Monday, April 26, 2010

భారత రత్న

అందరిమాటా ఏమోగానీ- నేను మాత్రం ఈ సంవత్సరం లలిత మోడీకి భారతరత్న గౌరవం లభిస్తుందని ఆశించాను. లభించనందుకు నిరుత్సాహ పడ్డాను.అడ్డమయిన వాళ్ళకీ అన్నీ పంచుతూండగా లలిత మోడీకి కనీసం పద్మవిభూషణ్ యివ్వవలసింది.
పూర్తిగా చదవండి

Sunday, April 18, 2010

మాంచి సినీమా కధ

లాభసాటి అయిన స్క్రీన్ ప్లేకి మూల సూత్రం- ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం. తలుపు తీసుకుని హీరోయిన్ వస్తుందని ఆశిస్తాడా? ఎలుగుబంటి వస్తుంది. ఇద్దరికీ పెళ్ళి అయిపోయిందని ఊపిరి పీలుస్తాడా? ఓబులేసు వస్తాడు. ఇది సర్వకాల సర్వావస్థల్లోనూ చెల్లే పడికట్టురాయి.
ఇప్పుడు అసలు కధ. జామపండులాగ పిటపిటలాడే ఆడపిల్ల. పేరు సానియా మీర్జా. వొంట్లో అన్నిభాగాలూ ఎగిరిపడేటట్టుగా, తొడలు కనిపించే చిన్న నిక్కరుతో టెన్నిస్ ఆట ఆడే సౌందర్యరాశి. ఆమె ఆటకంటే ఆమెనే ప్రపంచం అబ్బురపాటుతో చూసి ఆనందించింది. ఇలాంటి సౌందర్యరాశులు ఎక్కువగా టెన్నిస్ లోనే కనిపిస్తారు.ఆ ఆకర్షణ పొట్టి నిక్కర్లలో, బిగించిన బ్లౌజుల్లో ఉందేమో. అలనాడు అన్నా కోర్నికోవా అనే గుంట ఇలాగే చాలామంది మతులు చెడగొట్టింది. తరవాత్తరవాత- ఆటకంటే వొళ్ళు రాణిస్తోందని కనిపెట్టి- మోడలయి వొంటినే నమ్ముకుంది.
పూర్తిగా చదవండి..

Sunday, April 11, 2010

భరాగో అనే ఉద్యమం

1968లొ నేను విజయవాడ ఆలిండియా రేడియోకి బదిలీ మీద వచ్చేనాటికి పురాణంగారికి సహాయకులుగా భరాగో “ఆంధ్రజ్యోతి” వారపత్రికలో చేరారు.
“మీ చేసిన సాహితీ వ్యవసాయం చూసి మీరెంత పెద్దవారోననుకున్నాను” అన్నారు నన్ను చూసి.
“మీ కధలు చదివి మీరెంత చిన్నవారోననుకున్నాను” అన్నాను నేను. అలా ప్రారంభమయిన మా స్నేహం, ఆత్మీయమయి మొన్నటిదాకా సాగింది. ఆ రోజుల్లోనే నేను రాసిన “వెన్నెల కాటేసింది” నవలకి తన ముత్యాలలాంటి తన చేతిరాతతో ముస్తాబు చేసి, బంగీ కట్టి ఎమ్.ఎన్.రావు(ఎమెస్కో)కి పంపేదాకా పూనుకున్నది భరాగోయే. ఈ పనిని ఒక ఉదాత్తమయిన సేవగా చివరిదాకా నడిపిన ఓ ఉద్యమం భమిడిపాటి రామగోపాలం.
పూర్తిగా చదవండి

Sunday, April 4, 2010

పెంటపాటి బైరాగి క్రీడ

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు అవధానిని పెంటపాటి బైరాగి అన్నారు-కచ్చితంగా. ఇది వినడానికి క్రూరమయిన మాటగానే కనిపిస్తుంది. అవధానంలో బోలెడన్ని పద్యాలుంటాయి. కాని కవిత్వం ఉండదు. అవన్నీ కాగితం పువ్వులన్నారు.
ఈమాటతో పూర్తిగా ఏకీభవించడం కష్టం. దానికి ఉదాహరణ వారే. తమ గురువులు రామకృష్ణశాస్త్రిగారు క్షేమేంద్రుడి గ్రంధానువాదంలో ఉత్పలమాలలో రెండు పంక్తులు చెప్పగా-
ఆరును నేడు పాదమున కక్షరముల్ గల వృత్తమందు న వ్వారిజ సంభవాస్యముల వాసమొనర్చెడి వాణి నిల్వగా నేరదు....
అనగానే సుబ్రహ్మణ్య శాస్త్రిగారు-
పూర్తిగా చదవండి..