skip to main |
skip to sidebar
గొప్ప గాయకుడు, కవి, రచయిత, మిత్రుడు -యివన్నీ నేలబారు విశ్లేషణలు. ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు (పి.బి.శ్రీనివాస్)కి యివేవీ సరిపోవు. ఇవన్నీ ఎవరయినా సాధించగలిగినవి. సాధిస్తున్నవీను. ఆయన బ్రతుకు రహస్యం తెలిసిన మనిషి. ఆద్యంతమూ జీవించిన మనిషి. ఆ మధ్య చాలా జబ్బుపడి కోలుకున్నారు. నేను నా నలభైయ్యేళ్ల పరిచయంలో ఏనాడూ ఆయన నిస్పృహతో, నిరాశతో, నిస్సత్తువతో, దైన్యతతో ఉండగా చూడలేదు. ఎప్పుడూ ఆనందంగా -ఎదుటివాడిలో మంచిని గుర్తిస్తూ, కీర్తిస్తూ జీవించిన యోగి. అదీ ఆయన ఆరోగ్య రహస్యం.
పూర్తిగా చదవండి
భారతీయ జ్ఞానపీఠ పురస్కారం మన దేశస్థాయిలో నోబెల్ బహుమతి లాంటిది. జాతీయస్థాయిలో అన్ని భారతీయ భాషలలోనూ ఉత్తమ రచయితగా నిలిచి జ్ఞానపీఠాన్ని అధిరోహించడం -తెలుగు దేశానికి, తెలుగు రచయితకి ఇది మూడవసారి. 1970లో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణకు 'రామాయణ కల్పవృక్షం' రచనకు బహుమతి లభించింది. 1988లో పద్మభూషణ్ సి.నారాయణ రెడ్డిగారికి ''విశ్వంభర'' రచనకిగాను జ్ఞానపీఠ పురస్కారం దక్కింది. ఇప్పుడు రావూరి భరద్వాజకు -వారు రచించిన ''పాకుడురాళ్లు'' నవలకి.
పూర్తిగా చదవండి
గొప్పగా మాట్లాడేవారంతా గొప్ప వక్తలు కారు. అలాగే గొప్ప వక్తలంతా గొప్ప విషయాలను మాట్లా డనక్కరలేదు. రెండో నిజానికి గొప్ప ఉదాహరణ -మన రాజకీయ నాయకులు. మరో అనర్థమైన ఉదాహరణ హిట్లర్. జాతిని ఊపి ఉర్రూతలూగించి -తన దౌష్ట్యాన్ని అంత గొప్పగా సబబనిపించేలాగ మాట్లాడే వక్త బహు శా మానవ చరిత్రలో మరొకరు లేరేమో.
పూర్తిగా చదవండి
అమెరికాలో ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం కులపతికి అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. అటునుంచి ఓ వ్యక్తి ఆతృతగా అడుగుతున్నాడు: ''112 మెర్సన్ స్ట్రీట్‌కి ఎటువెళ్లాలో చెప్పగలరా?'' అని. ఆ ప్రశ్నని వినగానే ఈ కులపతి దిగ్గునలేచి కూర్చున్నాడు. ''బాబూ, మీరెవరో తెలీదు కాని -ఇంత అర్ధరాత్రి అంత పెద్దాయన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు?'' అన్నాడు
పూర్తిగా చదవండి
మేముండే అపార్టుమెంటులో 12 కుటుంబాలున్నాయి. ఆరు కుటుంబాలు ఒకవేపు, మరో ఆరు మరొకవే పు. మా ఇంటి పక్కనే మరో అపార్టుమెంటు. ఈ కుటుంబాలు -ఎవరో తెలీదుకాని -వారిలో ఒకరు తమ చెత్తని పక్క అపార్టుమెంటు గోడదగ్గర వేస్తారు. కొన్నాళ్లకి వారి కాలువల్లో నీరు నిలిచిపోతుంది. వారు తగాదాకి వస్తారు. వేసేది ఎవరు?
పూర్తిగా చదవండి
భారత దేశం జాలిగుండె గల దేశం. దయకీ, కరుణకీ, ఆర్ధ్రతకీ, జాలికీ పెట్టింది పేరు. నిన్నకాక మొన్న తీహార్‌లో ఆత్మహత్య చేసుకున్న -ఢిల్లీ అమ్మాయిని ఘోరంగా మానభంగం చేసి చంపిన ఘనులలో ఒకడయిన రాంసింగ్ బతికి -17 సంవత్సరాల తర్వాత ఉరిశిక్ష విధిస్తే -అతని పట్ల 2030లో జాలి చూపే గుండె, కన్నీళ్లు పెట్టుకునే దయార్ధ్ర హృదయులు ఉంటారు. రాజీవ్ గాంధీతో పాటు ఏమీ నేరం చెయ్యని 18 మంది చచ్చిపోయినా -నళిని మీద సానుభూతి చూపే సోనియా కూతుళ్లూ, హంతకుల్ని ఉరితీయకూడదని ఒక రాష్ట్ర శాసనసభ తీర్మానం ఇందుకు సాక్ష్యం. మనది ఖర్మభూమి.
పూర్తిగా చదవండి
ఇలాంటి సమస్యలు మరే దేశంలోనూ వచ్చి వుండవు. ఒక మంత్రి పోలీసు ఆఫీసర్ని హత్య చేయించాడు. ముఖ్యమంత్రి ముఖం చాటుచేసుకున్నాడు. ఆ మంత్రి పేరు రాజాభయ్యా. ఉత్తరప్రదేశ్‌లో పేరు మోసిన గూండా.
ఒక పోలీసాఫీసరు గారి తనయుడు ఒక జర్మన్ మహిళని రేప్ చేశాడు. కోర్టు అతనికి ఏడేళ్లు శిక్షని విధించింది. అతని బాబు ఒరిస్సాలో డైరెక్టరు జనరల్ ఆఫ్ పోలీసు. కుర్రాడు అమ్మని చూడడానికి బెయిల్ కోరాడు. కోర్టు ఆరు నెలల తర్వాత ఇచ్చింది.
పూర్తిగా చదవండి