పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ఈ తరం గుర్తించినట్టు - ఒకడుగు ముందుకు వేసి చెపితే గుర్తించవలసి వచ్చినట్టు - మరెప్పుడూ రాలేదు. 193 దేశాలకు చెందిన 8000 మంది ప్రతినిధులు 19 రోజులపాటు - తమ తరం చేస్తున్న ఘోర తప్పిదాలను లేదా తమ తరం తప్పనిసరిగా అవలంభించక తప్పని కనీస మర్యాదలను హైదరాబాదులో జరిగే సదస్సులో చర్చించుకుంటారు. ఇది మానవుడి మనుగడకు సంబంధించిన అతి విలువయిన - అవసరమయిన, తప్పనిసరయిన - ఇంకా తెగించి చెప్పాలంటే ఇప్పటికే ఆలశ్యమయిన, చెయ్యక తప్పని పని.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
పర్యావరణరక్షణ గురించి,జీవ వైవిధ్యసదస్సు గురించి వివరంగా రాశారు.నాకొక్కటి తోస్తున్నది.భూటాన్లో 70 శాతం.జపాన్లో 30 శాతం అడవులు ఉన్నాయి .వాటిని తగ్గకుండా శాసనం చేసారు.మనదేశంలో 20 శాతం భూభాగంలో అడవులు ఉన్నవి .వీటిని తగ్గకుండా కనీసం 20శాతం ఉండేట్లు చట్టం తీసుకునివచ్చి అమలుపరచాలి.
గొల్లపూడి గారికి నమస్సులు.
ReplyDelete70 సంవత్సరాల్లో 'స్నానం' గురించిన ఇంటర్నెట్ లో లింక్ ఏదైనా ఇవ్వగలరా?