ఇది అపర ప్రహ్లాదుల కాలం. దేశాన్ని పాలించే రాజునీ, రాజు ఆలోచనల్నీ, పాలక వ్యవస్థనీ, పాలన సరళినీ నిలదీసి, ఎదిరించి, ఎదిరించడం తమ హక్కుగా బోరవిరుచుకుని, అవసరమయితే వీధినపెట్టే అద్భుతమైన రోజులు వచ్చాయి. అన్నా హజారే పాలక వ్యస్థని ఎదిరిస్తున్న పెద్దమనిషి. పెద్దమనిషి. ఈ దేశ చరిత్రలో పాలక వ్యవస్థకి వోటు వెయ్యవద్దని ఎన్నికల్లో ప్రచారం చేసిన స్వచ్ఛంద సంస్థ -పోనీ, ఉద్యమం ఆయనది. ఇది విడ్డూరం. ఇందులో ఒకనీతి ఉంది
పూర్తిగా చదవండి
Monday, October 17, 2011
Subscribe to:
Post Comments (Atom)
Sir,
ReplyDeleteThe play 'Enemy of the People' seems to be written by Henrik Ibsen (and not George Bernard Shaw, as your essay seems to suggest)
http://en.wikipedia.org/wiki/An_Enemy_of_the_People
మిశ్రమ ప్రభుత్వాలంటే, సదసత్ప్రవర్తనుల (అవాంఛనీయ) కూటముల ప్రభుత్వాలు ప్రస్తుతం. గమనించే ఉంటారు. తన తలపాగాకున్న విలువకూడా తనకు యెవరూ యివ్వకపోయినా ఠీవి నటిస్తూ తెర వెనక అసలు దేశాధికారిణికి పెత్తనం వదిలేసి నిత్యం దేశాలు పట్టుకు తిరిగే ప్రధానీ, తనకే మాత్రం విలువను అటు కేంద్రమూ, యిటు అధికార ప్రతిపక్షాలూ మాత్రమే కాక జనం గూడా యివ్వక పోయినా ముఖ్యమంత్రిననుకుంటూ తిరిగే మరో సింహాసనాలంకారుడూ ఉన్న వ్యవస్థలో యెవరికి వారు యెలా రెచ్చిపోతున్నారో! రౌతు మెత్తనయితే గుఱ్ఱం మూడుకాళ్ళమీద నడవటమంటే యిదే. నాభయం కూడా, అవ్యవస్థ ముదిరిపోయి యీసారి యే కంపెనీకి దేశాన్ని అప్పగించేస్తామోననే!
ReplyDeleteమరొకరు మన మీద ఆధిపత్యం చెలాయించడం అన్న ఊహే భరించలేము. ఈ మధ్యనేనా, మన తాతల కాలంలోనేనా మనకి స్వాతంత్ర్యం లభించింది అని అనుకోగానే నాది ఎంత అదృష్టం అనిపిస్తుంది. మన దేశంలో ఈ ఆధిపత్య పోరు ఎన్నటికీ చల్లారదు. మీరు రాసింది అనేక రకాల ఆలోచనలు కలుగ చేస్తున్నాయి. మా తాత ముత్తాతాలనుంచి అందరూ న్యాయవాదులే. అవినీతిని కళ్ళారా చూస్తూ పెరిగాను. వాళ్ళు న్యాయస్థానాన్ని ఎలా మోసం చేసేవారో తెలుసు. అది మా బ్రతుకు తెరువు అనేవారు.కానీ ఒక చిన్న రైతు నుంచి తను గెలవడం కోసం అవినీతిని ఆశ్రయిస్తూంటే మరి బడా బాబులకు లెఖేంటి.
ReplyDelete