టిన్‌ లూధర్‌ కింగ్‌.
పూర్తిగా చదవండి

Sunday, December 1, 2013

తాలిబన్ దేశభక్తి

నాకెప్పుడూ తాలిబన్ల మీద అమితమైన గౌరవం ఉంది. ఈ మాట వ్యంగ్యంగానో, వెక్కిరింతగానో అనడం లేదు. అజ్ఞానమో, సుజ్ఞానమో, ప్రాథమికమో, పాశవికమో -తాము నమ్మిన నిజాన్ని -మాయాబజారులో సియెస్సార్ మాటల్లో 'సిగ్గులేకుండా' ప్రదర్శించగల నిజాయితీ వారికుంది.
పూర్తిగా చదవండి