Saturday, April 11, 2015

జనవరి నుంచీ వ్రాసిన కాలమ్స్

గత కొద్ది నెలలుగా బ్లాగు లో కొత్త పోస్టులు పెట్టలేకపోయాను. ఇక నుంచి క్రమం తప్పకుండా అప్ డేట్స్ ఉంటాయి. గత కొద్దినెలలుగా నేను వ్రాసిన కాలమ్స్ ఇవీ..
(April 9,2015)  Honeymoon Aipoyindi హనీమూన్ ఐపోయింది(సాక్షి పత్రికనుంచి)
(April 2,2015)  Otami O Majili ఓటమి ఓ మజిలీ(సాక్షి పత్రికనుంచి)
(March 26,2015)  Charitraku Raani Herolu చరిత్రకు రాని హీరోలు(సాక్షి పత్రికనుంచి)
(March 19,2015)  Tragic Hero ట్రాజిక్ హీరో(సాక్షి పత్రికనుంచి)
(March 12,2015)  England Daugther ఇంగ్లాండు డాటర్(సాక్షి పత్రికనుంచి)
(March 05,2015)  Apasruti Avasarama? అపశ్రుతి అవసరమా?(సాక్షి పత్రికనుంచి)
( February 26,2015)  Ika Rahul ki Selavu ఇక రాహుల్ కి శెలవు(సాక్షి పత్రికనుంచి)
( February 19,2015)  The Last Moghal ది లాస్ట్ మొఘల్(సాక్షి పత్రికనుంచి)
( February 12,2015)  Rendu Ennikalu రెండు ఎన్నికలు ఒకే నీతి(సాక్షి పత్రికనుంచి)
( February 05,2015)  Basa Rasabasa 'బాస రసాబాస '(సాక్షి పత్రికనుంచి)
( January 29,2015)  Lakshman Rekha 'లక్ష్మణ్ రేఖ ' చిరంజీవి(సాక్షి పత్రికనుంచి)
 January 22,2015)  Paduka Pattabhishekam పాదుకా పట్టాభిషేకం (సాక్షి పత్రికనుంచి)
( January 15,2015)  Jaganmitrudu  జగన్మిత్రుడు(సాక్షి పత్రికనుంచి)
( January 08,2015)  Godse Gudi  గాడ్సే గుడి(సాక్షి పత్రికనుంచి)
( January 06,2015)  About Ganesh Pathro  గణేష్ పాత్రో గురించి..(ఈనాడు పత్రికనుంచి)

Thursday, October 30, 2014

మరో గాంధీగిరి

ఈ వారమ్  జీవనకాలమ్ - సాక్షి దినపత్రిక నుంచి...
కౌముది ఆడియోతో కలిపి...

పూర్తిగా చదవండి

Tuesday, October 14, 2014

విజ్ఞానం – విశ్వాసం

...... చిన్నప్పుడు తేలు కుడితే మా నాన్నగారు నన్ను విశాఖపట్నంలో మంగళగిరి సీతారామయ్యగారింటికి తీసుకువెళ్ళడం గుర్తుంది. ఆయన నా ముందు కూర్చుని పెదాలు కదుపుతూ ఏదో వర్ణించేవాడు. నాకు భయంకరమైన బాధ. తర్వాత నన్ను నోరు తెరవమని నోట్లో ఏదో వేసాడు. విచిత్రం మరో పదినిముషాలకు బాధ తగ్గడం ప్రారంభించేది. ఇప్పుడాలోచిస్తే సీతారామయ్యగారు రెండు స్థాయిలలో వైద్యం చేశాడు. 'మంత్రాలకు చింతకాయలు రాలుతాయి ' అనే విశ్వాసాన్ని పునరుద్దరించాడు. నొప్పికి అసలు మందు ఏదో ఇచ్చాడు. మందు వల్ల నొప్పి పోయింది. మంత్రం వల్ల విశ్వాసం బతికింది. ఇది అపూర్వమైన చికిత్స....

