మన దేశంలో అవినీతి అద్భుతమైన పరిణామం చెంది అపూర్వమయిన కళగా స్థిరపడినట్టు మరే దేశంలోనూ లేదు. నిజానికి దొంగతనం కూడా మన పెద్దలు అంగీకరించిన 64 కళలలో ఒకటి.
అది పాతకాలం మాట.ఈ రోజుల్లో అవినీతి అనలేని, అనకుండా ఉండనూలేని ఎన్నో రకాలయిన కొత్త కొత్త అవినీతులు వచ్చాయి. వాటికిశిక్షలు ఉండవు. జవాబుదారీ ఉండదు. చెల్లుబాటవుతుంది. అవినీతి పరుడికి మేలు జరుగుంది. నీతినిద్రపోతుంది. కాని ఎవరూ ఏమీ చెయ్యలేరు.
పూర్తిగా చదవండి
Monday, January 4, 2010
Subscribe to:
Post Comments (Atom)
>>రకాలయిన కొత్త కొత్త అవినీతులు వచ్చాయి. వాటికిశిక్షలు ఉండవు. జవాబుదారీ ఉండదు. చెల్లుబాటవుతుంది. అవినీతి పరుడికి మేలు జరుగుంది. నీతినిద్రపోతుంది. కాని ఎవరూ ఏమీ చెయ్యలేరు.<<
ReplyDeleteThat's Not True, GOD IS THERE.
అవినీతికి కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది లంచాలు ఇచ్చేవాడే. వీడికి ఎంత ఉపయోగం లేకపోతే అంతంత లంచాలు ఇస్తాడు. సమాజంలో ఇప్పుడు ప్రతివాడూ అవినీతి గురించి నీతులు వల్లించేవారే. కాని, , ఎంతమంది, నిబంధనల ప్రకారo వాళ్ళ వాళ్ళ డ్రైవింగు లైసెన్సు తీసుకున్నారు. ఇళ్ళు కట్టుకునేప్పుడు, ఎంతమంది పూర్తిగా నిబంధనలను అనుసరించి కట్టుకుంటున్నారు. ఎంతమంది అసలు అనుమతి తీసుకుని కట్టుకుంటున్నారు. మనకు వెను వెంటనే పనులు అయిపోవాలి, నిబంధనల ప్రకారం పనులుచేసుకునే ఓపిక ఆ నిబంధనల మీద గౌరవం మనకు లేదు. ఒక వేళ ఆనిబంధనలు అసంబధ్ధంగా ఉన్నాయనుకున్నాపుడు, ఏనాడన్నా ఎవరన్నా వాటిగురించి అభ్యంతరం చెప్తారా? లేనేలేదు. మన లెజిస్లేటర్లు అలా చట్టాలను చేసిపారేస్తూ ఉంటారు. ఆ లెజిస్లేటర్లను ఎన్నుకోవటానికి ఓటు వెయ్యటానికే మనకు టైము లేదు, ఓపిక లేదు, ఓటు వెయ్యలేదని గొప్పగా చెప్పుకోవటమే ఫ్యాషన్.
ReplyDeleteఅలెగ్జాండరు సోలెజెత్సియాన్, ఒక సందర్భంగా ఇలా అన్నాడు, "మనం పొరబాట్లు చేస్తున్నది, మనకి తెలియక కాదు, అలా చెయ్యటం సౌకర్యంగా ఉండటం" వల్ల అని, ఇది మనకు పూర్తిగా వర్తిస్తుంది.
కూతురికి పెళ్ళి చెయ్యాల్సి వచ్చినప్పుడు, ఒక పట్టభద్ర యువకుడు, జనాభా లెక్కల ఆఫీసులో యు డి శి గా పనిచేసేవాడు ఒకడు, పదో క్లాసు ప్యాసయ్యి, చెక్‌పోస్టులో ప్యూనుగా పనిచేసే కుర్రాడు సంబంధాలు వచ్చాయనుకుందాము. ఎవరికిచ్చి చేస్తారు? తప్పనిసరిగా పదోక్లాసు చదివి ప్యూను ఉద్యోగం చేసేవాడికే!! కారణం వాడు రెండుచేతులా, సంపాయిస్తాడు, అమ్మాయి సుఖపడుతుంది, జనాభా లెక్కల ఆఫీసులో ఏముంది నా బొంద! ఇదీ ఒక సగటుమనిషి అలోచన. ఎవరిగురుంచో ఎందుకు, ఎవరికి వారు వారి బంధువులలో ఉన్న అవినీతి పరులైన అధికారులు ఉండేఉంటారు. వాడు (చేసేది గుమాస్తా లేకపోతే సెక్షన్ అఫీసరు ఉద్యోగం) కట్టిన మూడో అంతస్తుకి గృహప్రవేశానికి వెళ్ళి ఆనందిస్తారుకాని, వీడేమిటి ఎలా సంపాయించాడు అని నిలదీస్తారా (ఏదో అప్పుడప్పుడు అసూయ పెల్లుబికినప్పుడు అక్కసుతో వాడిని ఆడిపోసుకోవటాం తప్ప).
