Monday, June 21, 2010

ప్రపంచ సమరం

1994 జులై 2. ప్రపంచ బంతి ఆట పోటీలలో కొలబియా ఆటగాడు ఆంద్రీ ఎస్కాబార్ తన దేశం తరపున ఆడుతూ, ఆటలో పొరపాటున తన దేశానికే గోల్ చేసుకున్నాడు. ఆట మీద కొన్ని కోట్ల పందాలు నడిచాయి. ఊహించని నష్టాలతో లోపయకారీ వ్యాపారులంతా ఉక్కిరిబిక్కిరయారు. హాంబర్ట్ కాస్త్రో మురోజ్ అనే అభిమాని - దక్షిణ అమెరికా రన్నింగ్ కామెంటరీ చెప్పేవాళ్ళు అరిచినట్టు 'గో....ల్’ అని అరుస్తూ పన్నెండు బులెట్లు ఎస్కాబార్ మీద పేల్చాడు. ప్రపంచం షాక్ అయిపోయింది. లక్షా ఇరవై వేలమంది అతని అంత్యక్రియలకి హాజరయారు. కొలంబియాలో ఎస్కాబార్ శిలావిగ్రహాన్ని ప్రతిష్టించారు.
పూర్తిగా చదవండి

1 comment:

  1. విలువయిన సమాచారంతో కూడిన అద్భుతమయిన వివరణకి ఈ టపా ప్రత్యక్ష సాక్ష్యం. మీలో ఉన్న విద్వత్తుకు నమస్సులు.

    ReplyDelete