Monday, May 14, 2012

ఖరీదైన ’నిజం ’

సత్యమేవ జయతే అన్నది పాత నానుడి. సత్యం వల్ల మాత్రమే జయం లభిస్తుంది - అంటే ఈ రోజుల్లో చాలామందికి నవ్వు వస్తుంది. అయితే 'అసత్యం'తో 18 సంవత్సరాలు స్వేచ్ఛగా ఉన్న పండిత్ సుఖ్ రాం ని చూసినా, తెల్లరేషన్ కార్డులతో మద్యం వ్యాపారం చేసే బడాబాబుల కథలు చదివినా 'సత్యం' ఎంత నిస్సహాయమయిన జడపదార్ధమో అర్ధమౌతుంది. మరెందుకీ నానుడి? దీనిని 'కర్మ'అని సరిపెట్టుకున్న వేదాంతులూ, 'ఖర్మ' అని తలవంచిన వాస్తవిక వాదులూ ఎందరో ఉన్నారు.
పూర్తిగా చదవండి

4 comments:

  1. ఖరీదైన ‘నిజం’ గురించి మీ ప్రశ్నలు, సందేహాలు ఆలోచనలు రేపేలా ఉన్నాయి!

    ReplyDelete
  2. Dear Sir,

    Nice article. However, I still don't understand why people are really crazy about it. The issue they had chosen is of low priority, why can't they talk about 2G/3G Spectrum scam or about our politician's money in Swiss accounts? It's obvious that TV channels and Amir Khan trying to earn good money with this silly programmes. If Amir Khan really want to do something about it, why can't he do it all by himself instead of crying on TV show? It's complete waste of time and bandwidth.

    Regards,
    Ganesh

    ReplyDelete
  3. Nothing will happen.Another way of flow of money. From a different angle how Tiwari escaped for two years to test and finally the court (thanks to the Judge) has to conduct with force .

    ReplyDelete
  4. సెలబ్రిటీల కన్నీళ్ళకీ, కౌగిలింతలకీ కోట్ల విలువ మన పుణ్య భూమిలో. వాటి వెనుక నిజాయితీని మనం అడగనూ కూడదు, వాళ్ళు చెప్పనూ కూడదు. ఎప్పుడైతే వాస్తవలకంటే వ్యక్తులకు పెద్ద పీట వేస్తామో, నిజం నాలుగు అడుగుల అవతలే బిక్కమొహం వేసుకుని కూర్చుండిపోతుంది. మీరన్నట్టు అమీర్ గొంతు కోట్ల మందికి వినిపించింది. ఎందరి గుండె లోతుల్లోకి వెళ్ళిందో, వాళ్ళ అంతరాత్మకే తెలుసు. పుట్టుక, పెళ్ళి, విడాకులు, చావు ని కూడా ఉపగ్రహ ప్రసారాల హక్కులతో విలువ కడుతున్న ఈ రోజుల్లో, ఈ కార్యక్రమం వల్ల ఒక్కశాతం ప్రయోజనం ఉన్నా మంచిదే, కానీ ఈ మార్కెటింగ్ మాయాజాలాల మధ్య, సగటు జీవి రోదనా/వేదనా చులకనవ్వకపోతే అదే పదివేలు, ఎందుకంటే ఏ విలువ లేనిది పాపం సామాన్యుడి కన్నీరే.

    ReplyDelete