skip to main |
skip to sidebar
నేనూ మా ఆవిడా తాజ్‌మహల్ చూసి 51 సంవత్సరాలయింది. అప్పుడు ముగ్గురం కలిసి చూశాం. మేమిద్దరం, మా చేతిలో పదినెలల మా పెద్దబ్బాయి. అప్పుడే ఆలిండియా రేడియోలో చేరిన రోజులు. నా వయస్సు 24. మా ఆవిడ 22. ఢిల్లీ ట్రెయినింగ్‌కి పదిరోజులు పిలిచారు. ఢిల్లీ వెళ్లడం మా ఆవిడకి కొత్త. అప్పుడు నా జీతం 260 రూపాయలు (1963 మాట). అయితే అప్పటికే 'డాక్టర్ చక్రవర్తి' రాసి ఉన్నాను. కనుక కాస్త డబ్బు చేతిలో ఉన్న పరిస్థితి. మళ్లీ ఇలాంటి అవకాశం ఎప్పటికో? ఇద్దరం వెళ్లాలని నిశ్చయించుకున్నాం
పూర్తిగా చదవండి
ఓ యింటిముందు రాలుగాయి కుర్రాళ్లు సీనారేకు డబ్బాలు మోగిస్తూ అల్లరి చేస్తున్నారు. ఇంట్లో ముసలాయన గుండె ఆ శబ్ధానికి రెపరెపలాడుతోంది. ఆపమంటే ఆగరని తెలుసు. రోజూ అదేవరస. ఏం చెయ్యాలి? ముసలాయన అఖండమైన మేధావి. బయటికి వచ్చి వాళ్లందరినీ పిలిచాడు. ముసలాయన్ని అనుమానంగా చూశారు కుర్రాళ్లు. ఆపమంటే రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాని వాళ్లని ఆపమనలేదు. ''మీరెంతమంది?'' అన్నాడు.
పూర్తిగా చదవండి
మా పెద్దబ్బాయి చెన్నెలో ట్రావెల్స్ సంస్థని నడుపుతాడు. ప్రతీ రెండు మూడేళ్లకీ పాతబడిన, మరమ్మత్తుకి వచ్చిన కార్లని అమ్మి కొత్త కార్లని కొంటూంటాడు. కాని ఎన్ని ఏళ్ళయినా మార్చని, అమ్మని ఓ పాతకారుండేది. నాకు అర్థం కాలేదు. ''అన్నీ అమ్ముతున్నావు. దీన్ని ఎందుకు అమ్మవు?'' అన్నాను. మా అబ్బాయి నవ్వాడు. గర్వంగా సమాధానం చెప్పాడు. చెన్నైలో చీపాక్ గ్రౌండుకి ఒకసారి సచిన్ టెండూల్కర్ ఆ కారులో వెళ్లాడట. అది ఒక గొప్ప అనుభవానికి గుర్తు. ఈ కారు ఒక జ్ఞాపిక. అదీ 41 సంవత్సరాలుగా క్రికెట్‌ని ఆరాధిస్తున్న ఓ భక్తుడి తాదాత్మ్యం.
పూర్తిగా చదవండి..
వ్యాపార లావాదేవీలలో ఎప్పుడూ ముగ్గురుండాలి (రాజకీయం వ్యాపారమయి చాలాకాలమయింది). మొదట ఇద్దరు చర్చలు జరుపుతారు. మూడో వ్యక్తి ఆ చర్చలకి దూరంగా ఉంటాడు. తీరా నిర్ణయాలన్నీ జరిగిపోయాక -వాటిని ఆ మూడో వ్యక్తి వింటాడు. ఇందులో ఎవరికి నచ్చకపోయినా, కొత్త కిరికిరి పెట్టాలన్నా ఈ మూడో వ్యక్తికి వెసులుబాటు ఉంటుంది. అన్నీ తమకి అనుకూలంగా లేకపోతే ఆ ఒప్పందాన్ని గంగలో కలిపే అవకాశమూ అతనికే ఉంటుంది. అంటే ఏతా వాతా ఏ ఒప్పందానికయినా ఆఖరి నిర్ణయం దూరంగా నిలిచిన ఈ మూడో పెద్దమనిషిది.
పూర్తిగా చదవండి
కురుక్షేత్రంలో కర్ణుడు అర్జనుడి బాణాలకు కూలిపోయాక - రణరంగంలో పాండవులు శ్రీకృష్ణుడు వెంటరాగా అతని దగ్గరకు వచ్చారు. "ఇదా నువ్వు సాధించదలచిన విజయం?" అంటూ ఎకసెక్కం చేశాడు ధర్మరాజు. కర్ణుడు చిరునవ్వుతో ఒక మాట అన్నాడు: "నేను జీవితమంతా అక్కరతో చెయ్యిజాచిన వాడిని లేదనకుండా ఆదుకున్నాను. జీవితమంతా ఒకే వ్యక్తితో (భార్యతో) జీవనం గడిపాను. జీవితంలో ఒక్కరికే (దుర్యోధనుడు) విధేయుడిగా జీవించాను. జీవితం ఆఖరి క్షణాలలో దేవుడిని తలుచుకోవడం లేదు. దేవుడే నా సమక్షంలో నిలబడ్డాడు. నాకన్న అదృష్టవంతుడు ఎవరుంటాడు?"
పూర్తిగా చదవండి
నూరేళ్ల కిందట భారతీయ సినిమా మన దేశంలో అప్పటికి ఉన్న అన్ని పరిమితులనూ పుణికి పుచ్చుకుని పురుడుపోసుకుంది. ప్రపంచ సినిమాకు కలిసివచ్చిన అదృష్టం -సిమోన్ వాన్ స్టాంపర్, డి.డబ్ల్యూ. గ్రిఫిత్, చార్లీ చాప్లిన్ వంటి వైతాళికులు మనకి లేరు. అయితే మన అదృష్టం -చిత్తశుద్దీ, కర్తవ్య దీక్షాగల ఒక స్వాప్నికుడూ, కార్యసాధకుడూ మన సినిమాకి కలిసివచ్చారు. ఆయన దాదా సాహెబ్ ఫాల్కే. కదిలే ఫిలింల ఫ్రేములు దగ్గర్నుంచి, కెమెరా కవాటాల దగ్గర్నుంచి, ఎడిటింగు వరకూ ప్రతీదీ 'ఓం నమ:' అంటూ ఆద్యంతమూ పరిశీలించి ఒడుపుని సాధించిన మహానుభావుడు ఫాల్కే.
పూర్తిగా చదవండి
ఆ మధ్య అట్లాంటాలో ఓ మిత్రుడి ఇంట్లో ఉన్నాం నేనూ మా ఆవిడా. ఆయన రచయిత. ఆయన కూతురు చాలా అందమయినది. చురుకయినది. అయితే విపరీతమైన పెంకితనం. కాగా, ఏ కారణం చేతయినా తల్లిదండ్రులు పసిపిల్లల వొంటిమీద చెయ్యి వెయ్యరాదు -అనేది అమెరికాలో పెద్ద నిబంధన. ఆ విషయం స్కూలుకి వెళ్లిన తొలిరోజుల్లోనే పిల్లలకి చెప్తారట -అలాంటిదేదయినా జరిగితే ఫలానా నంబరుకి ఫోన్ చెయ్యమని. కనుక పిల్లలకి ఒక మొండి ధైర్యం వస్తుంది.
పూర్తిగా చదవండి