Monday, December 28, 2009

కొత్త సిం హం కథ

వెనకటికి ఒకాయన బెర్నార్డ్ షా నాటకాల్లో నీకు నచ్చిందేమిటని నాటకాల అభిమానిని అడిగాడట.

ఆండ్రోకిస్ అండ్ ది లైన్అన్నాడట అభిమాని.

అందులో నీకు నచ్చిన పాత్ర?

తడువుకోకుండా సమాధానం చెప్పాడట అభిమాని సింహంఅని.

పూర్తిగా చదవండి

Monday, December 21, 2009

చిన్న చికిత్స

తొమ్మిది గంటలకి షూటింగ్ కాల్ షీట్ వుంటే అక్కినేని 8 గంటలకే మేకప్ రూంకి వచ్చి మేకప్ చేసుకుని 9 గంటలకి సిద్ధంగా వుండడం నాకు తెలుసు. ఆయన సినీ పరిశ్రమలోనే సీనియర్. వయస్సులో అందరికంటే పెద్ద. ఒక్క అడుగు వెనక వచ్చినా ఎవరూ ఆక్షేపించరు. పైగా అందరూ అర్ధం చేసుకుంటారు. ఓసారి ఆయన్ని అడిగాను: కాస్త మెల్లగా రావచ్చుకదా అని. ఆయన సమాదానం నన్ను ఆశ్చర్యపరిచింది.
పూర్తిగా చదవండి

Monday, December 14, 2009

హిరణ్యకశిపుడి భయం

మొన్న సోమవారంనాడు కోపెన్ హాగన్ లో ప్రారంభమయిన ప్రపంచ రాజ్యాల సమావేశం- గొప్ప చరిత్ర.. 110 దేశాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇది చరిత్ర అనడానికి కారణం- ఈ ఈ దేశాలు సాధించిన ఘనకీర్తి కాదు. ఈ దేశాలు ఈ భూగోళాన్ని తగలెట్టడానికి ఇన్ని సంవత్సరాలూ చేసిన నిర్వాకం.
పూర్తిగా చదవండి

Monday, December 7, 2009

కమీషన్లు-కమామీషు

వెనకటికి ఒకాయన అడిగాడు: రైల్వే టైంటేబిల్ వల్ల లాభం ఏమిటని. చాలా పెద్ద లాభమే వుంది. రైళ్ళు ఎప్పుడెప్పుడు, ఎలా సమయానికి రావడం లేదో మనం అర్ధం చేసుకు ఆనందించవచ్చు. లేదా క్రమశిక్షణతో ఎప్పుడూ ఎలా లేటవుతాయో తెలుసుకోవచ్చు.అయితే ఎందుకు? చస్తే ఈ ప్రశ్నకు దేవుడుకూడా సమాధానం చెప్పలేడు.
పూర్తిగా చదవండి

Monday, November 23, 2009

"చెత్త" నోబెల్

కేంద్ర మంత్రి జయరాం రమేశ్ ఈ మధ్య ఓ గొప్ప నిజాన్ని వక్కాణించారు. "దుమ్ము దూసర చెత్తకు ఏదైనా నోబెల్ బహుమతి వుంటే మన దేశానికి పోటీ లేకుండా ఆ బహుమతి దక్కుతుంది” అని.
వెంటనే దుమారం లేచింది. ఈ దేశంలో ఓ గొప్ప సంప్రదాయం వుంది. అధికారంలో వున్న పార్టీలు ఎప్పుడూ అబద్దాలే చెప్పాలి. ఎదుటి పార్టీలు నిజాలు చెప్పాలి. అధికార పార్టీ చెప్పిందికనుక ఎప్పుడూ అబద్దం నిజంగానే చెలామణీ అవుతుంది. ప్రత్యర్ధులు చెప్పారు కనుక నిజం ఎప్పుడూ అబద్దంగానే కనిపిస్తుంది. ఇది అబద్దమని సీబీఐ, పోలీసులు, కొండొకచో న్యాయస్థానాలూ సమర్దిస్థాయి. ఈ వ్యవస్థనే తెలుగులో "ప్రజాస్వామ్యం” అంటారు.
పూర్తిగా చదవండి

