Sunday, October 2, 2011

చట్టానికి గాజులు

మన రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ రాక్షస ప్రవృత్తి గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటాం. ఇప్పటికీ ఆ పీడకల నుంచి తేరుకోలేని దేశాలు, వ్యవస్థలు, కుటుంబాలూ, వ్యక్తులూ ఉన్నారు. ఈ పీడకలలను తమ కథల్లో, నవలల్లో, సినిమాల్లో ఇప్పటికీ తల్చుకు దు:ఖిస్తున్న సందర్భాలున్నాయి. మానవాళి చరిత్రలో అది మాయని, మానని గాయం. అంతకన్న పైశాచికమైన 'ఇండియా' మార్కు దౌర్భాగ్యమిది.
పూర్తిగా చదవండి

3 comments:

  1. చట్టానికి గాజులు ... !! ??
    వాచాతి ఆదివాసీ మహిళల పై జరిగిన దారుణం చదువుతుంటే గుండె రగిలిపోయింది.
    వాళ్ళ మీద దుర్మార్గులు భౌతిక అత్యాచారం చేస్తే మన న్యాయ వ్యవస్థ మానసిక అత్యాచారం చేసింది.
    జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినేడ్ అని చిలకపలుకులు వల్లించడమే కానీ
    న్యాయ వ్యవస్తను సంస్కరించేందుకు ప్రయత్నాలేమీ జరుగకపోవడం దారుణం.
    ఇక ఒక విమర్శ ...
    మీరు ఈ ఉదంతానికి పెట్టిన శీర్షిక >> చట్టానికి గాజులు << సమజసం గా లేదు.
    స్త్రీలంటే ఏమాత్రం గౌరవం లేని, నీతినియమాలు, మానవత్వం లేని దుర్మార్గులే వాచాతి మహిళల మీద అత్యాచారాలకు పాల్పడ్డారు.
    మరి మీ సంగతి...
    మీకు తెలియకుండానే మీలోకూడా స్త్రీలంటే చులకన భావం వుంది.
    పురుషాధిక్య భావ జాలం వల్లే మీరు ఇట్లాంటి శీర్షికను పెట్టారు అనిపిస్తోంది.
    దయచేసి ఆ లోపాన్ని సరిదిద్దుకోండి.
    ఒక అన్యాయాన్ని మీవంతు కృషిగా ప్రపంచం దృష్టికి తెచ్చినందుకు మీకు అభినందనలు.

    ReplyDelete
  2. మాక్సిస్టుల కృషి ప్రశంసనీయము. మావోఇస్టులు ఆ తక్కిన 199మందికి ప్రజాకోర్టులలో న్యాయం ఎందుకు చేయలేదన్నది నా ప్రశ్న, రైళ్ళు, బస్సులు కాల్చడం, బ్రిడ్జ్‌లు పేల్చడంలో వున్నత ఉత్సాహం ఇలాంటి విషయాల్లో ఎందుకుండదు?

    266 మందికి సామూహిక శిక్ష అర్థంలేని న్యాయం అనిపిస్తోంది. అంటే వీళ్ళలో తీవ్రమైన నేరం చేసిన వాళ్ళను గుర్తించి శిక్షించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందనే అనిపిస్తోంది.

    ReplyDelete
  3. అమానుషమైన ఈ సంఘటన జరిగిన ఇన్ని సంవత్సరాలకి శిక్ష పడటం అన్నది మనం చేసుకున్న దౌర్భాగ్యం. ఆనాడే ఆ స్త్రీలంతా తమని బలాత్కరించిన వారిని ఊచకోత కోయాల్సింది అనిపించిది చదువుతూంటే. బలహీనులు బలవంతుల చేతిలో ఇలా ఎప్పటికీ బాధలు పడవలసిన్దేనా? ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎ స్థితిలో వున్నా సరే స్త్రీకి ఈ బాధలు తప్పవా? తప్పే మార్గమే లేదే.

    ReplyDelete