అందుకే వంటొచ్చిన మంత్రుల్ని కేంద్రంలో ఉంచడం చాలా తెలివైన పని అని సోనియా గాంధీగారికి తెలుసు. తెలంగాణా గురించి ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా గులాం నబీ అజాద్ కానీ, వీరప్ప మొయిలీ కానీ -సరైన సమాధానం కాదుకదా, తృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. కాని ఇప్పటి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ప్రతినిధి వయలార్ రవిగారు కళ్లకు కట్టినట్లు, నోటికి అందేటట్టు -ఆ సమస్యని వివరించారు. 'తెలంగాణా సమస్య అంటే దోశె వెయ్యడమంత తేలికకాదు' అని శెలెవిచ్చారు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
No comments:
Post a Comment