skip to main |
skip to sidebar
మరో 48 గంటల్లో గాంధీ జయంతి. 143 సంవత్సరాల కిందట గాంధీ పుట్టిన రోజు. 64 సంవత్సరాల కిందట గాంధీ నిర్యాణం. గాంధీ తత్వాన్ని భ్రష్టు పట్టించడం ప్రారంభమయి అప్పుడే 65 సంవత్సరాలయిపోయింది.
ఈ తరంలో చాలామందికి గాంధీ చరిత్ర. కొందరికి జ్ఞాపకం. మరీ ఇటీవలి తరానికి గాంధీ ఓ సినిమా. రాజకీయ నాయకులకి గాంధీ కొంగుబంగారం. ఉద్యమకారులకి సాకు. కాని ఆయా దేశాల చరిత్రల్నే మార్చిన ఇద్దరు ఉద్యమకారులకి గాంధీ స్ఫూర్తి, ఆదర్శం, ఆకాశం.
పూర్తిగా చదవండి
గురజాడ పుట్టి మొన్నటికి 150 సంవత్సరాలయింది. వెళ్లిపోయి 97 సంవత్సరాలయింది. అజరామరంగా నిలిచిన 'దేశమును ప్రేమించుమన్నా' పాట ఆయన కలం నుంచి జాలువారి 102 సంవత్సరాలయింది. ఆ పాట పాఠకుల చేతుల్లోకి వచ్చి 99 సంవత్సరాలయింది. దానికి ప్రముఖ వాయులీన విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడుగారు బాణీని ఏర్పరిచి 98 సంవత్సరాలయింది. ఆ తర్వాత మరో 26 నెలలకు మహాకవి కన్నుమూశారు. ఆ పాటని 1913 ఆగస్టు 9న కృష్ణాపత్రికలో ముట్నూరి కృష్ణారావుగారు ప్రచురించారు
పూర్తిగా చదవండి
తెలుగులో ఈ మాట లేదు కానీ -ఇంగ్లీషులో ఓ అందమైన మాట ఉంది -ఈల వేసేవాళ్లు (విజిల్ బ్లోయర్స్). తమ చుట్టూ జరిగే వ్యవహారాల్లో అన్యాయాన్ని ధైర్యంగా బట్టబయలు చేసేవాళ్లు. దీనికి ప్రధానంగా మూడు కావాలి. మొక్కవోని నిజాయితీ. నిజాన్ని చెప్పి నిలవగల దమ్ము, రెంటినీ సాధించే చిత్తశుద్ధి. వీటిలో ఏదిలోపించినా ఈల గోల అవుతుందేతప్ప -అసలు అవినీతికీ వీరి ప్రత్యేకమైన అవినీతికీ తేడా కనిపించదు.
పూర్తిగా చదవండి
My very first poetry book got inaugurated in Vijayawada yesterday. Thanks to all the well wishers who made this function a grand success!
విదేశీయులకు నమ్మే అవకాశం ఎలాగూ లేదుకాని, స్వదేశీయుల్ని కూడా నమ్మించాల్సిన రోజులొచ్చేశాయి. ఎందుకంటే మన తెలివితేటలు ఎక్కువగా అక్కడినుంచే దిగుమతి అవుతున్నాయి కనుక. అయితే చూడాలనుకున్నవారికీ, తెలసుకోదలిచిన వారికీ ఈ వైభవం కనిపించే దాఖలాలు ఈ సంస్కృతిలో ఇంకా ఇంకా మిగిలే ఉన్నాయి. ఇంతకీ ఏమిటి ఆ వైభవం?
పూర్తిగా చదవండి
ఎంతమందినయినా అడిగాను ఈ లోకోక్తి వెనుక కథేమిటని. ఈ కథ నాకు బాగా నచ్చింది. ఓ రాజుగారికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకి పెద్దకొడుకు. చిన్న భార్యకి చిన్న కొడు కు. అతని పేరు నందుడు. చిన్న భార్యమీద రాజుగారికి మోజు తీరిపోయింది. చిన్న భార్య తమ్ముడు ఏదో నేరం చేశాడు. ఉరిశిక్షని విధించింది న్యాయస్థానం.
పూర్తిగా చదవండి