Monday, February 13, 2012

బూతు సమస్యా?పరిష్కారమా?

ఈ మధ్య అడ్డమయిన కారణాలెన్నింటికో రాజకీయనాయకుల్ని విమర్శిస్తున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. ఇళ్ళమీద రాళ్ళేస్తున్నారు. పదవుల్లో ఉన్నవారిని మంత్రి పదవులకు రాజీనామా చేయాలని నినాదాలు చేసి గద్దెలు దించుతున్నారు. ఇది చాలా అన్యాయం. అనుచితం.
పూర్తిగా చదవండి

2 comments:

 1. శ్రీ గొల్లపూడి మారుతీరావు గార్కి నమస్కారములు. నేను మీ అభిమానిని. మీ రచనలు, మీ సినిమాలు ఎంతో ఇష్టంగా చదువుతాను, చూస్తాను.
  మిమ్ములను ఈ బ్లాగు ముఖంగా కలుసుకోవడం సంతోషంగా ఉంది.
  మీరు కొత్తగా రాసిన బూతు సమస్యా? పరిష్కారమా? అన్న విషయంలో నా అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.
  మీరు అడ్డమైన కారణాలెన్నింటికో రాజకీయనాయకులను పదవులకు రాజీనామా చేయమంటున్నారు. ఇది చాలా అన్యాయం. అనుచితం అన్నారు. నేను నా మనస్సును చాలా విశాలంగా చేసుకున్నప్పుడు నాకు మీ మాటలు సబబే అనిపించాయి కానీ....
  నేను ఒప్పుకుంటాను ప్రజాప్రతినిధులైనంత మాత్రాన శ్రీరాముడికి వారసులవ్వనవసరం లేదని. వాళ్ళూ కేవలం మనుష్యులే అని. వారి శరీరాల్లోనూ హార్మోన్లు ఉంటాయని. అవి వాటి ఉనికిని చాటుతుంటాయని. ఐనంతమాత్రాన..విచ్చలవిడితనం మానవ సమాజంలో పనికిరాదు. అలా చేస్తే మన జాతి మూలాలు దెబ్బతింటాయి. అప్పుడు రోడ్లమీద సంభోగం జరుపుకునే ఇతర జీవజాలానికీ, మనుష్యులకీ పెద్ద తేడా ఉండదు. కర్ణాటక అసెంభ్లీలో మంత్రులు చేసిన పని క్షమార్హం కాదు. అది సచివాలయం. ఎంతో మంది ప్రజలకు మేలు చేకూర్చే కార్యక్రమాలు రూపొందించే అత్యున్నత వేదిక. అటువంటి చోట కూర్చుని కామకేళి (చాలా మంది బూతు అంటున్నారు. అది నేను బూతు అని అనను. ఎందుకంటే మన పుట్టుకకు కారణమైన యాగాన్ని బూతు అని పిలిచి మనల్ని మనం చిన్న చేసుకోవడం నాకు నచ్చదు) ని చూడటం సరైన పని కాదు. ఆ కొద్ది క్షణాలు ఆయన తన ఆత్రాన్ని ఆపుకుని ఇంటికి వెళ్ళేడప్పుడో, కార్లో వెళ్ళేడప్పుడో చూసుకుని ఉంటే ఎవరికీ నష్టం ఉండేది కాదు. కానీ ఆయన శాసన సభలో కూర్చుని చూడటం వల్ల...మరో ఇద్దరు మంత్రులు చూడటం మొదలెట్టారు. దీని వలన మన ప్రజాధనం సద్వినియోగం కాకపోవడమే కాక, వారి వారి నియోజక వర్గాల్లో అభివృద్ధి కుంటుబడుతుంది. మన అదృష్తవశాత్తూ, ఆయన ఖర్మ వశాత్తూ కొన్ని రోజుల క్రితం దొరికారు. కానీ ఈ పని ఈయన ఎన్ని రోజులనుంచి చేస్తున్నారో..