Sunday, December 26, 2010

పాకీ ఉల్లి

ఈ దేశంలో ప్రభుత్వాలు కూలాలంటే - ఓట్లు అవసరం లేదు, నోట్లు అవసరం లేదు, ఆమరణ దీక్షలు అవసరం లేదు, ర్యాలీలు అవసరం లేదు. చాణిక్యుడికి కూడా అందని రాజనీతి ఒకటుంది. అది అతి సాదా సీదా వస్తువు. చూడడానికి చిన్నదేకాని కొంపలు ముంచుతుంది. ప్రభుత్వాల్ని దించుతుంది. దాని ఫేరు ఉల్లిపాయ.
పూర్తిగా చదవండి

Monday, December 20, 2010

ధర్మరాజుల కాలం

'నిజం'కు ఒక్కటే సమాధానం. అబద్దానికి ఆరు రకాల సమాధానాలు . రెండు రెళ్ళు ఎంత? నిజం చెప్పాల్సి వస్తే - నిద్రలో లేపినా ఒక్కటే సమాధానం. నాలుగు. మరి 'రెండు రెళ్ళు ఎంత? ' కి అబద్దపు సమాధానం? ఆరు కావచ్చు. ఏడు కావచ్చు. అరవై కావచ్చు. ఏదీ కాకపోవచ్చు. అతి స్తూలంగా ఒకనాటి నా నాటిక 'రెండు రెళ్ళు ఆరు 'కి ముడి ఇదే. నిజాయితీ పరుడికి ఒకటే దారి. ఆత్మవంచన

Sunday, December 12, 2010

చీమలు..చీమలు..

దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట త్యాగరాజస్వామికి టెడ్ విల్సన్ తారసపడి ఉంటే హరికాంభోజి రాగంలో ’రామ నన్ను బ్రోవరా’ కీర్తన రాసేవాడు కాదు. రాసినా మరో విధంగా రాసేవాడేమో. ’చీమ’ వంటి నిస్సహాయమైన. అతి చిన్నప్రాణిలో భగవంతుడిని చూసిన అమాయక ప్రాణి త్యాగరాజు. అయితే చీమ ఆయన అనుకున్నంత నిస్సహాయమైన్ ’అల్పజీవి’ కాదు. (యూ ట్యూబ్ లో చీమల కథలు చదవండి - కళ్ళు తిరిగిపోతాయి.)
పూర్తిగా చదవండి

Sunday, December 5, 2010

రామ్ తెరీ గంగా మైలీ

సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మొన్న మన పాలక వ్యవస్థకి మంచి కితాబునిచ్చారు. గత ముప్పై సంవత్సరాలలో గంగానదిలో పేరుకున్న కాలుష్యం కన్న దరిద్రమయిన స్థాయిలో దేశంలో అవినీతి ఉన్నదని.
మనదేశం ప్రజాస్వామిక దేశం అంటూ మన నాయకులు చంకలు గుద్దుకుంటూ ఉంటారు. అంటే ప్రజలు ఎంపిక చేసిన నాయకులు పాలించాలని. కాని ఈ మధ్య ఏ నాయకులూ ఏ అవినీతిమీదా నిర్ణయాలు తీసుకోవడం లేదు. శిక్షలు విధించడం లేదు. ఎవరా నిర్ణయాలు తీసుకుంటూన్నారు? సుప్రీంకోర్టు. నిజానికి ముఖ్యమైన నిర్ణయలన్నీ సుప్రీం కోర్టు తీసుకుంటోంది ఇటీవల.