అవినీతి పూర్తి జనాభాలో ఉన్నది. మనకు అవసరమైనప్పుడు అది అవినీతి కాదు. మరెవడో చేస్తుంటే అది అవినీతి. మీరు చెప్పినది సరిగ్గా చెప్పారు "ఈ దేశంలో చెల్లిపోయే అవినీతి, చెల్లించుకునే అవినీతి, నిరూపించలేని అవినీతి, నిస్సహాయంగా తలవొంచాల్సిన అవినీతి, నిలదొక్కుకున్న అవినీతి, నిలదీసే అవినీతి, పబ్బం గడుపుకునే అవినీతి-ఇలా కోకొల్లలు ఉన్నాయి. నిజానికి ఒకే ముఖం. అబద్దానికి అరవై ముఖాలు"
అవును "చికిత్స మరెక్కడో ప్రారంభం కావాలి" నిజమే. ఎక్కడనుంచి?? సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళనుంచి. ప్రతి ఒక్కరూ, మనకున్న నిబంధనల ప్రకారం నడుచుకుందాము, నిబంధనల ప్రకారం కట్టవలసినవి కట్టేద్దం అనుకుంటే 80 శాతం అవినీతి పోతుంది. మిగిలినది, సరైన పోషణ లేక కాలక్రమేణా నశిస్తుంది. ఏవైనా నిమభంధనలు దుర్మర్గంగా ఉన్నాయని, అసంబధ్ధంగా ఉన్నాయని అనుకున్నప్పుడు, నలుగురిని కూడతీసుకుని వాటి సవరించే/తీసేసే వరకు ఒక పధ్ధతి ప్రకారం కృషి చెయ్యగలిగే ఓపిక, సమయం మన దగ్గర ఉన్నప్పుడు, అవినీతికి అవకాశం ఉన్న నిబంధనలను తగ్గించవచ్చు. అసలు, కీలకం 100 శాతం ఓటింగు చెయ్యటం. అది సాధిస్తే అవినీతి పిశాచి ఢడుచుకుంటుంది.
ఈ వలలో దొరికే చేప, నిజాయితీగా బతికే కొనుగోలుదారుడు.
ReplyDeleteఅవును కొనుగోలు దారుడు లేందే ప్రపంచం నడవదు.కొనుగోలుదారుడే రారాజు. ( మా కస్టమర్ దేవుళ్ళకి పండుగ ఆఫర్లతో స్వాగతం అంటూ ప్రకటనలు వేస్తారు.)
కానీ ఒకసారి వస్తువు కొనేవరకే ఆ రాచమర్యాద. ఆ తర్వాత చూడండి... కొనుగోలుదారుడి పరిస్థితి.
కారడివిలో క్రూరమృగం నీతి.
వీళ్ళని బాగు చెయ్యటం ( దొంగలు, దొరలూ ఇద్దర్నీ) ఆ దేవుడి వల్ల కూడా కాదేమో !
మీమీద జరిమానా వెయ్యక తప్పదు. ఈమాటు టీవీ కావాలంటే నాకు చెప్పండి. మేం పట్టుకున్న సరకుల్ని మీకు అమ్ముతాం'' అన్నాడు ఆ అధికారి.
ఇలా ఆత్మసాక్షిలేని ఉద్యోగాలు చేసే కంటే భిక్షాటన నయమేమో కద సర్ ! .... మీ బోటి వారే ఇంత ఇబ్బంది పడితే ఇక అమాయకులు, సామాన్యుల పరిస్థితేమిటో....
నేనెంత గానో అభిమానించే ఓ గొప్పనటుడు, రచయిత తో ఇలా నేరుగా నా భావాలు పంచుకోగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
నమస్కారములతో !
తెలుగుకళ - పద్మకళ
http://telugukala.blogspot.com