Sunday, June 26, 2011

ఆసుపత్రికి తోవ ఎటు?

ఈ మధ్య టీవీలో ఒక ఆలోచనాభరితమైన చర్చని చూశాను.
మందు ఆ చర్చకి ప్రాతిపదిక. మహారాష్ర్ట ప్రభుత్వం పిల్లలు మద్యం తాగే వయస్సుని 21 నుంచి 25కి పెంచారు. అమితాబ్ బచ్చన్ గారికి కోపం వచ్చింది. అలా పెంచడం అన్యాయమని ఆయన వాపోయారు. ఈ టీవీ చర్చ ముఖ్యోద్దేశం ఏమిటంటే - అలా పెంచడం ద్వారా పిల్లలు తమకేం కావాలో నిర్ణయించుకునే హక్కుని కోల్పోతున్నారని పెద్దలు కొందరు వాక్రుచ్చారు. పెద్దల బుద్దులు ఎలా వెర్రితలలు వేస్తున్నాయో మనం అనునిత్యం చూసి ఆనందిస్తున్నాం. జైల్లోనే డాక్టర్ సచాన్ హత్య, బీహార్ లో ధర్నా చేస్తున్న రైతును తొక్కి చంపిన పోలీసుల వీరంగం, కోట్ల ధనం దోపిడీ- ఇవన్నీ మనం రోజూ చూసే సుందర దృశ్యాలు. పాతికేళ్ళ లోపునే మందు తాగే విచక్షణ యువకులకు ఉన్నదని వీరి వాదన. టీవీలో ఈ చర్చ వీలయినంత అసహ్యంగా, అసందర్భంగా, ఆలోచనారహితంగా కనిపించింది నాకు.
పూర్తిగా చదవండి

5 comments:

  1. చదువుతుంటే నాక్కూడా అలాగే ఉంది..

    ReplyDelete
  2. అసలు తాగటమే పెద్ద తప్పు ఆ తాగటానికి కనీస వయస్సు ఇది అని చెప్పటం ఏమిటి. అటువంటి తప్పు ప్రస్తుతం ఈ వయస్సు నుంచి చెయ్యచ్చు అని ఉంటె, ఆ వయస్సును పెంచి, అది మంచా చేడా అని చర్చొకటా!! సమాజం ఎటు పోతున్నది?

    మారుతీ రావుగారూ మీరు కావాలనుకునే ఆ అసుపత్రికి దారి లేదు. ఎందుకు అంటే అటువంటి ఆస్పత్రి ఉంటేగా.

    మద్య సేవనం అనేది పై తరగతుల్లో ఫ్యాషన్, కింది తరగతులలో దురాచారం అనుకున్నప్పుడే, ఈ సమాజం పతనమైపోయింది. ప్రతి రోజూ "మందు" లేకుండా బతకలేని "పెద్దల్ని" ఎందరినో చూశాం, చూస్తున్నాం. వాళ్ళవల్లే తాగటం అనేది "చెడు కాదు" అన్న ఒక నమ్మకం సమాజంలో వ్యాపించింది. ఆ పెద్దలనబడే వాళ్ళందరూ చెంపలేసుకుని ఈ సమాజ పతనానికి తామే ఎక్కువ కారణం అని ఒప్పుకుని, తాగుడు మానేసి, ఇప్పటి తరానికి మంచి చెప్పే ప్రచార ఉద్యమం చేపట్టగలరా??!! అటువంటి మానసిక స్థైర్యం ఆ "పెద్దలకు" ఉన్నదా?

    ReplyDelete
  3. Meeru cheppina maata baane vundi ganivvandi aakhari para lo quote chesina examples chadivite maatram navvochhindi- !

    cheers
    zilebi.

    ReplyDelete
  4. అమితాబ్ బచ్చనే పిల్లల్ని బుజ్జగించి తాగిస్తుంటే మీరేమిటండీ బాధ పడతారు. మీకు ఈ కాలం పిల్లలంటే ఈర్ష్య చిన్నప్పుడే తాగుతున్నారని.. :) :) :)
    ఇది చదివాక అమితాబ్ అంటే వున్న గౌరవం కాస్తా పోయింది.

    ReplyDelete
  5. అసలు తాగుడుకి ' వయసు ' అనేదొకటుంటుందనీ దాని మీద చర్చలు జరుగుతాయనీ నాకిప్పటివరకూ తెలియదు. తెలిశాక నా బాధ ఇంకా ఎక్కువయ్యింది. నిజానికి ఈ ధోరణికి పెద్దలు కారణమని నాకు అనిపించడంలేదు. ప్రజల అరోగ్యంతో చెలగాటమాడే ప్రభ్తుత్వాలు ఆదాయాన్ని పెంచుకోవడానికి బలవంతంగా ప్రజల మీద రుద్దుతున్నాయి. అందులోనూ ఫారిన్ సరుకులపై వచ్చే ఆదాయం బాగా ఎక్కువగా ఉంటుందేమో. తాగమనడమెందుకు, తాగాక ఆరోగ్యం చెడిన వారికోసం, విధవరాళ్ళ కోసం, అనాధ బాలలకోసం సంక్షేమ పథకాలెందుకు? ఇదంతా చాలా గందరగోళంగా, కళ్ళల్లో నీళ్ళు తెప్పించేదిగా ఉంది. అసలు ప్రభుత్వాల మీద కేసు వేయాలన్న కోరిక నాలో చాలా బలంగా ఉంది. అయినా ఒక మందు వ్యాపారి మహాత్ముడి వస్తువులు ( వేలంపాటనుంచి తప్పించి ) మన దేశానికి తెప్పిస్తూంటే చూస్తూ ఉన్న సర్కారులకు నా లాంటి వాళ్ళు వేసే కేసులు దున్నపోతు మీద వాన కాదూ ?

    madhuri.

    ReplyDelete