ఎంత విలువైన సభా సమయాన్ని వృధాచేసి ఉంటారో.. మన ప్రభుత్వం మనకు చక్కటి అవకాశం ఇచ్చింది. జన సమ్మర్ధం ఉన్న ప్రదేశాల్లో హుందాగా ఉండండి (నా ఉద్దేశ్యంలో ఇంటర్నెట్ సెంటర్లూ, పార్కులూ అవీ). స్త్రీలు/పురుషులు సిగ్గుతో తలదించుకునే పనిగానీ, వారి ఆత్మాభిమానాన్ని కించపరిచే పని గానీ చేయకంటి. ఇతరులకు అసౌకర్యాన్ని కలుగజేయకండి. తోటివారిని గౌరవించండి. ఇంటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టుండండి. కావాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని చూడండి. శృంగార జీవితాన్ని ఆస్వాదించండి. ఇంట్లో ఇంటర్నెట్ తో మీకు కావలసినన్ని వీడియోలు చూసుకోండి అది నేరం కాదు అని. సచివాలయం అనేది ఒక పబ్లిక్ ప్లేస్. అక్కడ అటువంటి పనులు చేయడం నేరమే. అది శిక్షార్హమే.
  మన సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు నిన్న ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. బూతు ని లీగల్ చేయాలని. ఎవరి భావాలు వారివి. ఒక్కమాట మాత్రం నిజం. మనం మిగతా దేశాలతో పోటీపడి ప్రపంచంలోనే సూపర్ పవర్ అవ్వాలని, వారి విద్యలను అభ్యసించి వారికే పోటీపడాలనుకున్నప్పుడు.. సంస్కృతిలో వచ్చే మార్పులను కూడా అంగీకరించాలి. మన సంస్కృతి, మన చరిత్ర అనుకుంటూంటే ఎన్నటికీ మనం మారలేము. కానీ భారతదేశ సాంప్రదాయాన్ని మిగతా దేశాలు గౌరవించి ఆచరించడానికి ప్రయత్నిస్తుంటే మనం వారి విధానాల్ని అనుసరించాలనుకుంటున్నాం. వారికి మన విధానం ఎందుకు నచ్చి ఉంటుంది?. విచ్చలవిడి తనానికి అలవాటు పడిన వారికి అది బోర్ కొట్టి ఉంటుంది. ఇప్పుడు మెల్లగా మనకు సంక్రమిస్తోంది ఆ విధానం. ఇంకొంత కాలంలో పోర్న్ టీ.వి లు మనదేశంలో కూడా వస్తాయి.,ఆ మోజు తీరాక కొన్ని వందల సంవత్సరాలు తర్వాత మళ్ళీ మన సంస్కృతి మనకు నచ్చుతుంది. అంతే ఇది కాల చక్రం. అందరూ ఎలా నడిస్తే అలా మనమూ నడవడమే.
  ఇంత రాసిన నేను అన్ని భోగాలు విడిచి పెట్టేసిన యోగి అనుకునేరు. నేను చిన్నవాణ్ణే..నాకింకా పెళ్ళి కాలేదు..సమాజంలో ఉన్నప్పుడు అందరికీ ఆమోగ్యకరం గా జీవించాలి అని నమ్ముతాను.

  ReplyDelete
 2. -----
  My Response
  -----
  Dear Kirangaru
  You seem to have totally missed the sarcasm in my column. I totally agree with you. If you think, I sounded as though I am supporting the porn viewing in the legislature, I am sorry. I missed the bus. It is my incapcity to deliver the thought.
  Gollapudi Maruthi Rao

  ------
  Kiran's Re-response

  From: Kiran Mangalampalli
  Date: 2012/2/13
  To: gollapudi maruthi rao

  గౌరవనీయులైన మారుతీరావు గారికి,
  నా తొందరపాటుకు క్షంతవ్యుడను. మీ బ్లాగులో ముందు నాలుగు లైన్లు మాత్రమే చూసి కొంత వేదనతో రాసానే కానీ, "పూర్తిగా చదవండి" అన్నచోట క్లిక్ చేసి మొత్తం చదివాక అయ్యో తొందరపడి పోస్ట్ చేశానే అనిపించింది. కానీ వెనక్కి తీసుకోవడం ఎలాగో తెలియలేదు. మీరే తొలగించగలరు. నాకు పితృ సమానులు మీరు. క్షమించగలరు.

  ధన్యవాదములు
  కిరణ్

  ReplyDelete