Wednesday, October 8, 2014

అంతరిక్షంలో అద్భుతం


నేను ఆనర్స్ చదువుకునే రోజుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అణుశాస్త్ర విభాగాన్ని ప్రారంభించారు. దాని ఆచార్యుడిగా ఆయన్ని ఆహ్వానించారు. ఆయన పేరు స్వామి జ్ఞానానంద. సన్యాసం స్వీకరించకముందు ఆయన లౌకిక నామం భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు. ఆయన సన్యసించి హిమాలయాల్లో పదేళ్ళు గడిపి, తపస్సు చేసుకుని - 1936లో అణుశాస్త్రంలో పరిశోధనలు జరిపి, జర్మనీలో పనిచేసి, మిచిగన్ విశ్వవిద్యాలయంలో పనిచేసి భారతదేశానికి వచ్చారు.
పూర్తిగా చదవండి 
  

Monday, September 29, 2014

ఓ ఉద్యమం అస్తమయం



29 సంవత్సరాల కిందట ఓ 16 ఏళ్ల కుర్రాడికి మిత్రులు రమణయ్య రాజాగారు రాజాలక్ష్మి ఫౌండేషన్‌ పురస్కారం యిస్తున్నప్పుడు నేను ఆడియన్స్‌లో ఉన్నాను. మాండలిన్‌ శ్రీనివాస్‌ గురించి అప్పటికి నేను వినలేదు. రాజాగారికి మతిపోయిందా అనుకున్నాను.
పూర్తిగా చదవండి 

Monday, September 22, 2014

మంచి - మతం


సరిగ్గా ఏభై సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారి నట జీవితాన్ని పెద్ద మలుపు తిప్పిన ''నిప్పులాంటి మనిషి'' సినీమా రాశాను. క్లైమాక్స్‌లో పోలీసు ఇనస్పెక్టర్‌ (ప్రభాకరరెడ్డి) అంటాడు -ముగ్గురు వీరుల్ని -విజయ్‌ (ఎన్టీఆర్‌), షేర్‌ ఖాన్‌ (కైకాల), డిసౌజా (రేలంగి) -చూసి: ''ఒకరు హిందువు, ఒకరు ముస్లిం, ఒకరు క్రిస్టియన్‌'' అని.
హీరో సమాధానం: ''మంచితనానికి మతం లేదు ఇనస్పెక్టర్‌. కన్నీరు ఎవరు కార్చినా అది కష్టానికి గుర్తే...'' ఇది నా కిష్టమయిన, నేను రాసిన డైలాగ్‌.
పూర్తిగా చదవండి 

Sunday, September 14, 2014

ముద్దుకి వేలం

ఈవారంతో కౌముదిలో ఆరు సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న  గొల్లపూడి కాలమ్
----------------------------------------------------------------------------------
 
ఈమధ్య కెనడాలో 49 ఏళ్ల సినీతార ముద్దుని వేలం వేయగా 48 లక్షల రూపాయలు వచ్చింది. ఆ ముద్దుని ఎల్టన్‌ జాన్‌ ఎయిడ్స్‌ సంస్థ విరాళం కోసం వేలం వేశారు. ఇంగ్లండ్‌ మోడల్‌, నటీమణి ఎలిజబెత్‌ హర్లీ ఈ ముద్దుని పెట్టుబడి పెట్టింది. ప్రముఖ భారత కెనేడియన్‌ వ్యాపారవేత్త జూలియన్‌ భారతీ 48 లక్షలు చెల్లించి ముద్దుని కొనుక్కుని పదిమంది మధ్య ముఖ్యంగా భార్య సమక్షంలోనే ఎలిజబెత్‌ హర్లీని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఈ ముద్దుకి సామాజికమయిన ప్రయోజనం ఉంది కనుక -ఆయన బార్య అంతగా బాధ పడలేదట.
 పూర్తిగా చదవండి.

