skip to main |
skip to sidebar
నిన్నకాక మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు ఎన్నో కొత్త విషయాల్ని చెప్పక చెప్తున్నాయి. ఇప్పటికే రాజకీయ నాయకులకీ, దేశానికీ అర్థమయ్యే విషయం -చదువుకున్న వాడి దగ్గర్నుంచి, మామూలు మనిషి వరకూ రాజకీయ పార్టీల నైచ్యాన్నీ, నమ్మకద్రోహాన్నీ, అవినీతినీ, బుకాయింపునీ, నిరంకుశత్వాన్నీ, గూండాయిజాన్నీ, దోపిడీని, రంకుతనాన్ని గమనిస్తున్నారని, అసహ్యించు కుంటున్నారని. అవకాశం వచ్చినప్పుడల్లా స్పష్టంగా తమ అసహ్యాన్నీ, అసహనాన్నీ ప్రకటిస్తున్నారనిపూర్తిగా చదవండి
సినిమా తెరకెక్కి వందేళ్లయింది. నేను సినిమాకెక్కి ఏభై యేళ్లయింది. 1913లో దాదా సాహెబ్ ఫాల్కే 'రాజ హరిశ్చంద్ర' మొదటి చిత్రం. 1963లో 'డాక్టర్ చక్రవర్తి' నా మొదటి చిత్రం. సినిమాతో నా బంధుత్వాన్ని చెప్పడాని కే, చెప్పడం వరకే ఈ విషయం.నేను సినిమాలో తొలిపాఠాలు నేర్చుకున్న రోజుల్లో -సినిమా బాగా ఆడడానికి ఏయే హంగులు ఉండాలో ఎవరూ ప్రసస్తంగానయి నా మాట్లాడిన గుర్తులేదు. వ్యాపారపరంగా ఏ సినిమా డబ్బు చేసుకుంటుందో కూడా చెప్పిన గుర్తు లేదుపూర్తిగా చదవండి
వరం అర్హతతో వచ్చేదికాదు. సాధించుకుంటే దక్కేది కాదు. అప్పనంగా కొట్టేసేది. అది దేవుడయినా, యజమాని అయినా, నాయకుడయినా -ఆయన ఇష్టప్రకారం ఇచ్చేది. దాని పరిమితి ఎదుటివాడి దయా దాక్షిణ్యం. హిరణ్యకశిపుడు చావులేని వరం అడిగాడు. ''అది కుదరదు. ఎలా చావకూడదనుకున్నావో చెప్పు'' అన్నాడు బ్రహ్మదేవుడు
పూర్తిగా చదవండి
గొప్ప గాయకుడు, కవి, రచయిత, మిత్రుడు -యివన్నీ నేలబారు విశ్లేషణలు. ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు (పి.బి.శ్రీనివాస్)కి యివేవీ సరిపోవు. ఇవన్నీ ఎవరయినా సాధించగలిగినవి. సాధిస్తున్నవీను. ఆయన బ్రతుకు రహస్యం తెలిసిన మనిషి. ఆద్యంతమూ జీవించిన మనిషి. ఆ మధ్య చాలా జబ్బుపడి కోలుకున్నారు. నేను నా నలభైయ్యేళ్ల పరిచయంలో ఏనాడూ ఆయన నిస్పృహతో, నిరాశతో, నిస్సత్తువతో, దైన్యతతో ఉండగా చూడలేదు. ఎప్పుడూ ఆనందంగా -ఎదుటివాడిలో మంచిని గుర్తిస్తూ, కీర్తిస్తూ జీవించిన యోగి. అదీ ఆయన ఆరోగ్య రహస్యం.
పూర్తిగా చదవండి
భారతీయ జ్ఞానపీఠ పురస్కారం మన దేశస్థాయిలో నోబెల్ బహుమతి లాంటిది. జాతీయస్థాయిలో అన్ని భారతీయ భాషలలోనూ ఉత్తమ రచయితగా నిలిచి జ్ఞానపీఠాన్ని అధిరోహించడం -తెలుగు దేశానికి, తెలుగు రచయితకి ఇది మూడవసారి. 1970లో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణకు 'రామాయణ కల్పవృక్షం' రచనకు బహుమతి లభించింది. 1988లో పద్మభూషణ్ సి.నారాయణ రెడ్డిగారికి ''విశ్వంభర'' రచనకిగాను జ్ఞానపీఠ పురస్కారం దక్కింది. ఇప్పుడు రావూరి భరద్వాజకు -వారు రచించిన ''పాకుడురాళ్లు'' నవలకి.
పూర్తిగా చదవండి
గొప్పగా మాట్లాడేవారంతా గొప్ప వక్తలు కారు. అలాగే గొప్ప వక్తలంతా గొప్ప విషయాలను మాట్లా డనక్కరలేదు. రెండో నిజానికి గొప్ప ఉదాహరణ -మన రాజకీయ నాయకులు. మరో అనర్థమైన ఉదాహరణ హిట్లర్. జాతిని ఊపి ఉర్రూతలూగించి -తన దౌష్ట్యాన్ని అంత గొప్పగా సబబనిపించేలాగ మాట్లాడే వక్త బహు శా మానవ చరిత్రలో మరొకరు లేరేమో.
పూర్తిగా చదవండి
అమెరికాలో ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం కులపతికి అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. అటునుంచి ఓ వ్యక్తి ఆతృతగా అడుగుతున్నాడు: ''112 మెర్సన్ స్ట్రీట్‌కి ఎటువెళ్లాలో చెప్పగలరా?'' అని. ఆ ప్రశ్నని వినగానే ఈ కులపతి దిగ్గునలేచి కూర్చున్నాడు. ''బాబూ, మీరెవరో తెలీదు కాని -ఇంత అర్ధరాత్రి అంత పెద్దాయన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు?'' అన్నాడు
పూర్తిగా చదవండి