Sunday, December 26, 2010

పాకీ ఉల్లి

ఈ దేశంలో ప్రభుత్వాలు కూలాలంటే - ఓట్లు అవసరం లేదు, నోట్లు అవసరం లేదు, ఆమరణ దీక్షలు అవసరం లేదు, ర్యాలీలు అవసరం లేదు. చాణిక్యుడికి కూడా అందని రాజనీతి ఒకటుంది. అది అతి సాదా సీదా వస్తువు. చూడడానికి చిన్నదేకాని కొంపలు ముంచుతుంది. ప్రభుత్వాల్ని దించుతుంది. దాని ఫేరు ఉల్లిపాయ.
పూర్తిగా చదవండి

Monday, December 20, 2010

ధర్మరాజుల కాలం

'నిజం'కు ఒక్కటే సమాధానం. అబద్దానికి ఆరు రకాల సమాధానాలు . రెండు రెళ్ళు ఎంత? నిజం చెప్పాల్సి వస్తే - నిద్రలో లేపినా ఒక్కటే సమాధానం. నాలుగు. మరి 'రెండు రెళ్ళు ఎంత? ' కి అబద్దపు సమాధానం? ఆరు కావచ్చు. ఏడు కావచ్చు. అరవై కావచ్చు. ఏదీ కాకపోవచ్చు. అతి స్తూలంగా ఒకనాటి నా నాటిక 'రెండు రెళ్ళు ఆరు 'కి ముడి ఇదే. నిజాయితీ పరుడికి ఒకటే దారి. ఆత్మవంచన

Sunday, December 12, 2010

చీమలు..చీమలు..

దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట త్యాగరాజస్వామికి టెడ్ విల్సన్ తారసపడి ఉంటే హరికాంభోజి రాగంలో ’రామ నన్ను బ్రోవరా’ కీర్తన రాసేవాడు కాదు. రాసినా మరో విధంగా రాసేవాడేమో. ’చీమ’ వంటి నిస్సహాయమైన. అతి చిన్నప్రాణిలో భగవంతుడిని చూసిన అమాయక ప్రాణి త్యాగరాజు. అయితే చీమ ఆయన అనుకున్నంత నిస్సహాయమైన్ ’అల్పజీవి’ కాదు. (యూ ట్యూబ్ లో చీమల కథలు చదవండి - కళ్ళు తిరిగిపోతాయి.)
పూర్తిగా చదవండి

Sunday, December 5, 2010

రామ్ తెరీ గంగా మైలీ

సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మొన్న మన పాలక వ్యవస్థకి మంచి కితాబునిచ్చారు. గత ముప్పై సంవత్సరాలలో గంగానదిలో పేరుకున్న కాలుష్యం కన్న దరిద్రమయిన స్థాయిలో దేశంలో అవినీతి ఉన్నదని.
మనదేశం ప్రజాస్వామిక దేశం అంటూ మన నాయకులు చంకలు గుద్దుకుంటూ ఉంటారు. అంటే ప్రజలు ఎంపిక చేసిన నాయకులు పాలించాలని. కాని ఈ మధ్య ఏ నాయకులూ ఏ అవినీతిమీదా నిర్ణయాలు తీసుకోవడం లేదు. శిక్షలు విధించడం లేదు. ఎవరా నిర్ణయాలు తీసుకుంటూన్నారు? సుప్రీంకోర్టు. నిజానికి ముఖ్యమైన నిర్ణయలన్నీ సుప్రీం కోర్టు తీసుకుంటోంది ఇటీవల.

Sunday, November 28, 2010

సున్నీ మనువులు

మనుధర్మ శాస్తం మగాళ్ళ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని మగాళ్ళకి లాభించే ' మగ ' శాస్త్రమని ఈ మధ్య ఎవరో మహిళా రచయిత్రి అనగా విన్నాను. నాకు ఈ విషయంలో ఏమీ సందేహం లేదు. ఆ మహిళతో నేను ఏకీభవిస్తూనే సిగ్గుపడుతున్నాను - ఇలా ఏకపక్షంగా చట్టాల్ని చేసినందుకు. ప్రస్తుతం మనువుగారు దర్శనమిస్తే "వెధవాయా! నీ శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని చేశాం. నోర్ముయ్" అంటాడేమో.