Sunday, September 7, 2014

ఓ చరిత్రకి తెర

ఓ గొప్ప చరిత్రకి తెరపడింది. దాదాపు ఆరు దశాబ్దాలు చిరునవ్వుకీ, చిత్తశుద్ధికీ, రమ్యతకీ, నవ్యతకీ, తెలుగుదనానికీ, వెలుగుదనానికీ, భక్తికీ, రక్తికీ చిరునామాగా నిలిచిన ఇద్దరు జీనియస్‌లు -బాపూ, ముళ్లపూడి శకం ముగిసింది. ఈ తరంలో బహుశా ఇంత విస్తృతంగా, ఇంత గొప్పగా తెలుగుదేశాన్ని ప్రభావితం చేసిన జంట మరొకటి లేదేమో! 

Monday, September 1, 2014

ఆశ్లీలం - బూతు

సృష్టిలో చాలా అసహ్యకరమైన దృశ్యం -నగ్నత్వం. అందునా మిక్కిలి అసహ్యకరం -స్త్రీ నగ్నత్వం. కనుకనే ప్రపంచంలో కళాకారులు వారు శిల్పులయినా, చిత్రకారులయినా, ఫొటోగ్రాఫరులయినా స్త్రీ నగ్నత్వాన్ని దృశ్యరూపం చెయ్యడాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంటారు.
 పూర్తిగా చదవండి

Monday, August 25, 2014

'భారతరత్న ' సంతర్పణ

     ఈ మధ్య 'భారతరత్న' పురస్కారం మీద మనదేశంలో మోజు బాగా పెరిగింది. నిజానికి 'భారతరత్న' నిజమైన భారతరత్నలకు అందని సందర్భాలెన్నో ఉన్నాయి. మైనారిటీలను దువ్వడానికో, ఆయా పార్టీలను సంతోషపరచడానికో, వోట్ల బాంకులను కాపాడుకోడానికో, మరేవో రాజకీయ కారణాలకో 'భారతరత్న'లను పంచే రోజులు చాలాకాలం కిందటే వచ్చాయి. సుప్రీంకోర్టు కనీసం రెండుసార్లు ఈ 'భారతరత్న' వితరణను ఆపుజేసింది
పూర్తిగా చదవండి 

Sunday, August 17, 2014

జైహింద్

ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 సంవత్సరాలయింది. ఒక వ్యక్తి జీవితంలో అది వృద్ధాప్యం. ఒక వ్యవస్థ జీవనంలో అది పరిణతి. ఈ 67 ఏళ్లలో ఏం జరిగింది? ప్రజాస్వామ్యాన్ని ఆసరాగా చేసుకుని దేశాన్ని దోచుకునే బెల్లింపునీ, చాకచక్యాన్నీ పెంచుకునే శక్తులు రెచ్చిపోయి, మెజారిటీని బలం చేసుకుని రెచ్చిపోయే రోజులొచ్చాయి. ఈ దేశంలో మకుటాయమానంగా నిలవగల ఒక కార్పొరేట్‌ సంస్థ అధిపతి సహారా సుబ్రతా రాయ్‌ దేశానికి కోట్ల రూపాయలు బాకీపడి గత రెండు నెలలుగా జైల్లో ఉన్నారు. అలాంటి పనిచేసిన మరొక కార్పొరేట్‌ సంస్థ అధిపతి సత్యం రామలింగరాజు- కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు.
పూర్తిగా చదవండి 

Monday, August 11, 2014

మాటకి తెరలు


ఆఫ్రికా మేక తెలుగు మేకతో తనగోడు చెప్పుకోలేదు. తమిళం ఎద్దు హిందీ ఎద్దు కష్టసుఖాలను అర్థం చేసుకోలేదు. కాని ఆఫ్రికా మనిషి -కాస్త ప్రయత్నిస్తే తెలుగు మనిషితో మాట్లాడగలడు. తమిళం మనిషి హిందీ మనిషి కష్టసుఖాలను తెలుసుకోగలడు. తెలుసుకోగలగడమే సమిష్టి జీవనం అర్థం. ప్రయోజనం. అవకాశం కూడా. జాతి సమైక్యంగా ఉండాలంటే అందరూ ఒక ఆలోచన చెయ్యకపోయినా, చెయ్యలేకపోయినా -ఒక భాష మాట్లాడాలి.
పూర్తిగా చదవండి..