Sunday, September 5, 2010

సహజీవనం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి ఒక క్రిమినల్ కేసులో శిక్షవేసింది న్యాయస్థానం. పార్టీ వర్గాలు శివమెత్తారు. ఊళ్ళనిఅల్లకల్లోలం చేశారు. 2000 ఫిబ్రవరి 2 తేదీన ధర్మపురిలో కొందరు నాయక భక్తులు - కోయంబత్తూరు వ్యవసాయవిశ్వవిద్యాలయం బస్సుకి నిప్పంటించారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు - 44 మంది ఉన్నారు. కాలుతున్న మంటల్లోంచిబయటపడలేక ముగ్గురమ్మాయిలు - కోకిలావని, గాయత్రి, హేమలత అక్కడికక్కడే కాలి బూడిదయిపోయారు. ఇందుకుకారణమయిన ముగ్గురు స్వామి భక్తులు నెడుం చెళియన్, రవీంద్రన్, మునియప్పన్ అరెస్టయారు. విచారణలు జరిగాక - సేలంకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ అన్ని కోర్టులూ వీరికి మరణ శిక్షను ఏకగ్రీవంగా అంగీకరించాయి. మొన్ననే సుప్రీం కోర్టు శిక్షనుఖరారు చేసింది - పదేళ్ళ తర్వాత.
పూర్తిగా చదవండి

3 comments:

 1. ఇంకా కొద్దిపాటి పచ్చదనం వున్నది అన్న విషయం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.

  ReplyDelete
 2. గొల్లపూడి గారికి నమస్సుమాంజలి.
  నేను ప్రతి సోమవారం ఉదయాన్నే చేసే పనులలో మీరు బ్లాగ్ లో వ్రాసిన వ్యాసం చదవటం ముఖ్యమైనది. మీరు వ్రాసిన "సహజీవనం" వ్యాసం చదివాక, న్యాయం కోసం ఎన్నో ఏళ్ళు పోరాడి, నిరీక్షించి చివరకు గెలిచిన వీరాస్వామి లాంటి వారినుంచి ఎంతో నేర్చుకోవాలని అనిపిస్తుంది. మీకు సేవ చేస్తాను అని బాస చేయటం ఒక భీషణ ప్రతిజ్ఞలాంటిది. అలా బాస చేసిన రాజకీయ నాయకులు వివిధ రకాలైన కేసులలో శిక్షించబడటం సిగ్గుచేటు. దానికి వారి అనుచరులు తోటి పౌరుల ప్రాణాల్ని బలిగొనటం క్షమించరాని నేరం మరియు బహు విచారకరం. ఇలాంటి అనుచరగణం చేసిన మారణహోమాన్ని ఎదిరించి , వ్యవస్థ తోడ్పాటు కొంత వరకే వున్నా, చివరి వరకూ పోరాడిన వీరాస్వామి మనోధైర్యం ప్రతి ఒక్కరికీ ఒక పాఠం లాంటిది. అదే విధంగా, ఒక ముస్లిం గృహిణి తన పిల్లవానికి, హిందూ పేరు పెట్టటంతో పాటు, కృష్ణునిలాగా, వేషధారణ వేయటం, పరమత సహనం, మంచి ఎక్కడున్నా స్వీకరించటంలాంటి గొప్ప సుగుణాలను ప్రతి ఒక్కరూ అలవార్చుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ఇలాంటి విషయంఫై వ్రాసిన మీ వ్యాసం అభినందనీయం. మరొక్కసారి మీకు ధన్యవాదములు.

  ReplyDelete
 3. I saw the picture and news article of 'krishnaashtami' in a telugu newspaper but I don't think they published the boy's name. You might have casually mentioned 'sree krishna khan'. I was actually happy to see the picture but at the same time afraid if there would be a threat to the boy and his mother.

  ReplyDelete