ఈ దేశానికి మహాత్ముడు సత్యాగ్రమనే ఆయుధాన్నిచ్చి నిన్నటికి సరిగ్గా 104 సంవత్సరాలయింది. ఎవరీ మహత్ముడు? ఏమిటీ సత్యాగ్రహం?
ఈ దేశంలో పదిమందిని - చాలామంది నాయకులతో సహా - ఈ ప్రశ్న వేస్తే చాలా విచిత్రమైన సమాధానాలొస్తాయి. ఆ మధ్య ఓ టీవీ ఛానల్ మన జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? అని కొందరు నాయకుల్ని ప్రశ్నలు వేసింది. చాలామంది నాయకులు తెల్లమొహం వేశారు. ఎక్కువ మంది వెర్రితలలు వేశారు. కొందరు నిస్సహాయంగా తలలూపారు. గాంధీజీకి కూడా అలాంటి గతిపట్టే రోజులు దగ్గరికి వచ్చాయేమో!
పూర్తిగా చదవండి
Monday, September 13, 2010
Subscribe to:
Post Comments (Atom)
Dear sri rao-
ReplyDeletesathyaagraha of Gandhi is the last weapon in the struggle for india starting from 18th century with initial violent standard measures of war. When every thing exhausted, then the new idea of Gandhi, which you can call new weapon- for which the opponent does not have clue- has o recourse, so it succeeded. Having known this weapon now, it will not work again unless it comes at times of crises. I think after independence, india has not come to that brink of crisis. Else all that corruption etc, which face the indian continent can probably go off with this weapon itself.
2. It has given insigints to the leaders of other countries and it worked in their countries again for the same reason I think. Having said that, the countries where it won over also have the teething troubles what we have.
3. Probably, a Gandhi when reborn may think as a last throw of this feat again twice before using that strategy
cheers
zilebi.
http://www.varudhini.tk
గాంధీ గారి మార్గము సత్యాగ్రహమే కానీ, ఆయుధము కాదు. ఆయన ఆయుధము ఆయన వెనక నడిచిన మహా జన సముద్రము. ఆయన నాయకత్వ ప్రతిభ. నిజమైన నాయకత్వ ప్రతిభ ఉన్న ప్రతీవాళ్ళూ ఇంతో అంతో ప్రభావము చూపగలరు, వారి వారి పరిధి లో. గాంధీ గారి విషయములో మొత్తము దేశ ప్రజలు ఆయన వెనక నడిచారు. అదే పాలకులని భయపెట్టిన ఆయుధము. ఇవాళ కూడా తెలంగాణా వేర్పాటు వాదుల హింసాత్మక ధోరణి కంటే, ఆ జన సందోహమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆలోచింప చేస్తోంది అని నా భావన
ReplyDeleteఇప్పుడు ఉన్న నాయక గణానికి పదవుల మీద ఉన్న శ్రద్ధ దేశ భవిత మీద లేకపోవడము మన ఖర్మ. గంగి గోవు పాల లాగ కొందరు ఉండబట్టే ఈ పాటిగా నైనా దేశము ముందుకు పోతోంది. అలా ఎన్న దగ్గ వారు ఏ సమస్యని పరిష్కరించ పూనుకున్నా అది సాధ్యపడుతుంది. అంతే కాని, నిరాహార దీక్ష చేసిన ప్రతీ వాడూ పొట్టి శ్రీరాములు గారు కాలేడు. మెర మెచ్చులకి అహింసో పరమో ధర్మః అన్న వాడు గాంధీ కాలేడు.
భవదీయుడు
సీతారామం
సీతారామంగారూ
ReplyDeleteసరదాగా రాస్తున్నాను. కత్తి పట్టుకున్న యోధుడి కంటే కత్తిదే గొప్పతనమంటారు మీరు. ఆలాగే కానివ్వండి. కాని దేశంలో వ్యర్ధంగా ఎందరు ఎన్ని కత్తులు దూస్తున్నారో నమూనాగా ఒక్క జగన్ ఓదార్పు యాత్ర చాలు. చేతిలో ఉన్నది కత్తి కనుక, దానిని విచక్శణతో ఉపయోగించే నాయకునిదే ముఖ్య పాత్ర. మీరు చేస్తున్నది అర్గ్యుమెంటు. నేను చేసింది సమన్వయం.
గొల్లపూడి మారుతీ రావు
గొల్లపూడి గారికి నమస్సుమాంజలి.
ReplyDeleteమీరు సత్యాగ్రహం ఫై వ్రాసిన ఈ వారం వ్యాసం చాలా బాగుంది. అహింస, సత్యాగ్రహాలను ఆయుధాలుగా వాడి మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీని ఎరిగిన వారు ఇంకా మన దేశంలో ఉన్నారు. అలాంటి వారికి నేడు మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, దేశంలో కూడా కొన్ని వర్గాలు తమ డిమాండ్స్ నేరవేర్చుకోవటం కోసం చేస్తున్న మారణహోమం బాధ కలిగిస్తుంది. ఇలాంటి విషయంఫై వ్రాసిన మీ వ్యాసం అభినందనీయం. మీలాంటి వారు కనీసం మూడు తరాల వారిని చూసి ఉంటారు, మన దేశ సామాజిక, రాజకీయ స్థితిగతులను గమనించి ఉంటారు. మీరు నేడు రావణకాష్టంలా మండుతున్న ఆంధ్రప్రదేశ్ వంటి విషయంఫై ఒక సారి దృష్టి సారిస్తే బాగుంటుందని మనవి. ఈ రోజుల్లో కూడా, ప్రతిభకు పట్టం కట్టనీయకుండా, ఇంకా రిజర్వేషన్స్ అంటూ, నిన్నటికి నిన్న, హై కోర్ట్ న్యాయమూర్తులఫై జులుం ప్రదర్శించి, భీతవహుల్ని చేసినదేవరో కాదు, రోజూ అక్కడే వాదనలు వినిపించే న్యాయవాదులే . ఇలాంటి వాటిని చూస్తే, నిజంగా భవిష్యత్ ఫై ఎంతో భయం కలుగుతుంది. నేడు జరుగుతున్న బంద్ లు, నిరసనల్లో, ఎంతో మది అమాయక విద్యార్ధుల జీవితాలు సమిధలవుతున్నాయి. వీటిలో ఎంత వరకూ నిజం వున్నది అనేటువంటి దానిని విద్యార్ధులు పట్టించుకోవటం లేదు. ఇంకా మనం అనాగారీకుల్లాగా ఉండటం బహు బాధాకరం. జ్ఞాన సంపన్నులయిన మీరు ఇలాంటి విషయం ఫై ఒక వ్యాసం వ్రాయాలని మనవి. మరొక్కసారి మీకు ధన్యవాదములు.