Sunday, November 21, 2010

జాతీయ అవినీతి

అనగనగా ఒక గోపి. ఒక జర్నలిస్టుగా ఉద్యోగం కోసం ఢిల్లీలో 'పయినీర్ ' పత్రిక ఆఫీసుకి వచ్చాడు. ఢిల్లీలో ఏనాడూ పనిచేసినవాడు కాడు కనుక, ఎడిటర్ చందన్ మిత్రా కాస్త సందేహించాడు. అయినా అడిగిన జీతం బొత్తిగా నేలబారు జీతం కనుక - మునిగిపోయిందేంఉందిలే అనుకుని మూడు నెలలు టెంపరరీ నౌఖరీ ఇచ్చాడు. ఢిల్లీ ఆనుపానులూ, పోకడలూ, గుట్టులూ తెలియని జర్నలిస్టు అక్కడ సాధించగలిగేదేముంటుంది. గోపీ ఏమీ సాధించలేదు. మూడు నెలలూ గడిచిపోయాయి.

Sunday, November 14, 2010

చిన్నచేప

ఓ సాయంకాలం నా కారు టోల్ గేటు దగ్గర ఆగింది. అక్కడ టోల్ ఆరు రూపాయలు. నా డ్రైవరుకి పదిరూపాయల నోటిచ్చాను. టోల్ కిటికీ దగ్గర , బయట ఒకాయన నిలబడి ఉన్నాడు. అయిదు రూపాయల నాణెం డ్రైవరుకి అందిస్తూ చిరునవ్వు నవ్వాడు. టిక్కెట్టు తీసుకోమన్నాను. రూపాయి చిల్లరలేదన్నాడు టోల్ మనషి. ఈ టిక్కెట్టుకీ రూపాయకీ ముడి ఉంది. రూపాయి ఇస్తే అధికారంగా టిక్కెట్టు వస్తుంది. డబ్బు గవర్నమెంటుకి చేరుతుంది.

Sunday, November 7, 2010

ఓ చీమ కథ

ఈ దేశంలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నా రెండు వ్యవస్థలు ఇంకా నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్నందుకు ఇంతకాలం తృప్తిగానూ, ధైర్యంగానూ ఉండేది. -న్యాయవ్యవస్థ, సైనిక వ్యవస్థ. అయితే క్రమంగా ఆ తృప్తీ, ధైర్యం కూడా సన్నగిల్లిపోయే రోజులు వచ్చేశాయి.

Sunday, October 31, 2010

తెలుగోడు

నా ఆరోగ్యానికి ముఖ్య రహస్యమొకటుంది. నేనేనాడూ తెలుగు ఛానళ్ళు చూడను. మధ్య కొన్నాళ్ళుగా విశాఖపట్నంలో ఉండడం జరిగింది. వద్దనుకున్నా - ఛానళ్ళు కళ్ళల్లో పడుతున్నాయి. అప్పుడప్పుడు - అక్కడక్కడా ఆగినప్పుడు బోధపడిన (కాదు - బోధపడని) విషయాలు కొన్ని ఉన్నాయి.
పూర్తిగా చదవండి

Monday, October 25, 2010

పతివ్రతల దేశం

’మాంగల్యానికి మరోముడి’ సినీమాకి దర్శకుడు కె.విశ్వనాథ్. నేను రాసిన చిత్రం అది. అందులో నాకిష్టమైన పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్రని గిరిజ చేసింది. నాలుగయిదు వాటాలున్న లోగిలి అది. అల్లు రామలింగయ్య, మిగతా ఎందరో అద్దెలకుంటున్నారు. ఒక ఇంట్లో భార్యా భర్తలున్నారు. భార్య సావిత్రి. మహా పతివ్రత. ఆమె భర్తని సినీమాలో ఎప్పుడూ చూపలేదు. ఒక గొంతు మాత్రం వినిపిస్తూ ఉంటుంది.
పూర్తిగా చదవండి

