Sunday, January 10, 2010

కేక

ప్రస్థుతం ఆంధ్రదేశంలో జరుగుతున్న ఉద్యమ లక్ష్యాలకీ ఈ కాలమ్ కీ ఏ విధమయిన సంబంధం లేదు.
పత్రికల్లో వార్త: ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారు. అందరిమాటా అలావుంచి ముందు రాజకీయ నాయకులు ఆంధోళన వ్యక్తం చేశారు. సామాన్యుడి నడ్డివిరిగిందని తెలుగు దేశం నాయకులు చంద్రబాబు నాయుడుగారు వాపోయారు. వారి పార్టీ అన్ని ఆర్టీసీ డిపోల ముందూ ధర్నా చేస్తోంది, బీజేపీనాయకులు బండారు దత్తాత్రేయగారూ, కిషన్ రెడ్డిగారూ తదితర నాయకులూ ధర్నాలు చేస్తున్నారు. సిపియం నాయకులు రాఘవులుగారు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇవన్నీ ఆయా నాయకుల ప్రజా సంక్షేమ ధృక్పధానికీ, వారి అకుంఠిత దేశ సేవానిరతికీ ప్రత్యక్ష సాక్ష్యాలు. ఆంద్రదేశానికి ఇలాంటి నాయకత్వం ఉండడం ప్రజలు చేసుకున్న పుణ్యం. సందేహం లేదు.
పూర్తిగా చదవండి

7 comments:

  1. నమస్కారం మారుతీరావు గారు. నేను మీ బ్లాగులో వ్యాఖ్య రాస్తున్నాను అనుకుంటుంటే చాలా ఆశ్చర్యంగాను, ఆనందంగాను ఉంది. మీ రచనకు, నటనకు అభిమానిని నేను.

    ReplyDelete
  2. 40 ఏళ్ళ క్రితం ప్రైవేట్ బస్సులు ఎక్కువగా ఉండేవి కదా. అప్పట్లో కూడా RTC బస్సులు తగలబెట్టేవాళ్ళా? 1978కి ముందు వైజాగ్ లో కూడా ప్రైవేట్ బస్సులు తిరిగేవని మా అమ్మగారు చెప్పారు.

    ReplyDelete
  3. మారుతీరావు గారికి నమస్కారం మిమ్మల్ని ఇలా బ్లాగు లోకంలో చూడడం ఆనందంగా ఉంది. మీ కాలమ్స్,మీ నటన అలరిస్తాయి.
    అభిమానంతో.

    ReplyDelete
  4. i
    nice point.idont remember a single arson in those days on private buses

    ReplyDelete
  5. గొల్లపూడి గారికి నమస్కారం,
    మీరు రాసిన మొదటి వరుస లోనే సమాధానం ఉంది. కరక్టే, నేటి ఉధ్యమాలకి బస్సుల్ని తగలబెట్ట టానీకీ సంబంధం లేదు. కానీ ఒక గుణపాఠం ప్రజలలో మార్పు రావచ్చు, ఇందుకు ఉధాహరణగా నా చిన్నతనం లో జరిగిన ఒక సంఘటన చెపుతాను. నాకు సరిగ్గా 10 సం|| లు అప్పుడు రంగాని ఎవరో హతమార్చారు, అప్పుడు విజయవాడ అగ్నిగుండంగా మారింది. యధాః విధిగానే బస్సుల్ని తగల పెట్టేశారు, ఆది శీతాకాలం విజయవాడ డిపో మానేజరు ఒక్క డ్రైవర్ అద్ధం మినహా అన్ని అద్ధాల్ని తీసేసి నడిపించారు ఒక నేలపాటు అనుకుంటా. ప్రజల చలి ఇక్కట్ల గురించి అడిగితే సమాధానం: బస్సుల్ని తగలబెట్టిన వారిలో మీ అన్నధమ్ములు లేరా అని ఆ ఫలితం ఇంటిల్లపాది అనుభవించాలి అని.
    నేటి పరిస్థితులకి ఇది కూడా ఒక విధంగా ఆచరణణీయమైన సూత్రం, మరి ఆచరణలో పెట్టే సత్తా ఎవరికి ఉంది?

    ReplyDelete
  6. మారుతీరావుగారికి నమస్కారాలతో,
    మీ బ్లాగ్ ఈ రోజే మొదటి సారి చూశాను. మీలాంటి మంచి నటుడిని, గొప్ప రచయితను ఇలా బ్లాగ్ముఖతా పలుకరించడం చాలా సంతోషంగా ఉంది . ఇక మీ "కేక" పోస్ట్ లో చెప్పిన "బాలగంగాధర తిలక్" లు ఇప్పటికీ అలాగే ఇంకా చెప్పాలంటే కుసింత ఎదిగారు కూడా :(. నలభై ఏళ్ళనాటి పరిస్థితులు ఇప్పటికీ అలానే ఉండటం చూస్తే ఏం ప్రగతి సాధించాం మనం అనిపిస్తోంది నాకు. మంచి పోస్ట్ చదివాను ఈరోజు. మీకు నా ధన్యవాదాలు.

