Monday, November 28, 2011
నిజం వద్దు - అబద్ధం ముద్దు
ప్రపంచ ప్రఖ్యాత డచ్ చిత్రకారుడు రెంబ్రాంట్ ఒకమాట అన్నాడు: చిత్రాల్ని దగ్గరగా చూడకు. కంపుకొడతాయి -అని. చిత్రాల మాటేమోగాని ఈ మాట మనదేశంలో ప్రజా నాయకులకీ, డబ్బుని కూడవేసే చాలామంది పెద్దలకీ వర్తిస్తుంది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Monday, November 21, 2011
దేవదూతలకు ఆహ్వానం
నేరం ఎప్పుడూ నిర్దయగా, కర్కశంగానే ఉంటుంది. అయితే జాలిగా, సానుభూతితో, కసితో పీకకోసే సందర్భాలూ, కథలూ ప్రపంచ సాహిత్యానికి దగ్గర తోవలు. గోవిందనిహలానీ 'ఆక్రోష్', కాళీపట్నం రామారావుగారి 'యజ్ఞం' ఇందుకు మచ్చుతునకలు. ఇవి మినహాయింపులు. మిగతా అన్ని సందర్భాల్లోనూ నేరం నేరమే. నేరానికి శిక్షకి రెండు పార్శ్వాలు. అలాంటి నేరం జరగకుండా 'శిక్ష' ఒక ఆంక్ష కావడం, చేసిన నేరస్థుడిని హింసించడం ద్వారా అలాంటి నేరం పునరుక్తి కాకుండా అరికట్టడం. ఇది ఆయా సమాజాలు సమష్టిగా ఏర్పరుచుకున్న వ్యవస్థలు. అదే న్యాయ వ్యవస్థ.
Sunday, November 13, 2011
కడుపు చించుకుంటే
చాలా సంవత్సరాల కిందట నేనో ఆస్తిని కొన్నాను. రిజిస్ట్రేషన్ చార్జీలు కట్టింది పోగా మరో 30 లక్షలు చెల్లించాల్సి ఉంది. రూలు ప్రకారం అది అనవసరం. అన్యాయం. కనుక కోర్టుకి వెళ్లి ఆ మొత్తాన్ని తగ్గించే ప్రయత్నం చెయ్యవచ్చన్నారు లాయరు. ఇందువల్ల మరో లాభం. కేసు తేలేవరకూ డబ్బు చెల్లించనక్కరలేదు. ఈ వ్యవధిలో వడ్డీ పడదు. కోర్టులో కేసు వేశాను. 30 లక్షల బాకీ వుంచుతూ -ఒక ఆరు నెలలు చెల్లించడానికి గడువునిచ్చి ఆస్తిని రిజిస్టర్ చేశారు.
Sunday, November 6, 2011
కర్ణుని పరివేదన
ఆయన తల్లిదండ్రులెవరో పురాణాల్ని బాగా తెలిసినవారు. పుట్టుక గొప్పదయినా
పెంపు తక్కువయిన కర్ణుడి పేరు కొడుక్కి పెట్టుకున్నారు. ఆయన దళితుడు. అయినా బాగా చదువుకుని న్యాయమూర్తి అయ్యారు. ప్రస్తుతం ఆయన తమిళనాడులో హైకోర్టు న్యాయమూర్తి
Subscribe to:
Posts (Atom)