Tuesday, February 23, 2010

పులి పిల్లి పెళ్ళి కథ

టైగర్ వుడ్స్ ప్రపంచం విస్తుపోయి చూసేంత గొప్ప ఆటగాడు. ఇంతవరకూ ఎవరూ సాధించలేనన్ని విజయాలూ, ఎవరూ సాధించలేనంత డబ్బూ, కీర్తీ సంపాదించాడు. స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఆటకోసం చదువుని మధ్యలో మానుకున్నాడు. ఆయనకి స్విస్ పెళ్ళాం వుంది. పిల్లలున్నారు. డబ్బు, కీర్తి ఒకప్పుడు మనిషిని తల్లకిందులు చేస్తుంది. చదువూ, సంస్కారం ఆ వికారాన్ని ఏ కాస్తో ఆపగలుగుతుంది. అయితే- అన్నీ ఉన్న టైగర్ అందరూ ఊహించలేనన్ని “అందమయిన“ నేరాలు చేశాడు. కనీసం పది మంది అందకత్తెలతో శృంగారం నెరపాడు.
పూర్తిగా చదవండి

Monday, February 15, 2010

శివ..శివా..

మహాశివరాత్రినాడు ఖాన్ గారి సినీమా రిలీజవుతోంది. ఆయన పాకిస్థాన్ ఆటగాళ్ళను వెనకేసుకొచ్చాడు.శివసేన అనే దేశభక్తుల పార్టీ ఆయన సినీమాను, ఆయన పరపతినీ, ఆ సినీమా తీసినవారి వ్యాపారాన్ని- అన్నిటినీ ధ్వంసం చేయడానికి పూనుకుంది. ఎందుకు?
పూర్తిగా చదవండి..

Monday, February 8, 2010

రాజకీయ వంకాయ

మాయాబజార్ లో పింగళిగారు శాకంబరీ వరప్రసాదంగా గోంగూరని అభివర్ణించారుగాని- నా దృష్టిలో ఆ గౌరవం- ఇంకా చెప్పాలంటే మహా శాకంబరీ దేవి పూర్ణావతారంగా వంకాయని నేను పేర్కొంటాను.
పురుషులందు పుణ్యపురుషులలాగ కూరగాయలలో తలమానికం వంకాయ.వంకాయని విశ్వామిత్ర సృష్టి అంటారు. ఆ ఒక్క కారణానికే విశ్వామిత్రుడిని జగన్మిత్రుడిగా మనం కొలుచుకోవాలి. ఓ కవిగారు వంకాయ కూర తిని తిని, పరవశించి, తలకిందులై, కవితావేశంతో ఆశువు చెప్పాడు.
పూర్తిగా చదవండి

Monday, February 1, 2010

సాహితీ బంధువు గుమ్మడి

అయిదారు దశాబ్దాలు సినీరంగాన్ని దీప్తిమంతం చేసిన గుమ్మడిగారితో నా బంధుత్వం- ముఖ్యంగా సాహితీ పరమైనదీ, మైత్రీ పరమైనదీ.
విజయవాడ రేడియోకి వచ్చిన తొలిరోజుల్లో(1968 ప్రాంతాలలో) నాదికాని యితివృత్తాన్ని తీసుకుని (న్యాయంగా అమరేంద్ర రాయాల్సినది) రాత్రికి రాత్రి బందాగారి ప్రోత్సాహంతో రాసి, అర్ధాంతరంగా నేనే నిర్వహించాను. ఆ నాటకం పేరు “కళ్యాణి”. దానికి ప్రశంసల వర్షం కురిసింది. వాటిలో ఏరి ఇంతవరకూ మనస్సులో దాచుకున్న ఉత్తరం గుమ్మడిగారిది. నా ఆడ్రసునీ, నన్నూ వెదుక్కుంటూ వచ్చింది. అది మా బంధుత్వానికి ప్రారంభం.
పూర్తిగా చదవండి