Sunday, October 17, 2010

ప్రేమ పుస్తకం

నా జీవితంలో రెండే రెండు సార్లు పరిశోధనాత్మకమైన నవల రాయాలని తహ తహలాడాను. రెండూ రెండు విచిత్రమైన, అనూహ్యమైన సందర్భాలు. రాజీవ్ గాంధీ హత్యలో పాత్రను పోషించిన ఓ నర్స్ కూతురు నళిని గురించి - ఆమె పుట్టుక, పెరిగిన వాతావరణం, ఓ భయంకరమైన మారణ హోమంలో భాగం కావడానికి ఏయే పరిష్తితులు దోహదమయాయో - తీరా అరెస్టు అయాక మురుగన్ ను పెళ్ళిచేసుకుని, అతనితో సెక్స్ లో పాలుపంచుకుని బిడ్డని కనడం - ఇవన్నీ మనస్తత్వ శాస్త్రానికి, విచిత్రమైన కోణాలను ఆవిష్కరించే కథనం. రెండవది -
పూర్తిగా చదవండి

Monday, October 11, 2010

కీర్తి

ఒకావిడ జీవితకాలమంతా మనస్సులోని ఆలోచనలను కాగితం మీద పెట్టేది. వాటిని పదిమందితో పంచుకోవాలనే ఆలోచనగానీ, ప్రచురించాలనే కోరికగానీ ఆమెకి కలగలేదు. కొంతకాలానికి కన్ను మూసింది. ఆమె చెల్లెలు తన అక్క వస్తువులను సవరిస్తూండగా ఈ కాగితాలు బయటపడ్డాయి. చదవగా - ఆమెకి బాగా రుచించాయి. వెంటనే పత్రికలకి పంపింది. కవితా ప్రపంచం హర్షంచింది. అక్కున చేర్చుకుంది. అచిరకలంలో అమెరికా నెత్తిన పెట్టుకునే ప్రసిద్ధ రచయిత్రిగా పేరు పొదింది. ఆవిడ పేరు ఎమిలీ డెకెన్సన్.
పూర్తిగా చదవండి

Monday, October 4, 2010

సమస్యకి షష్టిపూర్తి

చిన్నప్పుడు - క్లాసులోఇద్దరు కుర్రాళ్ళం దెబ్బలాడుకునేవాళ్ళం. దెబ్బలాటకు మా కారణాలు మాకుండేవి. మేం ఆశించే న్యాయమూ మా మనస్సులో ఉండేది. ఈలోగా మేష్టారు వచ్చేవారు. దెబ్బలాటకి కారణం అడిగేవారు. అంతా విని ఇద్దరికీ మొట్టికాయ వేసి - ఇలా చేయండనేవారు. అంతే. చచ్చినట్టు అలాగే చేసేవాళ్ళం. ఇక తగాదాలేదు. దానికి అప్పీలు లేదు. కారణం - మా మేష్టారుదే అంతిమ తీర్పు. ఎందుకంటే ఆయన మేష్టారు కనుక. మొట్టికాయ చక్కని ప్రతిఫలం.
పూర్తిగా చదవండి

Sunday, September 26, 2010

ఆటలో అరటిపండు

కామన్వెల్తు క్రీడలవల్ల చాలా ఘోరాలూ, అవినీతీ సాగిపోతోందని, కోట్ల కోట్ల డబ్బు కాజేశారని, మన దేశం పరువు ప్రతిష్టలు మంటగలిసి పోతున్నాయని ఈ మధ్య చాలా ఛానళ్ళూ, పత్రికలూ ఘోషిస్తున్నాయి. కాని వీరికి దృష్టి లోపం ఉన్నదనీ, అవన్నీ కిట్టని వాళ్ళ మాటలనీ నేను రూఢీగా చెప్పగలను.
పూర్తిగా చదవండి

Sunday, September 19, 2010

సాహిత్యంలో జీవహింస

ప్రపంచంలో చాలామందికి పెద్ద వ్యసనం - క్రాస్ వర్డ్ పజిల్. మరో పెద్ద వ్యసనం - డిటెక్టివ్ సాహిత్యం.
చాలా గొప్ప గొప్ప వ్యక్తులు,రచయితలు -డిటెక్టివ్ నవల చదవందీ నిద్రపోని సందర్భాలున్నాయి.
అలవాటు కారణంగా 'గొప్పవారి ' జాబితాలో చేరడం దొంగదారికాదనుకుంటే - నాకూ రెండు వ్యసనాలూ ఉన్నాయి.
క్రాస్ వర్డ్ పజిలు లేని ఆదివారం వస్తే - విలవిలలాడుతాను. స్టానీ గార్డనర్,అగాధా క్రిస్టీ, కోనన్ డాయిల్, ఎడ్గార్ వాలెస్,
పీటర్ చీనీ - ఇలా ఒకసారి కాదు, నాలుగయిదుసార్లు చదివిన నవలలున్నాయి.