Monday, November 16, 2009

సాంబారు వడ కధ

ఇప్పుడిప్పుడు రాష్ట్రమంతా వచ్చే దిన పత్రికలకు జిల్లా అనుబంధాలు వచ్చాయి. జాతీయ స్థాయిలో పది మందీ తెలుసుకోవలసిన వార్తల్ని- బొత్తిగా అనుభవం చాలని స్థానిక సంపాదకులు- జిల్లా అనుబంధానికి అంటగట్టి మరిచిపోవడం కద్దు.
ఒకటి రెండు ఉదాహరణలు. విజయనగరంలో దాదాపు 28 సంస్థలు ఒకటయి- ఏటేటా గురజాడ అప్పారావు స్మారక పురస్కారం యిస్తారు. ఇది విజయనగరానికీ, పుచ్చుకునేవారికీ గర్వకారణం.- అప్పారావుగారి స్మృతి చిహ్నం కనుక. చాలా సంవత్సరాలు- యిప్పటికీ కూడానేమో- ఇలాంటి వార్తలు జిల్లా తోకపత్రికల్లో మాయమవుతూంటాయ్.
పూర్తిగా చదవండి

Monday, November 9, 2009

రాజ నర్తకి పరిష్వంగం

నాకు చాలా యిష్టమయిన జోక్ ఒకటుంది. నిజానికి ఇది అబ్బూరి రామకృష్ణారావుగారు తమ ఉపన్యాసాల్లో -ఆ రోజుల్లో- తరుచు చెప్పేవారు.
వెనకటికి ఒకాయన అనాధ శరణాలయానికి సహాయం చెయ్యమని ఉత్తరం రాశాడట. ఉత్తరం చూసుకున్న పెద్దమనిషి బాగా ఆలోచించి ఇద్దరు అనాధల్ని పంపాడట.
అహింసకీ, శాంతికీ ప్రతీకగా నిలిచిన మహాత్మాగాంధీ పుట్టిన రోజునాడు ఆన్నార్తులకు రుచికరమైన చికెన్ బిరియానీ పంచితే ఎలావుంటుంది?
పూర్తిగా చదవండి

Wednesday, November 4, 2009

పుస్తకం డాట్ నెట్ లో నా ఇంటర్వ్యూలు

నేను నా పద్నాలుగోయేటనుంచీ రాస్తున్నాను. అప్పటికే ఏదో చదివేవాడిని. మెల్లగా కూడబలుక్కుని ఇంగ్లీషు కథలు చదివిన గుర్తు. నా మొదటి కథకూడా ఏదో ఇంగ్లీషు కథ పట్ల అవగాహనతో రాసిందనుకుంటాను. మా అమ్మగారు భారత రామాయణాలు శ్రావ్యంగా చదివేవారు. చిన్నతనంలో ఆ స్పూర్తి కొంత ఉపకరించిందని ఇప్పుడు అనిపిస్తుంది. ఏమైనా ఇది ప్రశ్నని బట్టి మెదడులో వెదుకులాటే!
మొదటి భాగం
రెండో భాగం

Sunday, November 1, 2009

ఓ అజ్ఞాని ఆవేదన

ఇన్నేళ్ళొచ్చినా నాకు లోకజ్ణానం పెరగలేదు. పైగా రాజకీయ జ్ణానం బొత్తిగా కలగలేదు. ప్రాంతీయ జ్ణానం బొత్తిగా కలిసిరాలేదు. కనుక ఈ కాలమ్ ని ఓ అజ్ణాని కాలమ్ గా విజ్ణులు చదువుకోవాలని నా మనవి.
చిత్రకారుడు ఎమ్.ఎఫ్.హుస్సేన్ గారు ప్రముఖులు. సాయిబుగారు. మనదేశంలో మనం ముస్లింలను గౌరవించి నెత్తిన పెట్టుకున్నట్టు ముస్లిం దేశాలే చేస్తున్నట్టు కనిపించదు. ప్రముఖ గజల్ గాయకుడు మెహదీ హస్సన్ పాకిస్థాన్ లో అనారోగ్యంతో డబ్బులేక ఆస్పత్రిలో ఉన్నాడని పేపర్లో చదివాను. మన దేశంలో బిస్మిల్లా ఖాన్ భారతరత్న. జకీర్ హుస్సేన్, ఫక్రుద్దిన్ ఆలీ అహమ్మద్, అబ్దుల్ కలాం గారలు మనకు గౌరవనీయులైన అద్యక్షులు. అబ్దుల్ కలాంగారు భారతరత్న.
పూర్తిగా చదవండి

