Sunday, September 22, 2013

నూరేళ్ల సినిమా

నూరేళ్ల కిందట భారతీయ సినిమా మన దేశంలో అప్పటికి ఉన్న అన్ని పరిమితులనూ పుణికి పుచ్చుకుని పురుడుపోసుకుంది. ప్రపంచ సినిమాకు కలిసివచ్చిన అదృష్టం -సిమోన్‌ వాన్‌ స్టాంపర్‌, డి.డబ్ల్యూ. గ్రిఫిత్‌, చార్లీ చాప్లిన్‌ వంటి వైతాళికులు మనకి లేరు. అయితే మన అదృష్టం -చిత్తశుద్దీ, కర్తవ్య దీక్షాగల ఒక స్వాప్నికుడూ, కార్యసాధకుడూ మన సినిమాకి కలిసివచ్చారు. ఆయన దాదా సాహెబ్‌ ఫాల్కే. కదిలే ఫిలింల ఫ్రేములు దగ్గర్నుంచి, కెమెరా కవాటాల దగ్గర్నుంచి, ఎడిటింగు వరకూ ప్రతీదీ 'ఓం నమ:' అంటూ ఆద్యంతమూ పరిశీలించి ఒడుపుని సాధించిన మహానుభావుడు ఫాల్కే.
పూర్తిగా చదవండి

Sunday, September 15, 2013

నేరము-శిక్ష

ఆ మధ్య అట్లాంటాలో ఓ మిత్రుడి ఇంట్లో ఉన్నాం నేనూ మా ఆవిడా. ఆయన రచయిత. ఆయన కూతురు చాలా అందమయినది. చురుకయినది. అయితే విపరీతమైన పెంకితనం. కాగా, ఏ కారణం చేతయినా తల్లిదండ్రులు పసిపిల్లల వొంటిమీద చెయ్యి వెయ్యరాదు -అనేది అమెరికాలో పెద్ద నిబంధన. ఆ విషయం స్కూలుకి వెళ్లిన తొలిరోజుల్లోనే పిల్లలకి చెప్తారట -అలాంటిదేదయినా జరిగితే ఫలానా నంబరుకి ఫోన్‌ చెయ్యమని. కనుక పిల్లలకి ఒక మొండి ధైర్యం వస్తుంది.
పూర్తిగా చదవండి

Monday, September 9, 2013

జైళ్లల్లో 'చిల్లర' దేవుళ్లు!

 మా చిన్నతనంలో ఎవరినయినా పరిచయం చేస్తూ ''ఈయన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్లారు'' అంటే దేవుళ్లని చూసినట్టు చూసేవాళ్లం. ఆనాడు అది అరుదైన త్యాగం. అప్పటి మహానాయకులంతా జైళ్లకి వెళ్లి వచ్చినవారే. తిలక్‌ జైల్లో 'భగవద్గీత' వ్యాఖ్యానం రాశారు
పూర్తిగా చదవండి

Sunday, September 1, 2013

సంగీతానికి ఎల్లలున్నాయి

ఇద్దర్ని దర్శించుకోడానికే నేనూ, మా ఆవిడా చాలా సంవత్సరాల క్రితం వారణాశి వెళ్లాం. కాశీవిశ్వేశ్వరుడిని, భారత రత్న ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ని. ఇద్దరిముందూ సాష్టాంగపడి నమస్కారాలు చేశాం. బిస్మిల్లాఖాన్‌ కి అత్యంత శ్రద్ధాభక్తులతో శాలువా కప్పాను. లలిత కళలకీ ముస్లింలకీ అవినాభావ సంబంధం. చిత్రకళ, కవిత్వం, సంగీతం, అభిరుచి, అందం -అన్నింటిలోనూ వారికి ప్రథమ తాంబూలం. అది వారి గొప్ప అదృష్టం. సమాజంలో అందరికీ గొప్ప అవకాశం.
పూర్తిగా చదవండి

Monday, August 26, 2013

మాలతీ చందూర్ జ్నాపకాలు

నేను పుట్టిన పదేళ్ళకి ఆవిడ మొదటి కథ పుట్టింది. పేరు 'రవ్వల దుద్దులు '. ఏలూరులో ఆవిడ చిన్నతనం గడిచింది. తెలుగు భాషని డ్రాయింగు రూముల్లోకి తెచ్చిన కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు, బంగారు మామని పరిచయం చేసిన కొనకళ్ళ వెంకట రత్నంగారు, ఎంకి - నాయుడు బావ సృష్టి కర్త నండూరు సుబ్బారావుగారు, 'బాలబంధు ' బి.వి.నరసింహారావుగారు మొదలైన వారు ఇంటికి తరచు వచ్చిపోతూండేవారు.
పూర్తిగా చదవండి

Monday, August 19, 2013

మళ్ళీ ఉల్లి

పేదవాడి జీవనాధారం ఉల్లిపాయ. మా చిన్నతనంలో మా అమ్మమ్మ పులుసిన చద్దన్నంలో కాస్త నూనె వేసి చేతికి చిన్న ఉల్లిపాయని ఇచ్చేది. ఇప్పటికీ తలుచుకున్నా మత్తెక్కించే ఆహారం అది. తెలంగాణాలలో ఇప్పటికీ బడుగుజీవులకు ముఖ్య ఆహారం గొడ్డుకారం. పచ్చి ఉల్లిపాయ, ఎండు మిరపకాయలు, ఉప్పు. ఇంతే.
పూర్తిగా చదవండి

Sunday, August 11, 2013

టొమాటోలు - ఉల్లిపాయలూ

ఒక్కొక్కప్పుడు ఉద్యమాల వల్ల సాధించేవాటికన్నా ఉద్యమాల కారణంగా కలిసివచ్చే మేళ్లు -కొండొకచో రుచికరంగానూ, కడుపునింపేవిగానూ ఉంటాయి. అలాంటి సందర్భం -ఈ మధ్య చెన్నైలో కనిపించింది. అవేమిటి? టొమాటోలూ, ఉల్లిపాయలూ, అల్లం. ఎలాగో చెప్తాను. ఈ మధ్య ఉధృతంగా తెలుగుదేశంలో ఉద్యమం సాగుతోంది. ఎటునుంచీ లారీలూ, వాహనాలూ కదలడం లేదు.
పూర్తిగా చదవండి