Monday, September 13, 2010

'సత్యా' గ్రహం

ఈ దేశానికి మహాత్ముడు సత్యాగ్రమనే ఆయుధాన్నిచ్చి నిన్నటికి సరిగ్గా 104 సంవత్సరాలయింది. ఎవరీ మహత్ముడు? ఏమిటీ సత్యాగ్రహం?
ఈ దేశంలో పదిమందిని - చాలామంది నాయకులతో సహా - ఈ ప్రశ్న వేస్తే చాలా విచిత్రమైన సమాధానాలొస్తాయి. ఆ మధ్య ఓ టీవీ ఛానల్ మన జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? అని కొందరు నాయకుల్ని ప్రశ్నలు వేసింది. చాలామంది నాయకులు తెల్లమొహం వేశారు. ఎక్కువ మంది వెర్రితలలు వేశారు. కొందరు నిస్సహాయంగా తలలూపారు. గాంధీజీకి కూడా అలాంటి గతిపట్టే రోజులు దగ్గరికి వచ్చాయేమో!
పూర్తిగా చదవండి

Sunday, September 5, 2010

సహజీవనం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి ఒక క్రిమినల్ కేసులో శిక్షవేసింది న్యాయస్థానం. పార్టీ వర్గాలు శివమెత్తారు. ఊళ్ళనిఅల్లకల్లోలం చేశారు. 2000 ఫిబ్రవరి 2 తేదీన ధర్మపురిలో కొందరు నాయక భక్తులు - కోయంబత్తూరు వ్యవసాయవిశ్వవిద్యాలయం బస్సుకి నిప్పంటించారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు - 44 మంది ఉన్నారు. కాలుతున్న మంటల్లోంచిబయటపడలేక ముగ్గురమ్మాయిలు - కోకిలావని, గాయత్రి, హేమలత అక్కడికక్కడే కాలి బూడిదయిపోయారు. ఇందుకుకారణమయిన ముగ్గురు స్వామి భక్తులు నెడుం చెళియన్, రవీంద్రన్, మునియప్పన్ అరెస్టయారు. విచారణలు జరిగాక - సేలంకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ అన్ని కోర్టులూ వీరికి మరణ శిక్షను ఏకగ్రీవంగా అంగీకరించాయి. మొన్ననే సుప్రీం కోర్టు శిక్షనుఖరారు చేసింది - పదేళ్ళ తర్వాత.
పూర్తిగా చదవండి

Sunday, August 29, 2010

బూతు క్రీడ

మొదట 'కండోం'కి అర్ధం తెలుగు పాఠకులకు చెప్పాలి. గర్భ నిరోధానికి, సెక్స్ వ్యాధులు రాకుండా జాగ్రత్తపడడానికి ఉపయోగించే రబ్బరు తొడుగు. ఇంతకంటే వీధిన పడడం నాకిష్టం లేదు.

Sunday, August 22, 2010

గురి తప్పిన నిరసన

నిన్నకాక మొన్న - స్వాతంత్రదినోత్సవం నాడు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద ఒక మాజీ పోలీసు ఉద్యోగి
బూటువిసిరాడు. అంది కొన్ని అడుగుల దూరంలో తప్పిపోయింది. ఇతను ఉద్యోగంలోంచి ఏవో కారణాలకి బర్త్ రఫ్ అయాడు.
పాకిస్తాన్ వరదల్లో అల్లాడుతూంటే బ్రిటన్ లో పర్యటిస్తున్నందుకు నిరసనగా లండన్ లో ఒక పాకిస్థానీ తమ అధ్యక్షుడు
అసిఫ్ ఆలీ జర్దారీగారిమీద బూటు విసిరాడు. అదీ గురితప్పింది