Monday, October 26, 2009

కొత్తదేవుళ్ళు

ఈ మధ్య ఓ వార్త చదివాను. మీరత్ లో మీనాక్షిపురం అనే గ్రామంలో (నిజానికి యిలాంటి పేరున్న గ్రామం దక్షిణాదిన వుండాలి) సైనీ అనే తెగవారు ఈ దీపావళికి కొత్తరకం దేవుడి బొమ్మలు తయారు చేస్తున్నారట. ఆ బొమ్మలు గణేశ్, లక్ష్మి. (నిజానికి లక్ష్మీ గణపతి విగ్రహం, ఆరాధన ఆంధ్ర దేశంలో ఉభయ గోదావరుల్లో ఎక్కువగా చూశాను నేను. లక్ష్మి తొడమీద కూర్చోబెట్టుకున్న పది చేతుల గణపతి ఓ ప్రత్యేకమైన పూజా ప్రక్రియకి సంకేతం.)
పూర్తిగా చదవండి..

Monday, October 19, 2009

కొత్త నీరు

ఈ మధ్య హైదరాబాదులో టీవీ చూస్తూ ఓ కొత్త సినీమా శీర్షిక కనిపించగానే ఆనందంతో హాహాకారాలు చేశాను. ఆ చిత్రం పేరు: "సారీ, మా ఆయన ఇంట్లో వున్నాడు”
దాదాపు 27 సంవత్సరాల క్రితం "ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య” పెద్ద హిట్ అయినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మెచ్చుకున్నారుగాని ఒకే ఒక్క సమీక్ష నాకు బాగా గుర్తుండిపోయింది. అది చేసింది నిర్మాత నవతా కృష్ణంరాజుగారు. "ఆ సినీమాలో చిన్న బూతు వుందండీ. అది ఆడియన్స్ కి బాగా పట్టింది” అన్నారు.
పూర్తిగా చదవండి

Monday, October 12, 2009

విపత్తు- విపరీతం

చరిత్రలో ఎన్నడూ వూహించని విపత్తు ఆంధ్రరాష్ట్రంలో జరిగింది. కృష్ణా, గుంటూరు, మెహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాలలో కృష్ణా, తుంగభద్ర నదీజలాలు సృష్టించిన భీభత్సం భయానకం, నష్టం హృదయ విదారకం.
పూర్తిగా చదవండి

Monday, October 5, 2009

రెండు నేరాలు - రెండు న్యాయాలు

రెండు ఆసక్తికరమైన సంఘటనలు ఈ మధ్య జరిగాయి. రెండింటికీ చిన్న పోలిక వుంది. పెద్ద వైరుధ్యముంది. రెండింటిలోనూ నేరం నుంచి పరారి వుంది. సమర్దన వుంది. చెప్పరాని క్లేశముంది. అర్దంలేని ఆత్మవంచన వుంది.
పూర్తిగా చదవండి

Wednesday, September 30, 2009

రేడియో తాతయ్య

ఈ తరంలోనే కాదు ఆ నాటి తరంలో కూడా చాలామందికి అంతగా తెలియని రేడియో తాతయ్య గురించి సాక్షి లో నేను వ్రాసిన వ్యాసాలు. ఇంతవరకూ మీరు చదివి ఉండకపోతే ఇప్పుడు చదవండి.

మొదటి భాగం రెండో భాగం

Monday, September 28, 2009

ఎస్.వరలక్ష్మి అస్తమయం

"బాలరాజు’ సినీమాని నా తొమ్మిదో యేట మా అమ్మ వొడిలో కూర్చుని చూశాను విశాఖపట్నం మంగరాజుగారి పూర్ణా హాలులో. అది ఎస్.వరలక్ష్మిగారి మొదటి సినీమా. ఆ రోజుల్లో సినీమా అంటే ఓ వింత ప్రపంచంలోకి తొంగి చూడడం లాంటిది. నటీనటులు ఏ గంధర్వ లోకం నుంచో దిగివచ్చినట్టు అబ్బురంగా వుండేది. విభ్రమంతో, చొంగలు కారుతూ ప్రేక్షకులు చూసేవారు. వారిలో ఓ తొమ్మిదేళ్ళ కుర్రాడూ ఉన్నాడు.
పూర్తిగా చదవండి

