Subscribe to:
Post Comments (Atom)
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
నమస్కారం మారుతి రావు గారు,మీ బ్లాగ్ ని మొదటిసారి చూస్తున్నాను.చూసిన వెంటనే ఏదో చప్పాలనిపించింది ,కాని ఎక్కడ చెప్పాలో తెలియక ఇక్కడ రాస్తున్న.గొప్ప వ్యక్తుల తెలివితేటలు,అనుభవాలు నిజంగా ఉపయోగపడేది వాటిని రచనల రూపం లో తరువాతి తరాలకి అందించినపుడే.నేటి తరం వారు నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను సులభంగా గొప్ప రచనల రూపంలో అందిస్తూ, ఎప్పుడూ మా మధ్యే మార్గ దర్శకంగా వుండే గొప్పవారిలో మీరు ఒకరు.మీలాంటి వారితో మాట్లాడే అవకాశం ఇలా నాకు కలిగినందుకు చాల ఆనందంగా ఉంది.ఇలానే మీరు మంచి రచనలు అందిస్తూ ఎప్పుడూ సంతోషం ఉండాలని కోరుకుంటున్న.నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా భాషా దోషాలుంటే మన్నించండి
ReplyDeleteనమస్కారం మారుతి రావు గారు!
ReplyDeleteనేను కూడా ఆ మహానుభావుదుని చూసాను అన్న విషయమము మీతో
పంచుకోవాలని ఒక చిన్ని ఆశ. మొన్న వందేళ్ళ కధ ప్రోగ్రాం HMTV లో
చూస్తూ అనుకున్నాను!!
ఆంధ్ర షెల్లీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గురుంచిన ఒకచిన్నదయిన అపురూపమయిన జ్ఞ్యాపకం
అసలు జ్ఞ్యాపకాలు లేని జీవితాలు మనం వుహించలేము. ఒక మనిషి జీవితంలో ఎన్నో,ఎన్నోన్నో జ్ఞ్యాపకాలు
నిజముగా అవన్నీ అక్షర నిక్షిప్తం చేస్తే కొన్ని లక్షల కోట్లలో పుస్తకాలూ ఉండేవేమో అన్న ఒక చిత్రమైన వుహ. అలాంటి మరపురాని అమూల్యం అయిన ఒక జ్ఞ్యాపకం
తొలి వియోగిని నేనే!
తొలి ప్రేయసిని నేనే!
ఆ నాటి కీ నాటి కేను నీ దాననే!!! ....... అది తను సృష్టించుకున్న ప్రేయసి ఊర్వశి నుంచి
కవి!భావకవి!మనవాడు! మనతెలుగువాడు!ప్రపంచం మొత్తం గర్వించ తగిన మహానుభావుడు!!!!!!
అంతటి మహాకవిని నేను కలిసాను అని తలుచుకుంటే చాల గర్వం గా అనిపిస్తుంది.
ఎప్పుడో నా చిన్ననాటి సంగతి, చిన్నదే కానీ చాల గొప్పది అది ఈ నాటి సాహితి మిత్రులోతో పంచుకుందామని,
దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ని నేను నా చిన్నతనంలో బహుశ నాకు పది ,పదకొండు సం ఉంటాయి. కాకినాడలో మాఇంటి ఎదురుగ ఒక కాలేజీ ప్రినిసిపాల్ గారు వుండేవారు బహుసా P.R. College అనుకుంట ఆయన
పేరు కూడా సరిగా గుర్తు లేదు సీతారామరావు గారు అన్నట్లు లీలగాజ్ఞ్యాపకం. ,ఇక్కడ మానాన్నగారి గురించి కొంత చెప్పాలి. ఆయనికి సాహిత్యాభిలాష చాలవుండేది.మా నాన్నగారి గురువు పాలగుమ్మిపద్మరాజుగారు. అంత చిన్నతనంలోనే మాతోటి పుస్తకాలు గురుంచి ముఖ్యంగా భారతం గురుంచి అందులో ఉద్యోగపర్వం గురుంచి తిరుపతి వేంకటకవులు పద్యాలూ వాటి గురుంచి కూడా చెప్పుతూ వుండేవారు.అలా చిన్నతనం నుంచి నా కు సాహిత్యం మీద అబిమానం పెరిగింది.ఆ సమయంలో ఓ రోజుపొద్దున్నే ఎదురుకుండా ప్రిన్సిపాల్ గారి ఇంటికి శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి వచ్చారు. అ విషయం మా నాన్నగారికి ముందే .చెప్పారు.నాన్నగారి తో పాటు నేను కూడా వెళ్ళాను , మా నాన్నగారు ఆయనకి నమస్కారం చేసారు నాకు లీలగా గుర్తు వుంది ఆయన రూపం తెల్లటి మల్లెపువ్వు లాంటి పంచె,లాల్చీలో వున్నారు. అంతే అంతకు మించి గుర్తు లేదు. కానీ అప్పటికే ఆ మహాకవి గొంతు మూగపోయింది. మా నాన్న గారు మటుకు చాల ఆనందపడ్డారు అంతటి మహాకవి ని కలిసినందుకు ,అలాగే భాదపడ్డారు కూడా ఇంకా ఆ గొంతు వినలేం కదా అని.
అంతటి మహానుభావుడిని చూసాను అదే ఒక పెద్ద రివార్డ్ అని తరువాతతెలిసింది
ఇది నాకు ఒక అరుదయిన ఎంతో విలువయిన జ్ఞ్యాపకం.