Sunday, August 15, 2010

మంచితనం కూడా అంటువ్యాధే

పధ్నాలుగు సంవత్సరాలుగా మా అబ్బాయి స్మారకార్ధం జాతీయ బహుమతి కార్యక్రమాలు జరుపుతున్నా - ఏనాడూ నేను కాలం రాయలేదు. రాయవలసిన అవసరం లేదని నేను భావించాను. కన్నీళ్ళలోంచి ఓదార్పుని వెదుక్కోవడం - నా దురదృష్టం నాకిచ్చిన విముక్తి. అది నా వ్యక్తిగతం. అయితే నిన్న నాకు ఒకాయన ఉత్తరం రాశాడు. ఆయన మొన్న జరిగిన 13 గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ బహుమతి ఉత్సవానికి హాజరయాడు. ఆయనెవరో నాకు తెలీదు. ఆయన్ని నేనెప్పుడూ కలుసుకోలేదు. నిన్నకూడా కలుసుకోలేదు.

Wednesday, August 11, 2010

నా మాట




నా పేరు శ్రీనివాస్ గొల్లపూడి

మిమ్మలనలరించాలీ

ఆడీ పాడీ..,

మీ నవ్వులు మీ గుబులూ

తెరపైన చూపించే

డైరెక్టరునవ్వాలని..

నే..కోరుకున్నా!

´´´

మొదలెట్టానొక చిత్రం

'ప్రేమ'ను కావ్యంగ ఎంచి

కొన్ని పుటలు లిఖించాక

ఆపదొచ్చెనను వరించి

'మృత్యు 'వన్న పక్షి ఒకటి

నా మీదే వాలిందీ

అలలలోన ముంచివేసి

నా ప్రాణంగైకొందీ

చెమరించని కళ్ళులేవు

దుఃఖించని గుండెలేదు

'అయ్యో ' అని విలపించని

బంధుమితృలొకరు లేరు

ఎగసి పడే సంద్రంలో

నడీ మధ్యన నావలాగ

నా కావ్యం మిగిలింది

నన్ను చూసి నవ్వింది

´´´

అది చూసినవాళ్ళు

గుండె పగిలి ఏడ్చారు

ఇలా ఇలా కావ్యం

మిగలకూడదన్నారు.!

´´´

వందనాలు నాన్నా

తోడు నీవు నిలిచావూ

నేను 'వదిలి ' వచ్చిన పని

నీవు పూర్తిచేశావూ..!

గుండెముక్కలౌతున్నా

మెగాఫోను పట్టావూ

నేను కన్న 'తీపికలను '

కావ్యంగా మలిచావు..!

´´´

నేను 'పొంద 'లేనిదాన్ని

ఇతరులు అయినా పొందే

అవకాశం ఇవ్వాలని

ప్రతిన ఒకటి పూనావూ!.

నాలాగే సరికొత్తగ

చలన 'చిత్ర 'లోకంలో

తమ 'ప్రజ్న 'ను చూపుకుంటె

అదే చాలునన్నావు!

´´´

నా పేరిట.. నా గుర్తుగ

'పురస్కార ' మొకటి చేయ

సంకల్పము చేశావూ

తగిన 'వనరు 'లిచ్చావు!

దిగులు..గుబులు ఇంకేలా

'నా ' కోరిక తీరగా

వత్సరానికొక రోజున

నేను 'మిమ్ము 'కలువగా!

ఇసుక మేడ కూలినచో

బాధపడుట దండగ

కలల అలల ఊయలలో

'ఆత్మ' తేలుచుండగా!

´´´

వత్సరానికొకరోజున

మరలా ప్రభవించనా

'ప్రతిభ ' చూపు 'దర్శ'కులను

ఆకసానికెత్తనా!

´´´

నేనున్నా లేకున్నా

నా వారలు ఉన్నారు!

మీ శ్వాసలో ...మీ గెలుపులో

నన్ను 'చూసు'కుంటారు!

´´´

ఇరుకు ఇరుకు శరీరాన

'నాడు ' నేను బ్రతికున్నా..