Sunday, September 20, 2009

ఢిల్లీకి కొత్త గొడ్డు

ఈ మధ్య ఢిల్లీకి ఓ అందమయిన మంత్రి చేరారు. ఆయన న్యూయార్కునుంచి తెలివైన వ్యాసాలు రాయగా మనం పత్రికలలో చదువుకున్నాం. మనకి సంబంధించని విషయాలు ఆయన చెప్తూంటే ఆనందంగా విన్నాం. ఐక్యరాజ్య సమితిలో కబుర్లు పొరుగింటి పుల్లకూరలాంటివి. అవి వూరి, రుచి ఎక్కి నోరూరిస్తాయి. అవి విని, తిని మనం తృప్తిపడ్డాం. ఇంతకీ ఆయన పేరు శశి తరూర్. ఆయన ఆ మధ్య ఐక్య రాజ్య సమితి కార్యదర్శి కావాలని మనమంతా ఆశించాం. కొన్ని దేశాలు మద్దతు పలికాయి. ఆయన న్యూయార్కులో కార్యదర్శి అయి అక్కడి కబుర్లూ కాకరకాయలూ మనకి చెప్తూంటే మనకి తియ్యగా, పుల్లగా వినసొంపుగా వుండేవి. కాని బన్ కె మూన్ అనే ఆయన కార్యదర్శి అయిపోయారు. అటు తర్వాత ఈ అందమయిన ఉద్యోగి మనమంతా యిచ్చిన మద్దతుకి మురిసి, అది తన పరపతిగా అపార్ధం చేసుకుని- ఈ అందమయిన మేధావి ఇండియా వచ్చి - తన రాష్ట్రానికి వెళ్ళి- మొదటి సారిగా ఖద్దరు కండువా ధరించి- దేశభక్తి కబుర్లు దంచి "తెలివైన వాడు, ఉండదగిన వాడు’అని వోటర్ ని మెప్పించి, ఢిల్లీ అధిష్టానానికీ ఇలాంటి దురబిప్రాయమే కలిగించి మంత్రి అయిపోయాడు.
పూర్తిగా చదవండి

Monday, September 14, 2009

గ్లామర్ అవినీతి

నాకు జర్దా కిళ్ళీ అలవాటు చేసింది మిత్రులు, దర్శకులు కె.విశ్వనాధ్. "చెల్లెలి కాపురం” సినీమాకి కధా చర్చలు జరిపే రోజుల్లో. మంచి ఆలోచన చేసినప్పుడల్లా ఉప్పొంగిపోయి తనూ ఒక కిళ్ళీ కట్టుకుని నాకూ ఒకటి యిచ్చేవారు. మంచి ఆలోచనా, చిన్న మత్తూ- రెండూ ఆనందంగా వుండేవి యిద్దరికీ. క్రమంగా మత్తే ఆలోచనయి, క్రమంగా వ్యసనమయి దాదాపు 20 సంవత్సరాలు స్థిరపడింది. నాకంటె విశ్వనాధ్ ముందు మానేశారు. నా జీవితంలో వ్యసనంగా చెప్పుకోవలసిందీ, మానెయ్యడానికి యాతన పడవలసింది జర్దా కిళ్ళీయే.
పూర్తిగా చదవండి

Monday, September 7, 2009

ఒక నివాళి- ఒక విశ్లేషణ

నా అరవయ్యో యేట రాజకీయాలనుంచి వైదొలగుతాను- అన్నారు రాజశేఖరరెడ్డి ఆ మధ్య. ఈ మధ్య ఎవరో ఆ ప్రస్థావన తెస్తే "ఒకటి రెండు పనులు చక్కబెట్టి ఆ పని చేస్తాను” అన్నారు.
పూర్తిగా చదవండి

Sunday, August 30, 2009

కాలం వెనక్కి తిరగదు

చాలా సంవత్సరాల క్రితం - ఇప్పుడా స్నేహితుడి పేరు కూడా గుర్తు లేదు- మేం తిరుపతి యాత్రకి కారులో వెళ్తున్నాం. పుత్తూరు దాటగానే- మా చుట్టూ వున్న కొండల్ని చూస్తూ "మారుతీరావుగారూ, మీకు తెలుసా? ఈ కొండలు సంవత్సరాల తరబడి సముద్ర గర్భంలో వుండగా ఏర్పడినవి. ఇలాంటి శిలలు సంవత్సరాల నీటి రాపిడితో యిలా నునుపు తేరుతాయి” అన్నాడు.
పూర్తిగా చదవండి

