Sunday, February 24, 2013

మృత్యువు

మృత్యువు జీవితాన్ని అడిగిందట: నన్ను చూసి అందరూ అసహ్యించుకుంటారు. భయపడతారు. కాని నిన్ను ప్రేమిస్తారేం? -అని. జీవితం సమాధానం చెప్పింది: ''ఎందుకంటే నేను అందమయిన అబద్ధాన్ని. నువ్వు తప్పనిసరయిన, బాధాకరమైన నిజానివి'' అని.
నా కాలేజీ రోజుల్లో చదివాను దువ్వూరి రామిరెడ్డి గారి 'పానశాల'. ఆయన మృత్యువు గురించి అంటారు: ''అయయో మూలధనమ్ము హస్తగళితమ్మౌచుండె నానాటికిన్‌, వ్యయమై పోయిరి మానవుల్‌ మరణశయ్యాసుప్తులై...''. అయ్యో, చేతిలో ఉన్న మూలధనం ప్రతీదినం జారిపోతోంది. మానవులు మృత్యువుని చేరి ఖర్చయిపోతున్నారు -అని.
పూర్తిగా చదవండి

Monday, February 18, 2013

మరో కుంభకోణం

మూలిగే నక్కమీద మరో తాటిపండు ఈ కొత్త కుంభకోణం. ఈ శతాబ్దానికి అటు 13 సంవత్సరాలకు, ఇటు 13 సంవత్సరాలకు ఈ దేశంలో రెండు పెద్ద కుంభకోణాలు జరిగాయి. రెండూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. రెండూ రక్షణ శాఖకు సంబంధించినవే. రెండూ అప్పటి రక్షణ మంత్రులూ, అప్పటి ఆయా సైన్యాధిపతులతో ముడిపడినవే.
పూర్తిగా చదవండి

Sunday, February 10, 2013

బట్టల్లేని సమస్యలు

చాలా సంవత్సరాల కిందట మా ఆవిడా మా అబ్బాయి వత్తిడి చేయగా చేయగా మాల్‌ దీవులకు వెళ్లాం. బియాదూ అనే చిన్న ద్వీపంలో ఒక భారతీయ సంస్థ (తాజ్‌ గ్రూపు అనుకుంటాను) ఒక రిసార్ట్‌ని నిర్వహిస్తోంది. ఆ ద్వీపం కొన్ని ఎకరాల విస్తీర్ణం. ద్వీపం అంతా రిసార్టే. మాలే విమానాశ్రయం నుంచి చిన్న లాంచీలో గంటన్నర ప్రయాణం
పూర్తిగా చదవండి 

Monday, February 4, 2013

విశ్వరూపం

   విశ్వరూపం సమస్య నిజంగా ''విశ్వరూపం'' సినిమాది కాదు. ప్రాంతీయ, మత ఛాందసుల అభిప్రాయాలను నెత్తికెత్తుకోవడం ద్వారా వోట్లకు కక్కుర్తిపడే రాజకీయ వర్గాల ప్రలోభపు విశ్వరూపమది.
ప్రతి వ్యక్తిలోనూ ఈ ప్రలోభం ఉంటుంది. మా వాళ్లని పొగిడితే నాకు ఆనందం. నన్ను తిడితే కోపం. తన ప్రాంతం, తన భాష, తన మతం, తనవాడు -యిలాగ. అయితే వ్యక్తి ప్రాతినిధ్యం వ్యవస్థ స్థాయికి పెరిగే కొద్దీ వ్యక్తి ప్రయోజనం మరుగున పడి -సామాజిక ప్రయోజనంపై దృష్టి మరలుతుంది.
పూర్తిగా చదవండి 

తనలో తాను

 ఒక విచిత్రమైన, కాని ఆలోచింపజేసిన, ఆలోచించాల్సిన అరుదైన సందర్భం. దక్షిణామ్నాయ శృంగేరీ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి విశాఖపట్నం వేంచేశారు. భీమునిపట్నంలో సద్గురు శివానందమూర్తివారి ఆశ్రమానికి -వారి దర్శనార్థం వెళ్లాను. శివానందమూర్తిగారు నన్ను అందరిలోనూ పిలిపించారు. స్వామివారికి స్వయంగా పరిచయం చేశారు. స్వామివారు ముందుకు వంగి ఆసక్తిగా వింటున్నారు. నన్ను ఏమని పరిచయం చేస్తారు? ప్రముఖ రచయితననా? సినీనటుడిననా? రేడియో డైరెక్టరుగా రిటైరయాననా? టీవీల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాననా? మంచి వక్తననా? వీటిలో ఏదయినా లేదా అన్నీ చెప్పవచ్చు. కాని రెండే మాటలు చెప్పారు -సద్గురువులు. అవి ఇవి: ''ఈయన గొల్లపూడి మారుతీరావు. మంచి సంస్కారం వుంది'' అంతే! ఈ విశేషణాలలో ఏవో చెప్తారని ఊహించిన నేను ఈ పరిచయానికి ఆశ్చర్యపోయాను. ఆలోచించగా -కనువిప్పూ అయింది.
పూర్తిగా చదవండి