విశ్వవ్యాప్తమై 'నేడు'

మీలో జీవిస్తున్నా!

సెలవా మరి ఇక ఉంటా

మరోసారి కలుస్తా

మిమ్మలనలరించేలా

'మరో 'కలని నే తెస్తా...!

ఇట్లు

మీ శ్రీనివాస్ గొల్లపూడి

విన్నది

భువన చంద్ర

Monday, August 9, 2010

తాళం చెవుల కథ

దేశంలో ప్రజాభిప్రాయం రెండుగా చీలిపోయిన అతి విచిత్రమైన సంకట పరిస్థితి గతవారమే తలెత్తింది. స్థూలంగా చెప్పుకుందాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మరో నలభై రోజుల్లో కామన్వెల్తు క్రీడలు జరగనున్నాయి. ఇందుకుగాను రకరకాలయిన కార్యక్రమాలకి 65 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. ఇందులో సూటిగా క్రీడల కయ్యే ఖర్చు కొంత, క్రీడలు కారణంగా రోడ్లు, నగరం, వసతుల ఏర్పాట్ల ఖర్చులు కొన్ని. క్రీడలు కారణంగా ఇవన్నీ మెరుగవుతాయి. కనుక కొంత ఖర్చు - 'వీరయ్య పెళ్ళిలో పేరయ్యకి జందెం పోచ' సామెతగా కలిసి వస్తుంది.
పూర్తిగా చదవండి


Monday, August 2, 2010

చట్టం బలవంతుడి తొత్తు

చాలా సంవత్సరాల క్రితం ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసాక దూరదర్శన్ లో ప్రతి ఆదివారం అద్భుతమయిన సీరీస్ ని ప్రసారం చేశారు. యుద్ధంలో మరణించిన జవాన్ల కథలు. ప్రతీవారం అంత గొప్ప యువత దేశం కోసం ప్రాణాలర్పించినందుకు గర్వపడి, అంత గొప్ప బిడ్డని పోగొట్టుకున్నందుకు కుటుంబంతో కంటతడి పెట్టుకోని వారం ఉండేది కాదు. దూరదర్శన్ చరిత్రలో ప్రసారం చేసిన గొప్ప సిరీస్ లో అవి ఒకటి.

Wednesday, July 28, 2010

వెన్నెల కాటేసింది

నలభై సంవత్సరాల క్రిందట నేను వ్రాసిన నవల ఇది. క్రిందటి సంవత్సరం 'కౌముది ' లో సీరియల్ గా వచ్చినప్పుడు ఈ తరం పాఠకులనుంచి వచ్చిన స్పందన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇందుక్కారణం సున్నితమైన మానవ సంబంధాలకున్న బలం.. అని నాకనిపించింది. బ్లాగు మిత్రులకి కూడా దీన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ పోస్టు వ్రాస్తున్నాను.
ఈ నవల వెనుక నున్న చిన్న నేపథ్యం గురించి ఒక్క సారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ..ఇందులోని సుబ్బులు పాత్రకి మాత్రుక - నా పధ్నలుగో యేట నా ఆలోచనల్లో దొరికింది. మేము అద్దెకుండే ఇంట్లో ఒక వాటాలో ఉండే వారింటికి ఓ అమ్మాయి వచ్చింది. నా వయస్సేనేమో. ప్రేమా దోమా తెలీని దశ అది. ఒక వేళ మనస్సులో ఏదో ఆకర్షణ ఉన్నా - దానికి ఇతమిథమైన రూపం లేదు. తీరా ఆమె కొన్నాళ్ళుండి వెళ్ళిపోయాక ఓ పద్యం రాసుకున్నాను
పోయితివి నీవు నను వీడిపోయి ఎటకో
యేను నీ పదఛాయల వేగలేక
వేడి నిట్టూర్పు కెరటాల నీడలందు
జీర్ణమయిపోవు దుఃఖంపు జీరనైతి..
మరో పదేళ్ళకి సుబ్బులు ప్రాణం పోసుకుని నా నవలలో పాత్రయింది.
మీరూ చదవండి..!