Sunday, August 23, 2009

కుర్రాడి పన్నుకధ

ఎనిమిదేళ్ళ కుర్రాడు బొత్తిగా ఏమీ తెలీని దశలో మేష్టారిని తిట్టాడు. మేష్టారికి కోపం వచ్చి చెంప మీద కొట్టాడు. కుర్రాడి పన్ను రాలిపోయింది. తిట్టు ఎవరికీ గుర్తు లేదుకాని చేతిలో పన్ను కనిపిస్తోంది. మేష్టారిని అందరూ నిలదీశారు. ఈ కధకి ప్రత్యామ్నాయం కధ- నిన్న మొన్నటి జిన్నా రచయిత జస్వంత్ సింగ్ గారిది

Wednesday, August 19, 2009

Sunday, August 16, 2009

'రేపు' దోపిడీ

బహుశా ఎవరూ ఈ విషయాన్ని ఆలోచించి ఉండరు. మనల్ని ప్రతిరోజూ, ప్రతీ క్షణం ఎవరో ఒకరు దోచుకుంటున్నారు. నమ్మించి మోసం చేస్తున్నారు. మనల్నికాపాడవలసిన వాళ్ళే మనల్ని కబళిస్తున్నారు. పోలీసు స్టేషన్లో పోలీసులు మానభంగాలు చేస్తున్నారు. నిన్ననే చెన్నైలో పోలీసులు ఇన్ కమ్ టాక్స్ అధికారులుగా నటించి ఓ నగల వ్యాపారిని కొల్లగొట్టారు. రాజకీయ నాయకులు మోసాలు చేసి సమర్థించుకొంటున్నారు, అధికారులు లంచాలు తీసుకుని సమాజాన్ని గుల్ల చేస్తున్నారు. కాని మనిషి మనుగడ సజావుగా , ఏ పొరపొచ్చాలూ లేకుండా , నమ్మకంగా, తనగురించి ఆలోచించకపోయినా ఎటువంటి మోసమూ, కల్తీ లేకుండా మనకి సేవ చేసే శక్తి ఒకటి ఉంది. దాని పేరు ప్రకృతి.
పూర్తిగా చదవండి..

Monday, August 10, 2009

దొంగ మెలోడ్రామా

ఒక చక్కని డిటెక్టివ్ కధ.
ఫమీదా అనే యిల్లాలు. హనీఫ్ సయ్యద్ భర్త. ఇద్దరూ తమ దేవుడినీ, మతాన్నీ ప్రేమిస్తారు. ఆ రెంటికీ దూరమయిన వాళ్ళని ద్వేషిస్తారు. అంతేకాదు. వాళ్ళని నాశనం చేసే కుట్రకూడా చేస్తారు. వారు ఆరేళ్ళ క్రితం అలాంటి కృషి చేసి కొన్ని బాంబుల్ని తయారు చేశారు. భార్యామణి ఫమీదా ఆ బాంబుల్ని ఒక టాక్సీలో భద్రంగా తీసుకొచ్చి గేట్ వే ఆప్ ఇండియా (ముంబై)లో ఓ మూల వుంచి- టాక్సీ దిగి వెళ్ళిపోయింది. మరి టాక్సీవాడికి తను అక్కడికి వచ్చిన వైనం తెలీదా?
పూర్తిగా చదవండి..

Wednesday, August 5, 2009

Monday, August 3, 2009

సీజరు పెళ్ళాలు

ఎప్పుడయినా, ఎక్కడయినా- పెద్ద రాజకీయనాయకుడి అవినీతి బయటపడిందనుకోండి. ఆయన సమాధానానికి మీరు ఎదురుచూడ నక్కరలేదు. ఒకే ఒక్క వాక్యం చాలాకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడూ వినిపిస్తుంది: "ఇది ప్రతిపక్షాలు నా మీద చేసిన కుట్ర”.
పూర్తిగా చదవండి.

Saturday, August 1, 2009

దాశరధి దృక్పథం - ఒక సమాలోచన

మొన్న తానా సభల్లోని సాహితీ సమావేశంలో నా ప్రసంగం పూర్తిపాఠం. 'కౌముది ' తాజా సంచికలో ప్రత్యేక వ్యాసంగా వచ్చింది.
పూర్తిగా చదవండి.

