Sunday, March 31, 2013

’పెంట’ రాజకీయాలు

 మేముండే అపార్టుమెంటులో 12 కుటుంబాలున్నాయి. ఆరు కుటుంబాలు ఒకవేపు, మరో ఆరు మరొకవే పు. మా ఇంటి పక్కనే మరో అపార్టుమెంటు. ఈ కుటుంబాలు -ఎవరో తెలీదుకాని -వారిలో ఒకరు తమ చెత్తని పక్క అపార్టుమెంటు గోడదగ్గర వేస్తారు. కొన్నాళ్లకి వారి కాలువల్లో నీరు నిలిచిపోతుంది. వారు తగాదాకి వస్తారు. వేసేది ఎవరు?
 పూర్తిగా చదవండి

Sunday, March 24, 2013

సంజయ విషాద యోగం

భారత దేశం జాలిగుండె గల దేశం. దయకీ, కరుణకీ, ఆర్ధ్రతకీ, జాలికీ పెట్టింది పేరు. నిన్నకాక మొన్న తీహార్‌లో ఆత్మహత్య చేసుకున్న -ఢిల్లీ అమ్మాయిని ఘోరంగా మానభంగం చేసి చంపిన ఘనులలో ఒకడయిన రాంసింగ్‌ బతికి -17 సంవత్సరాల తర్వాత ఉరిశిక్ష విధిస్తే -అతని పట్ల 2030లో జాలి చూపే గుండె, కన్నీళ్లు పెట్టుకునే దయార్ధ్ర హృదయులు ఉంటారు. రాజీవ్‌ గాంధీతో పాటు ఏమీ నేరం చెయ్యని 18 మంది చచ్చిపోయినా -నళిని మీద సానుభూతి చూపే సోనియా కూతుళ్లూ, హంతకుల్ని ఉరితీయకూడదని ఒక రాష్ట్ర శాసనసభ తీర్మానం ఇందుకు సాక్ష్యం. మనది ఖర్మభూమి.
పూర్తిగా చదవండి

Monday, March 18, 2013

అవ్యవస్థకు ఆవలిగట్టు

ఇలాంటి సమస్యలు మరే దేశంలోనూ వచ్చి వుండవు. ఒక మంత్రి పోలీసు ఆఫీసర్ని హత్య చేయించాడు. ముఖ్యమంత్రి ముఖం చాటుచేసుకున్నాడు. ఆ మంత్రి పేరు రాజాభయ్యా. ఉత్తరప్రదేశ్‌లో పేరు మోసిన గూండా.
ఒక పోలీసాఫీసరు గారి తనయుడు ఒక జర్మన్‌ మహిళని రేప్‌ చేశాడు. కోర్టు అతనికి ఏడేళ్లు శిక్షని విధించింది. అతని బాబు ఒరిస్సాలో డైరెక్టరు జనరల్‌ ఆఫ్‌ పోలీసు. కుర్రాడు అమ్మని చూడడానికి బెయిల్‌ కోరాడు. కోర్టు ఆరు నెలల తర్వాత ఇచ్చింది.
పూర్తిగా చదవండి

Monday, March 11, 2013

దోశెలా..దోషులా!?

  అందుకే వంటొచ్చిన మంత్రుల్ని కేంద్రంలో ఉంచడం చాలా తెలివైన పని అని సోనియా గాంధీగారికి తెలుసు. తెలంగాణా గురించి ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా గులాం నబీ అజాద్‌ కానీ, వీరప్ప మొయిలీ కానీ -సరైన సమాధానం కాదుకదా, తృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. కాని ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ప్రతినిధి వయలార్‌ రవిగారు కళ్లకు కట్టినట్లు, నోటికి అందేటట్టు -ఆ సమస్యని వివరించారు. 'తెలంగాణా సమస్య అంటే దోశె వెయ్యడమంత తేలికకాదు' అని శెలెవిచ్చారు.
పూర్తిగా చదవండి 

Monday, March 4, 2013

దేవుడూ-చేగోడీలూ

మిత్రులూ, ప్రముఖ రచయితా ఇచ్చాపురపు జగన్నాధరావుగారు ప్రతీరోజూ ఏదో కథో, జోకో ఇంటర్నెట్‌లో పంపుతూంటారు. అదీ మా బంధుత్వం. ఈ కథ నలుగురూ వినవలసినది.
ఓ కుర్రాడికి దేవుడిని చూడాలనిపించింది. దేవుడున్న చోటుకి వెళ్లాలంటే చాలా దూరం కదా? కనుక అమ్మ ఇచ్చిన చేగోడీల పొట్లాన్నీ, స్కూలుకి తీసుకెళ్లే మంచినీళ్ల సీసానీ పట్టుకుని బయలుదేరాడు.
పూర్తిగా చదవండి