Monday, July 26, 2010

కోమాలో మన దేశం

కొన్ని రోజుల కిందట భారత పరిశ్రమ సమాఖ్య యూరోపు విభాగపు డైరెక్టర్ మోహన మూర్తి అనే ఆయన జర్మనీలో ఒక చర్చ కార్యక్రమంలో పాల్గోన్నారట. ఆ చర్చలో పాల్గొన్న వారంతా ఈ మూర్తి గారిని చూసి "ఏం బాబూ! మీ దేశం కోమాలో ఉందా? కళ్ళు తెరుస్తోందా ?" అని వెక్కిరించి ముక్కుమీద వేలేసుకున్నారట. వాళ్లు చెప్పే వివరణలు వింటూ ఈయన తెల్ల మొహం వేసారట. మూర్తి గారికి సరైన అనుచరులు లేరు. నన్ను తీసుకెళ్ళి వుంటే - యూరోపు ప్రముఖుల కళ్ళు తెరిపించే లాగ - మనవాళ్ళు "కళ్ళు" తెరుచుకునే ఉన్నారని చెప్పి ఒప్పించేవాడిని.

Sunday, July 18, 2010

మతం..హితం..

మధ్య పూణే వెళ్ళాను. అక్కడొక వింత దృశ్యం నన్నాకర్షించింది. నిజానికి ఎవరినయినా ఆకర్షించేదృశ్యమది. స్కూటర్ల మీద తిరిగే అమ్మాయిలందరూ కళ్ళుమాత్రం కనిపించేలాగ ముఖమ్మతా గుడ్డల్ని చుట్టుకుని ఉన్నారు. సరే. ఆరోగ్య సూత్రాల ప్రకారం బొగ్గుపులుసు వాయువుని పీలుస్తున్నారనుకుందాం. కళ్ళు మాత్రమే కనిపించే ముసుగు దేనికి? రోడ్డు మీద దుమ్ము దూసర వారు ముక్కుపుటాల్లోకి వెళ్ళకుండా జాగ్రత్తట. ఇది చాలా విడ్డూరమైన దృశ్యం. మా మిత్రుడిని అడిగాను. ఆయన నవ్వి కొన్నాళ్ళ క్రితం ఇదే అనుమానం కొత్తగా వచ్చిన నగర కమీషనర్ సత్యపాల్ సింగ్ గారికి వచ్చిందట. ఆయన ఏదో సభలో 'టెర్రరిస్టుల్లాగ ' అమ్మాయిల ముఖాలకి ముసుగులేమిటి?" అన్నారట. అంతే. ముసుగుమాట వదిలేసి 'టెర్రరిస్ట్ ' అనే మాటని ఆడపిల్లలు పట్టుకున్నారట. "మమ్మల్ని టెర్రరిస్టులంటారా? " అని రెచ్చిపోయారట.

Saturday, July 17, 2010

మొదటి వసంతం పూర్తిచేసుకున్న 'మారుతీయం '

