Sunday, December 15, 2013

చీపురు రాజకీయం

చీపురుని ఎన్నికల గుర్తుగా ఉంచాలని ఆలోచించిన వారెవరో నిజంగా మహానుభావులు. ఇంతకంటే ఇంటి ముంగిట్లో, వీధుల్లో, గదుల్లో తిష్ట వేసుకు కూర్చునే సాధనం మరొకటి ఉండదు. దాని అవసరం లేని రోజూ, అవసరం లేని మనిషీ, అవసరం లేని సందర్భమూ ఉండదు. నిజానికి 'చీపురు'ని ఎన్నికల గుర్తు చేయగానే సగానికి సగం విజయం సాధించినట్టే లెక్క. అందునా ఈ మధ్య సమాజంలో చెత్త ఎక్కువయి, చెత్త రాజకీయాలు తల బొప్పి కట్టించే నేపధ్యంలో ఎలాంటి చీపురుతో ఈ చెత్తని బుట్టదాఖలు చెయ్యాలా అనే ఆలోచనతో దేశంలో చాలామంది జుత్తు పీక్కుంటున్నారు.
పూర్తిగా చదవండి

2 comments:

  1. "వాళ్లు మీలాగ చెడిపోవడానికి మరో 60 ఏళ్లు పట్టవచ్చు"

    అప్రస్తుతమైనా ఒక విషయం సార్. ఒక దశాబ్దిక్రితం ఆంధ్రభూమి పత్రికలో తెలుగు పాఠకులందరూ క్రొత్త వార్తాపత్రికలకు పెద్దపీటనేవేశారు అని పదిపదకొండు గంటలకు పాఠకులచేతికి చేరే "వార్త"ని ఉదహరిస్తూ ఒక వ్యాసంరాశారు. చూడబోతే అది ఆంధ్రులకూ, అందునా పత్రికలకూ మాత్రమే పరిమితమయ్యే అంశంకాదని ఇప్పుడు తెలుస్తోంది. ఉన్న వెధవాయిల్లో మెరుగైన వెధవాయిని ఎన్నుకోవడమనే ఎన్నిక్లల క్రీడలో మనదిల్లీలు తొలిసారిగా ఒక prudent & sensitiveని ఎన్నుకున్నారనిపిస్తోంది.

    ఆశపడ్డం తప్పుకాదండీ. ఆ ఆశ ఛావకూడదండీ. ఒకవేళ వీళ్ళు అయోగ్యులేనని భవిష్యత్తు ఋజువుచేసినా (పాపము శమించుగాక) అభ్యుదయోదయంపై మనఆశలు చల్లబడరాదు. ఇది చీపురుకాదు. మనకు జ్ఞానోదయభాగ్యం సాకారమయ్యేంతవరకూ మన దౌర్భాగ్యాంధకారపు చీకటిని పారద్రోలే కాగడా కావాలి. విమర్శకులుకూడా వేనోళ్ళపొగిడిన దిల్లీ సమాజ కులమతరహిత వివేచన మన జాతిలక్షణముగ సాక్షాత్కరించాలి, స్థిరపడాలి. మైనార్టీ-మెజార్టీ మత రాజకీయ పరిష్వంగం నుంచీ బయటపడే తెలివిడి మనకు కలగాలి.

    ReplyDelete
  2. మీరు చెప్పింది నిజమే అండి. కొంచం పాపులర్ బాషలో చెప్పుకోవాలంటే, "పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన" అని, పాతుకుపోయిన అవినీతి చెత్తకుప్పలకు చీపురు విలువ తెలిసే అవకాశం లేదు. సామాన్యుల పార్టీ రాత్రికి రాత్రే అద్భుతాలు చెయ్యదు, కానీ ఈ చెత్తకుప్పల రాజకీయాల మీద ఒక పెద్ద ఫ్లడ్ లైట్ పెట్టడం లో మాత్రం విజయం సాధించింది. ఈ మొత్తం ప్రహసనం లో నాకు బాగా నచ్చింది, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామన్నాక, కేజ్రీవాల్ ఇచ్చిన రెస్పాన్స్. "మీ పాలన మీద మేము దర్యాప్తు చేస్తాం, దానికీ మీరు సప్పోర్ట్ చేస్తారా" అని. ప్రతీ ఎన్నికల తరువాతా, గెలిచిన పార్టీ, ఇది ప్రజల గెలుపు అంటుంది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పుడు మాత్రం, అంటరానితనం అమానుషం అన్న సూత్రాన్ని బాగా పాటిస్తుంది. నిజమైన ప్రజాస్వామ్యం ఎన్నికలలో కాదు, ఎన్నికల తరువాత తేలుతుంది. AAP ఒక కొత్త ఒరవడి ని పరిచయం చేసింది. కమ్యూనిస్ట్ పార్టీల్లా, ప్రతిపక్షాలకే అంకితం అవుతారో, చెప్పింది చేసి చూపిస్తారో, భవిష్యత్ లో తేలుతుంది. కానీ, ధనం, మద్యం లేకుండా, షీలా దీక్షిత్ లాంటి నాయకురాలని ఓడించడం, బహుశా, చరిత్రేనేమో.

    ReplyDelete