Sunday, June 27, 2010

పేదరికం పెట్టుబడి

ప్రతి మంగళవారం మా పెద్దబ్బాయి వడపళనిలో కుమారస్వామి గుడికి వెళుతుంటాడు. ఆ గుడి ముందు ఓ 65 సంవత్సరాల ముసిలావిడ బిచ్చమెత్తుకుంటుంటుంది. నాకోసారి ఆమెని చూపించాడు. ఆమెకి ఓ వసతిని కలిపించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఆమెకి కావలసిన చీరలు కొనిపెట్టాడు.
పూర్తిగా చదవండి

Monday, June 21, 2010

ప్రపంచ సమరం

1994 జులై 2. ప్రపంచ బంతి ఆట పోటీలలో కొలబియా ఆటగాడు ఆంద్రీ ఎస్కాబార్ తన దేశం తరపున ఆడుతూ, ఆటలో పొరపాటున తన దేశానికే గోల్ చేసుకున్నాడు. ఆట మీద కొన్ని కోట్ల పందాలు నడిచాయి. ఊహించని నష్టాలతో లోపయకారీ వ్యాపారులంతా ఉక్కిరిబిక్కిరయారు. హాంబర్ట్ కాస్త్రో మురోజ్ అనే అభిమాని - దక్షిణ అమెరికా రన్నింగ్ కామెంటరీ చెప్పేవాళ్ళు అరిచినట్టు 'గో....ల్’ అని అరుస్తూ పన్నెండు బులెట్లు ఎస్కాబార్ మీద పేల్చాడు. ప్రపంచం షాక్ అయిపోయింది. లక్షా ఇరవై వేలమంది అతని అంత్యక్రియలకి హాజరయారు. కొలంబియాలో ఎస్కాబార్ శిలావిగ్రహాన్ని ప్రతిష్టించారు.
పూర్తిగా చదవండి

Sunday, June 13, 2010

డెబ్బై చేపల కథ

హారీ పోటర్ కథలతో పెరిగిన ఈ తరంవారికి (తండ్రుల విషయంకూడా నాకు అనుమానమే) - బహుశా వాళ్ళ తాతలు చెప్పిన 'ఏడు చేపల' కథా తెలియదు. ఆ రోజుల్లో ప్రతీ అమ్మమ్మా ప్రతీ మనుమడికీ ఇలాంటి కథలూ, ముఖ్యంగా ఈ కథ చెప్పేది. తుంటిమీద కొడితే పళ్ళు రాళుతాయి - అన్న సామెతకి దగ్గరగా ఉన్న కథ ఏడుచేపక కథ అని ఇప్పటి వారికి అర్ధమయితే నా పబ్బం గడుస్తుంది.
పూర్తిగా చదవండి

Sunday, June 6, 2010

అపకీర్తి 'కీర్తి '

ఈ ప్రపంచంలో అపకీర్తికి దక్కే కీర్తి అనన్య సామాన్యం. అప్రతిహతం. అనితర సాధ్యం. అపూర్వం. అది కాలధర్మం. నేటి లోక ధర్మం. ప్రస్థుతం నడుస్తున్న సమాజ ధర్మం. ఈ నిజాన్ని సమర్ధించడానికి నా దగ్గర బోలెడన్ని సాక్ష్యాలున్నాయి.
పూర్తిగా చదవండి