Sunday, March 28, 2010

నీతి..న్యాయం..చట్టం !

శబ్దార్ధ చంద్రికనీ, శబ్దరత్నాకరాన్నీ ఆశ్రయించినా- నా ఆలోచనకి సరైన న్యాయం జరగలేదు. నీతికీ, న్యాయానికీ కావలసినంత దూరం వున్నదని నా మతం. నీతి అంటేనే న్యాయమని నిఘంటుకారుడు చెప్పి చేతులు కడుగుకున్నాడు. ఇక నా తాపత్రయం నేను పడతాను.
పూర్తిగా చదవండి..

Monday, March 22, 2010

ఆడవారి మాటలకు ..!

ఈ కాలమ్ చదివాక నాకు నా యింట్లోనే తిండి దొరుకుతుందనే నమ్మకం లేదు.. ఈ కాలమ్ ని మీరు మెచ్చుకున్నా, మెచ్చుకున్నట్టు కనిపించినా మీ పరిస్థితీ అదేనని హెచ్చరిస్తున్నాను. మందుల డబ్బాలమీద ఒక హెచ్చరిక ఉంటుంది. “ఇది షెడ్యూలు L మందు. డాక్టరు చెప్పినట్టు మాత్రమే వాడాలి” అని. కనుక నాదొక హెచ్చరిక. ఈ కాలమ్ మీకు నచ్చితే- నోరుమూసుకోండి. నచ్చకపోతే నోరుమూసుకోండి. నాతో ఏకీభవిస్తే నోరుమూసుకోండి. నాతో విభేదిస్తే నోరుమూసుకోండి. ఇది మీ శ్రేయస్సుని దృష్టిలో వుంచుకున్న ఓ హితుడి సలహాగా భావించండి.
పూర్తిగా చదవండి..!

Monday, March 15, 2010

సద్గురువులు లేని నిరుపేదలు

పత్రికలో ఒక వార్త. విద్యార్ధులు తమ సమాధాన పత్రాల్లో ఉద్యమ నినాదాలను రాస్తే తప్పుగా పరిగణిస్తామని ఇంటర్ బోర్డ్ ప్రకటించిందట. సరే. ఉపాధ్యాయులు ఈ నిబంధనకి ఎలా స్పందించాలి?
“బాబూ! ఉద్యమానికీ, మీ చదువుకీ, మీ ఆవేశాలకీ, మీ విజ్ణతకీ, మీ అభిప్రాయాలకీ, మీ అభినివేనికీ ఏమీ సంబంధం లేదు. చదువు వేరు. సభ్యత వేరు. చదువు వేరు. మన జీవన సరళి వేరు. చదువు వేరు. మీ విశ్వాసాలు వేరు. కనుక- పరీక్షల్లో- నినాదాలను రాయడం మీ ఆవేశానికి అక్షరరూపం అనిపించుకోదు. మీ అనౌచిత్యం అనిపించుకుంటుంది. అక్కరలేని చోట, అనవసరమైన చోట- మీ అభిప్రాయాలను ప్రకటించినట్టవుతుంది. మొదట మీ సామర్ధ్యాన్ని నిరూపించుకుని పట్టాలు పుచ్చుకోండి. పట్టాభిషిక్తులయిన యువకులుగా జీవితాల్లో అడుగుపెట్టండి”-లాంటి మాటలేవో చెప్పాలి కదా?
పూర్తిగా చదవండి

Monday, March 8, 2010

బాబోయ్! నాకర్థమయేలా చెప్పండి..!

నేను మతఛాందసుడిని కాను.మసీదులు కూల్చడం, పబ్బుల్లో అమ్మాయిల్ని చావగొట్టడం వంటి పనులమీద నాకు బొత్తిగా నమ్మకం లేదు. అలాగే ప్రాంతీయ దురభిమానిని కాదు. పై ప్రాంతాలవారి వస్తువుల్ని బహిష్కరించడం, విభేధించేవారి నాలుకలు చీల్చడం మీద అసలు నమ్మకం లేదు.
నాకు చిత్రలేఖనం గురించి బొత్తిగా తెలీదు-మంచి చిత్రాన్ని చూసి ఆనందించడం తప్ప. అయితే ఏది మంచి చిత్రమో, అది ఎందుకు మంచి చిత్రమో తెలీదు.
పూర్తిగా చదవండి..!

Monday, March 1, 2010

విదూషకుడి విషాదం

చచ్చినవాడి కళ్ళు చేరడేసి అన్నది సామెత. పద్మనాభం అనే నటుడు నిన్న ఉన్నాడు. మొన్న ఉన్నాడు. అప్పుడు ఆయన కళ్ళు మామూలుగానే ఉన్నాయి. పోయాక ఆయన కళ్ళు సైజు పెరిగింది. సామెత వీధిన పడింది.

అది లోక ధర్మం. సమాజం, సమీప సన్నిహిత ప్రపంచ క్రూరత్వానికి నిదర్శనం. మరొక్కసారి- యిది లోక ధర్మం.

పూర్తిగా చదవండి