Sunday, June 26, 2011

ఆసుపత్రికి తోవ ఎటు?

ఈ మధ్య టీవీలో ఒక ఆలోచనాభరితమైన చర్చని చూశాను.
మందు ఆ చర్చకి ప్రాతిపదిక. మహారాష్ర్ట ప్రభుత్వం పిల్లలు మద్యం తాగే వయస్సుని 21 నుంచి 25కి పెంచారు. అమితాబ్ బచ్చన్ గారికి కోపం వచ్చింది. అలా పెంచడం అన్యాయమని ఆయన వాపోయారు. ఈ టీవీ చర్చ ముఖ్యోద్దేశం ఏమిటంటే - అలా పెంచడం ద్వారా పిల్లలు తమకేం కావాలో నిర్ణయించుకునే హక్కుని కోల్పోతున్నారని పెద్దలు కొందరు వాక్రుచ్చారు. పెద్దల బుద్దులు ఎలా వెర్రితలలు వేస్తున్నాయో మనం అనునిత్యం చూసి ఆనందిస్తున్నాం. జైల్లోనే డాక్టర్ సచాన్ హత్య, బీహార్ లో ధర్నా చేస్తున్న రైతును తొక్కి చంపిన పోలీసుల వీరంగం, కోట్ల ధనం దోపిడీ- ఇవన్నీ మనం రోజూ చూసే సుందర దృశ్యాలు. పాతికేళ్ళ లోపునే మందు తాగే విచక్షణ యువకులకు ఉన్నదని వీరి వాదన. టీవీలో ఈ చర్చ వీలయినంత అసహ్యంగా, అసందర్భంగా, ఆలోచనారహితంగా కనిపించింది నాకు.
పూర్తిగా చదవండి

Monday, June 20, 2011

పుణ్య దొంగలు

'దొంగలందు మంచి దొంగలు వేరయా ' అన్నారు పెద్దలు. ఒకాయనకి తరుచుగా ఫోన్ కాల్స్ వచ్చేవి. అటు పక్క పెద్దమనిషి 'నమో వెంకటేశ!' అని మొదలెట్టి "బాబూ! తిరుమల తిరుపతి దేవస్థానం ఫోన్ నంబరు చెప్పగలరా!?" అని అడిగాడు. అటువంటి భక్తుడు అడిగితే కాదనలేక తెలుసుకుని మరీ చెప్పాడీయన. రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆ భక్తుడే ఫోన్ చేసి 'జై శ్రీరాం!' అంటూ బిర్లామందిర్ నంబరు అడిగాడు.
పూర్తిగా చదవండి

Monday, June 13, 2011

వయస్సుని జయించినవాళ్ళు

ఉదయం పార్కులో నడిచే మిత్రులలో నోరి రామకృష్ణయ్యగారొకరు. ఆయన వయస్సు 82. ఆ మధ్య హిందీ ప్రచార సభ స్నాతకోత్సవాన్ని చూశారు. అక్కినేని ముఖ్య అతిధి. పట్టభద్రులందరికీ ముతక ఖద్దరు శాలువాలు కప్పారట. శాలువాకి నాలుగు అంచుల్లో మూడు హృదయాలు (ఆటీన్లు) ముద్రలుంటాయి. "ఏక్ రాష్ర్ట భాషా హిందీ హో, ఏక్ హృదయ్ హో భారత జననీ" (హిందీ రాష్ర్ట భాష, భారతమాత హృదయం) అని రాసి ఉంటుంది. ఆ శాలువా కొనుక్కోవాలని హిందీ ప్రచార సభకి వెళ్ళారు
పూర్తిగా చదవండి

Wednesday, June 8, 2011

బ్రహ్మముహూర్తం

"చెడు స్నేహాలు అనర్ధదాయకం.." అన్నారు కరుణానిధిగారు తన పుట్టినరోజునాడు. ఇన్నాళ్ళకి - 88 వ ఏట - వారికి జ్ఞ్నానోదయమైంది. 'మంచి ' కోణం నుంచి చూడగలిగే మరో మహానుభావుడు - ఆదిశంకరులు - మంచి స్నేహాలు మిమ్మల్ని జీవన్ముక్తుల్ని చేస్తాయి - అన్నారు. సజ్జన సాంగత్యం జీవన్ముక్తి హేతువు అంటూ.
పూర్తిగా చదవండి

Monday, June 6, 2011

కల్మాడీకి బోరుకొడుతోంది

నన్నెవరయినా "మీరేం చేస్తూంటారు?" అనడిగితే - " వెధవ్వేషాలు వేస్తూంటాను - సినిమాల్లో" అంటూంటాను. మరోసారి "ముఖాన్ని అమ్ముకుని బతుకుతూంటాను" అంటాను. నేనే వేషం వేసినా, మిత్రులు రావుగోపాలరావుగారూ నేనూ షూటింగులలో కలవక పోయినా 'క్లైమాక్స్ లో కలుస్తాం లెండి ' అనుకునేవాళ్ళం. ఎందుకంటే తప్పనిసరిగా క్లైమాక్స్లో మా ఇద్దరినీ శిక్షిస్తే కాని కథ పూర్తికాదు. ఇద్దరం కనీసం రెండు రోజులయినా కోర్టు బోనులో నిలబడేవాళ్ళం. హీరో మమ్మల్ని దుయ్యబడతాడు.
పూర్తిగా చదవండి