Monday, July 27, 2009

ఉంగరం గరంగరాలు

ఈ మధ్య తమిళనాడులో అద్భుతమైన వితరణ జరుగుతోంది. నిన్నకాక మొన్ననే తమిళనాడు ఉపముఖ్య మంత్రి స్టాలిన్ గారు3.67 లక్షల ఖర్చుతో 250 ఉంగరాలను పంచారు. ఎందుకు? తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళ పేర్లను పెట్టుకుంటే ఒక ఉంగరం యిస్తారు. మొదటి విడతలో తమిళరసి, తమిళరసు, తమిళ చెల్వన్, ఇళక్కియ, తెన్ మొళి, అరవిందన్, మణిమేఖలై-యిలాంటి రకరకాల పేర్లతో తమ పిల్లలకు బారసాలలు చేసి తల్లిదండ్రులు ఆనందంగా ఉంగరాలు సంపాదించుకున్నారు.

Thursday, July 23, 2009

జుజుమురా

ఇది నేను దాదాపు 38 సంవత్సరాల క్రిందట వ్రాసిన కథ. అనేక మంది అభిమానులని సంఫాదించి పెట్టిన ఈ కథని బ్లాగులోకం మిత్రులతో పంచుకుంటున్నాను.
పూర్తి కథ

Wednesday, July 22, 2009

డైరీలో కొన్ని పేజీలు

1962 - జూన్ 16ఆర్ట్ లవర్స్ యూనియన్ పోటీల్లో 'ఆశయాలకు సంకెళ్ళు ' ప్రదర్శనం . సి.ఎస్.ఆర్ వచ్చారు. డిక్షన్, రచనని మెచ్చుకున్నారు. బి.కె. రావు గారున్నారు ప్రేక్షకుల్లో..
పూర్తిగా చదవండి..

Monday, July 20, 2009

కొవ్వలి- వెయ్యి నవలల రచయిత

నవలలలో తనదైన ముద్రని వేసిన ఓ నవలాచక్రవర్తి కధ
పూర్తి వ్యాసం

THE JOURNEY-POEM

In the path you tread
Stretches the lonely night
The morning is sleeping
On the other side of the hills,
That stretch their long arms of shadows-
The stars are counting minutes
They are whispering wordless joy
And waiting to hear your footsteps
The moon is swimming through
Shady clouds-searching his path-
Even if your eyes cannot find your way
Walk on wherever softness touches your feet
I kissed the dust on your naked path
So that your feet can sense my touch
A memory your lips shared before-
(3.9.76)

ఆనందం ఖరీదు-ఆలోచన

చాలామంది ఆనందానికీ, ఖరీదుకీ లంకె వుంటుంది. ఖరీదయిన కారూ, ఖరీదయిన సూటూ, ఖరీదయిన భోజనం,ఖరీదయిన పరుపూ- మీ యిష్టం -ఏదయినా దాని చివర వున్న చీటీని బట్టి మనస్సులో ఆన్ందానికి తూకం వుంటుంది. మా ఆవిడ షాపులో చీరెల రంగులూ, నాణ్యాన్ని చూసే ముందు ధరని చూస్తుంది. ఖరీదు నాలుగంకెల్లో వున్నాక- ఆమెకి మెల్లగా చీరె నచ్చడం ప్రారంభిస్తుంది. ఆ తరువాతే రంగు, మన్నికా వగైరా. ఓసారి నేను తెచ్చిన చీరెని ఆనందంగా అందుకుంది. తృప్తిగా కట్టుకుంది. ఖరీదుని దాచి నెలరోజుల తర్వాత చెప్పాను-ఫలానా మార్కెట్లో చవకగా తీసుకున్నానని. ఆ క్షణం నుంచీ ఆ చీరెమీద ఆమెకి మక్కువ పోయింది.
పూర్తి కాలం

Friday, July 17, 2009

చీమకుట్టిన విప్లవం

ఒక విధంగా పాత కథే! కానీ ఈ కొత్త అన్యాయం అందరూ వినదగ్గది. నేటి రాజకీయమైన బ్లాక్ మెయిల్ ని కుండబద్దలు కొట్టినట్టు విశ్లేషించేదీనూ..
పూర్తి కాలమ్..