Sunday, May 29, 2011

భక్తిమార్గాలు

'మతం' రేపర్లో చుట్టడం వల్ల - మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలా విషయాల పరమార్ధం మరుగున పడిపోతుంది. మతం నిజానికి రంగు కళ్ళద్దం. ఈ దేశంలో మతం అన్నమాట శతాబ్దాల క్రితం లేదు. ఆ మాటకి వస్తే ఎక్కడా లేదు. ఏ పురాణాల్లోనూ ఈ మాట కనిపించదు. ఆ రోజుల్లో మనకున్నది సనాతన ధర్మం. న్యాయంగా 'ధర్మం' అంటే చాలు. అది ఆనాటిది కనుక 'సనాతనం' చేర్చాం. నిజానికి ఈ ధర్మం ప్రతి మతానికీ వర్తిస్తుంది. మనిషి చెయ్యాల్సిన విధి. ప్రవక్తల, మహానుభావుల, ప్రవచనాల, ప్రభోధాల అర్ధం ఇదే. ఈ గొడవ ఇక్కడికి చాలు.

Monday, May 23, 2011

పాపం..?

తమిళనాడు ఎన్నికలకు ముందు ఎన్ డీ టీవీ పాత్రికేయురాలు బర్ఖాదత్ కరుణానిధిగారిని చెన్నైలో ఓ ప్రశ్న వేసింది. "జయలలిత గురించి తమరు చెప్పేదేమైనా ఉన్నదా?" అని. కరుణానిధిగారు క్లుప్తంగా "పాపం" అన్నారు. బర్ఖాదత్ కిసుక్కున నవ్వుకుంది.
కరుణానిధిగారు నాస్తికులు కనుక, వారికి పాపపుణ్యాల మీద నమ్మకం ఉండదు కనుక ఈ పాపానికి అర్ధం జయలలిత మీద జాలో, రోగం కుదురుతుందన్న వ్యంగ్యమో అనుకోవాలి . ఇది జరిగి కేవలం నెలరోజులు కూడా కాలేదు.

Monday, May 16, 2011

చీకట్లోకి ప్రయాణం

దాదాపు 40 ఏళ్ళు పైగా నా మనస్సులో నిలిచిన ఒక వాక్యం ఉంది."కథ బ్రహ్మ దేవుడి ఆఖరి వ్యసనం" అని. ఇది ఎప్పుడూ నాకు గుర్తొచ్చే వాఖ్య. బ్రహ్మదేవుడు అందమయిన ముఖాన్ని,శరీరాన్ని, సౌష్టవాన్ని సిద్ధం చేశాక ఆయన చెయ్యాల్సిన ఆఖరి పని - ఆ బొమ్మకి ఒక కథని నిర్దేశించడం. ఈ సృష్టిలో కోట్లాది కథల్ని సిద్ధం చేసిన గొప్ప కథా రచయిత, సృష్టి కర్త - బ్రహ్మ దేవుడు. ఇది చాలా అందమయిన ఆలోచన.
ప్రస్తుతం నేను అబూదాబీలో ఉన్నాను.

Monday, May 9, 2011

తోటికోడలు నవ్వింది

పాకిస్తాన్ కి తనదైన గొప్ప చరిత్ర ఉంది. ఆ దేశం అవతరించినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఎక్కువగా సైనిక నియంతల పాలనలోనే ఉంది. కాగా, ఇప్పటి ప్రజాస్వామ్యానికీ గొప్ప చరిత్ర ఉంది. ఎన్నో అవినీతి నేరాలకి అరెస్టయి, జైలుకి వెళ్ళి, దేశాన్ని వదిలి పారిపోయిన ఒక నేరస్థుడు జర్దారీగారు - కేవలం బేనజీర్ భుట్టో భర్త అయినందుకే, అదృష్టవశాత్తూ ఆమె హత్య జరిగినందుకే ఆ దేశపు అధ్యక్షుడయారు. ఇది ఆ దేశానికి గొప్ప కిరీటం.
నిజానికి రాజకీయ దౌత్యంలో - ఒక దశలో - అద్భుతమైన అవగాహన చూపించి, ప్రపంచమంతటికీ - ఒక్క ఇండియాకి తప్ప -స్నేహితుడయిన దేశంగా పాకిస్థాన్ ని నిలిపింది అయూబ్ ఖాన్ అని చెప్పుకుంటారు

Monday, May 2, 2011

కుక్కమూతి పిందెలు

ఈ కాలమ్ కీ సత్యసాయిబాబా దేవుడా? అవతార పురుషుడా? అన్న ప్రశ్నలకీ ఎటువంటి సంబంధంలేదు.
1964 మే 27 సాయంకాలం ఢిల్లీ నుంచి తెలుగువార్తల ప్రసారం ప్రారంభమయింది. "మన ప్రియతమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇకలేరు" అని న్యూస్ రీడర్ చదువుతూంటే అతని గొంతు వణికింది. దుఃఖంతో గొంతు బొంగురుపోయింది. ఆ రీడర్ పేరు రామచంద్రరావు. ఆ ఒక్క కారణానికే అతని ఉద్యోగం పోయింది.