Monday, August 29, 2011

మరో 'లీడర్'కథ

ఆ మధ్య 'లీడర్ ' సినీమాలో ఓ తమాషా అయిన పాత్ర వేశాను. పాత్ర చిన్నది. రెండు సీన్ల వ్యవహారం. ఏదో తేలికగా సాగిపోయే పాత్ర అని సరిపెట్టుకున్నాను. కానీ ఆ పాత్రకి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయాను. అంతకు మించి నివ్వెరపోయాను. ఎంతోమంది ఆ పాత్రని మెచ్చుకున్నారు.
కారణం? నేను బాగా నటించడం కాదు.
పూర్తిగా చదవండి

Monday, August 22, 2011

అన్నా వెనుక మనిషి

మా ఇంట్లో ఇద్దరు అవినీతిపరులున్నారు - నేనూ, మా అబ్బాయి. మేమిద్దరం ఈ దేశంలో సగటు అవినీతికి నమూనాలం కాము. అయినా మాకూ ఈ గుంపులో స్థానం ఉంది.
చాలా ఏళ్ళ కిందట మా పెద్దబ్బాయి మంచి డ్రస్సు వేసుకుని టై కట్టుకుని సిద్ధం అవుతున్నాడు. ఎక్కడి కన్నాను. కోర్టుకి అన్నాడు. అర్ధంకాలేదు. అయిదారు రోజుల కిందట రోడ్డు మీద పోలీసు అతన్ని ఆపాడట. ఏదో నేరం చేశాడో, చేశాడని పోలీసు భావించాడో. (నీతికీ అవినీతికీ అభిప్రాయబేధాలు తప్పవు కదా?) న్యాయంగా పోలీసు చేతిలో ఆమ్యామ్యా పడితే తేలిపోయే వ్యవహారమది. కానీ కోర్టుకే వచ్చి తాను రైటని నిరూపిస్తానన్నాడు మా వాడు. పోలీసు తలవూపాడు. సమన్లు వచ్చాయి. ఇప్పుడు కోర్టుకి వెళుతున్నాడు. యువకుడు, ఉడుకు రక్తం కలవాడు. రోడ్డు మీద అవినీతిని ఎదుర్కోవాలనే చిత్తశుద్ధి కలవాడు. మంచిదే అన్నాను.
ఇంకా చదవండి

Monday, August 15, 2011

ముష్టి పెత్తనం

ఒక ముష్టివాడు ఒక ఇంటికి బిచ్చానికి వెళ్ళాడట. ఇంటి కోడలు ఏమీ లేదు వెళ్ళమంది. బిచ్చగాడు బయలుదేరిపోయాడు. వెళుతున్న బిచ్చగాడిని అత్తగారు పిలిచారట. ఏమయ్యా వెళ్ళిపోతున్నావని.
కోడలమ్మగారు వెళ్ళమన్నారండి అన్నాడట బిచ్చగాడు. అత్తగారు చర్రున లేచింది. "అదెవరయ్యా చెప్పడానికి. నువ్వు రా" అన్నది. ఇతను వెళ్ళాడు. అప్పుడు అత్తగారు చెప్పిందట సాధికారికంగా "ఇప్పుడు నేను చెపుతున్నాను. ఏమీలేదు వెళ్ళు" అని.
ఇచ్చినా, పొమ్మన్నా అత్తగారికే చెల్లును - అన్నది సామెత. ఈ దేశానికంతటికీ అలాంటి ఓ అత్తగారుంది. తిట్టినా తిమ్మినా, శిక్షించినా, రక్షించినా, పొమ్మన్నా ఉండమన్నా ఆ అత్తగారికే చెల్లును. ఆ అత్తగారు - సుప్రీం కోర్టు.
పూర్తిగా చదవండి

Monday, August 8, 2011

సెన్స్ ఆఫ్ హ్యూమర్

ఇది తెలుగు కాలం కనుక ఇంగ్లీషులో మొదలెడతాను. సెన్సాఫ్ హ్యూమర్ అంటే కష్టాన్నీ, నష్టాన్నీ చూసి కడుపారా నవ్వుకోవడం. మనకి ఆ అలవాటు బొత్తిగా తక్కువంటాను. స్థాళీపులాకన్యాయంగా ఇక్కడ కొన్ని ఉదాహరణలు.
ఆ మధ్య పేపర్లో ఓ వార్త చూశాను. తమిళనాడులో ఎక్కడో ఓ కుర్రాడు ఓ కక్కుర్తి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. కోర్టు ఆ కుర్రాడిని జైల్లో పెట్టింది. తీరా విచారణ జరుపుతూ బెయిల్ ఇవ్వడానికి 1200 రూపాయలు కట్టమంది. వెనకటికి ఓ పూర్వసువాసిని 'మా ఆయనే ఉంటే మంగలి ఎందుకు బాబూ' అన్నదట. ’నా దగ్గర అంత డబ్బుంటే దొంగతనం ఎందుకు చేస్తాను బాబూ?!’ అన్నాడట ఆ కుర్రాడు.
పూర్తిగా చదవండి

Gollapudi Memorial Award Function








Monday, August 1, 2011

డిమెన్షియా

ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప కథల్లో ఒక కథ జర్మన్ రచయిత ఫ్రాన్స్ కాఫ్కా "ది మెటొమార్ఫొసిస్". ఒక రోజు కథానాయకుడు నిద్రలోంచి లేవగానే తను ఒక పెద్దు 'పురుగు' అయిపోయినట్టు భావిస్తాడు. అధివాస్తవికత, అద్భుతమైన 'సింబాలిజం'తో కథ సాగుతుంది. ఇప్పటికీ ఈ కథని ఎంతో మంది విశ్లేషిస్తున్నారు. ఎన్నో రకాల రచనా రూపాలను ఈ కథ సంతరించుకుంది. ప్రపంచ సాహిత్యంలో ఇది చరిత్ర. ఇంతవరకూ దీని ప్రసక్తి చాలు.