    అలానే కాస్త వీలు చూసుకుని నా బ్లాగ్ ను సందర్శించి మీ అమూల్యమయిన అభిప్రాయాలు, ఆశీర్వాదాలు అందించమని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నా ఆహ్వానాన్ని వీలయినంత త్వరలో మన్నించగలరని ఆశిస్తున్నాను. నా బ్లాగ్ చిరునామా www.blogavadgeetha.blogspot.com

    ఇట్లు
    భవదీయుడు
    శ్రీనివాస ఉమాశంకర్ సరస్వతుల

    ReplyDelete
  7. గొల్లపూడిగారూ. ఈ బస్సులు తగలపెట్టటం వంటివి జరగటానికి ప్రభుత్వంలో ఉండేవారు కూడ కొంత కారణం. వీళ్ళందరూ సామాన్యంగా గాంధీ పేరు చెప్పుకుని, ఆయన ఎప్పుడూ పెట్టని టోపీలు పెట్టుకుని అధికారంలోకి వచ్చినవారే కదా. కాని గాంధీ గారు చూపించిన నిరసన మార్గం "సత్యాగ్రహం" చేస్తే , ఎన్నాళ్ళు చేసినా వీళ్ళు పట్టించుకోరే. అదే ఒక్క బందు చేసి, ఒక ఇరవై బస్సు తగలేస్తే వెంటనే కమిటీలు, హోం మంత్రి ప్రకటనలు, అది విని ఇంకో ప్రాతంలో మళ్ళి బస్సులు కాలిస్తే మరొక సవరణ ప్రకటన. దీనివల్ల సామాన్య ప్రజలకు వెళ్ళే సూచన ఏమిటి?? మీ గోల మాకు వినపడాలంటే ఎన్నీ వెధవ పనులు చేసి మీడియాలో కనపడితే అంత తొందరగా మేము స్పందిస్తాం, ఉట్టి సత్యా గ్రహం అయితే మాకు వినపడదు, కనపడదు అనే కదా. సత్యాగ్రహం చేస్తే టి.వి కాదుకదా కోర్టు సమన్లు మాత్రమే వేసుకుని బతికే ఒక్క పేజీ వార్తా పత్రిక (!!) కూడ ఆ వార్త వెయ్యదు.

    పరిపాలనా సామర్ధ్యంలో మూడు రకాలు
    1. సమస్య వచ్చిందని తెలియక అదేమిటో అర్ధంకాక అదస్సలు అక్కడలేదని నటిస్తూ అది ఇంకా పెద్దది అయ్యేవరకూ ఊరుకుని, ఆ తరువాత ఆ సమస్యను ఏమి చెయ్యాలో తెలియక కొట్టుకునే పరిపాలకులు అధములు.
    2. వాళ్ళు చేసే పనులవల్ల సమస్యలు వస్తున్నాయని తెలుసు. లేదా ఒక సమస్య కాల వశాన వస్తున్నట్టు తెలుసు. కాని అది పెరిగి పెద్దదయ్యి అందరి కంటా పడేవరకూ ఆ సమస్య నియంత్రించకుండా, పరిష్కరించకుండా ఊరుకుని, నలుగురూ గమనించింతరువాత పెద్ద సామర్ధ్యమున్నట్టుగా, ఆ సమస్యను పరిష్కరించే పరిపాలకులు. వీరు మధ్య రకం.
    3. పరిపాలనలో నిర్ణయాలు తీసుకునే సమయంలోనే అన్ని కోణాలు పరిశీలించి, సమస్య రావటానికి ఆస్కారం లేకుండా చూస్తూ, ఏదైనా ప్రాంతాల్లో సమస్య వచ్చే అవకాశం ఉన్నాట్టుగా గమనించగానే, ఆ సమస్య పుట్టకముందే మందు వేయగల పరిపాలకులు ఉత్తమ పరిపాలకులు.

    మనకు ఈ మూడవ రకం పరిపాలకులు ఇంతవరకు లేరు. వీటి కారణమే ఈ రకరకా ఉత్పాతాలు, మన ఆస్తులను మనమే తగుల పెట్టుకోవటాలు.

    పైన ఒకాయన ఇదివరలో ప్రభుత్వ బస్సులు ఉండేవిట కాదుకదా, ప్రవైటు బస్సులను కూడ తగులబెట్టేవారా అని ఒక సందేహం వెలిబుచ్చారు. నాకు గుర్తు ఉన్నంతవరకు, 1972-73 ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ప్రవైటు వాహనాలను ముట్టుకోలేదు, గవర్నమెంటు జీపులు తగులబెట్టారు. అవేవో మనవి కాదన్నట్టుగా!!

    ReplyDelete