ఈ బ్లాగ్ ప్రాంభమయి సంవత్సరమయిందని నా మిత్రులు కిరణ్ ప్రభగారు గుర్తుచేశారు. అసలు ఈ బ్లాగ్ ని వారింట్లోనే (కాలిఫోర్నియాలో) ఆయనే డిజైన్ చేసి ప్రారంభించారు. దాదాపు 40 ఏళ్ళ కిందట పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు ఆంధ్రజ్యోతిలో కాలం రాయమన్నప్పుడు భయపడ్డాను. కారణం - అప్పుడు తలమునకలుగా సినిమాల్లో నటిస్తూండడం. కొంతకాలం తర్వాత నండూరి రామమోహన రావుగారు వత్తిడి చేసి, పురాణం మద్దతుని సంపాదించి నన్ను దినపత్రికలో రాసేటట్టు చేశారు. క్రమంగా ఆ రుచి మరిగి ఇప్పటిదాకా ఆ పనిని నిరంతరాయంగా చేస్తూ వస్తున్నాను. పుట్టిన మనిషికి ఊపిరి పీల్చడం లాగ - ఆలోచించే మనిషికి తన ఆలోచనల్ని చెప్పుకునే వేదిక 'ఊపిరి'లాంటిది. అయితే ఈ బ్లాగ్ వ్యవహారం నాకు లొంగుతుందా అని భయపడ్డాను. ఆ పనీ తానే చేస్తానన్నారు. మరొక ముఖ్యమయిన సందేహం - కొన్ని బ్లాగులు చూసినప్పుడు ఊసుపోని వ్యవహారంగా - అనవసరంగా, అర్ధంలేని కబుర్లతో కాలక్షేపంగా కనిపించింది. అది నా వంటికి పడని విషయం. కాగా అంత తీరికా, అలాంటి అభిరుచీ బొత్తిగా లేనివాడిని. కనుక - ఈ బ్లాగులో కనిపించే విషయాల్ని 'ఫిల్టర్ ' చేసే బాధ్యతా ఆయనే తీసుకున్నారు. ఇప్పుడు - సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు - అలాంటి ఊకదంపుడికి తొలిరోజుల్లో ప్రయత్నాలు జరిగి, కయ్యానికి కాలుదువ్వే పనులు కొందరు చేసినా - వాటిని ఇక్కడ మినహాయించడాన్ని గమనించి మానుకోవడమో, తప్పుకోవడమో చేశారు. అది ఆరోగ్యకరమైన పరిణామం. ఈ సంవత్సరం పొడుగునా ఈ బ్లాగు చదివేవారికి - నిజమైన, సహేతుకమైన, సలక్షణమైన సందేహాలో, విమర్శలో చేసినప్పుడు నా స్పందనని గమనించే ఉంటారు.
ఈ వార్షికోత్సవంలో నాతో నా ఆలోచనలు పంచుకునే సహృదయులందరికీ - ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని పాటిస్తున్నందుకు నా అభినందనలు, కృతజ్నతలు. అంతకు మించి - ఈ బ్లాగు వెర్రితలలు వేస్తోందనిపిస్తే ఎప్పుడో తప్పుకునేవాడిని.
కొత్త ఆలోచన వచ్చినప్పుడు, కొత్తగా వేదన కలిగినప్పుడు, ఓ ప్రాణ మిత్రుడు శెలవు తీసుకున్నప్పుడు ఓ అన్యాయం సమాజానికి జరిగిందని బాధ కలిగినప్పుడు - వెతుక్కునే స్నేహితుని ప్రతిస్పందనే ఈ బ్లాగు పరమార్ధమని నేను నమ్ముతాను. ఈ సంవత్సరం పాటూ నాతో అలాంటి ఆలోచనలనే పంచుకున్న మీ అందరికీ నా అభినందనలు. కృతజ్నతలు. మనిషి ఏకాంతంలో ఆలోచించినా తన చుట్టూ ఉన్న సమాజంలోనే, సమాజంతోనే స్పందిస్తాడు ఆ గుండె చప్పుళ్ళకు 'మారుతీయం' వేదిక కావాలని నా ఆశ. ఈ ఆశతోనే మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదాం.

Sunday, July 11, 2010

అయ్యో!ఆహా..!

మధ్య చాలా చోట్ల చాలా రకాలయిన హత్యలు జరిగిపోతున్నాయి. వాటి గురించి వింటేనే గుండె బరువెక్కి వేదన
కలుగుతుంది.మొన్నటికి మొన్న అజాద్ మరణం గురించి పేపర్లో చూశాం. అలాగే హేమచంద్ర అనే పాత్రికేయుడి మరణం.
వారి తల్లిదండ్రులు,సమీప బంధువులు, స్నేహితులూ కార్చిన కన్నీరు, వారికి జరిగిన దుర్ఘటన, నిండు ప్రాణాలు
బలయిపోయిన దైన్యత - ఇవన్నీఆయా పత్రికల పుణ్యమాంటూ తెలిశాయి. ఎన్నో వ్యాసాలు ఉదారంగా రాశారు.
అవన్నీ జరిగిన దుర్ఘటన, జరగకూడని అన్యాయాన్నివివరించాయి. పత్రికలు వారి తల్లిదండ్రులు, సానుభూతిపరులు
ఫోటోలను చక్కగా ప్రచురించారు. ఇవన్నీ వారికి నిజమైన నివాళి.మనకూ బాధకలిగించిన సందర్భమది.