Monday, December 17, 2012

నిజం నిద్రపోయింది

 దాదాపు 50 సంవత్సరాల కిందట నేనో నాటిక రాశాను. దాని పేరు 'నిజం నిద్రపోయింది '. ఆ రోజుల్లో అది - అప్పటి నాటక ప్రక్రియకి పదేళ్ళు ముందున్న రచన. ఈ సృష్టిలో అన్ని నిజాలూ చెప్పుకోదగ్గవి కావు. ఒప్పుకోదగ్గవికావు. పంచుకోదగ్గవి కావు. ఎంచుకోదగ్గవికావు. కొన్ని నిజాలు బయటికి రావు. రానక్కరలేదు. ఆ కారణానే మన జీవితాలు ఆనందంగా, ప్రశాంతంగా సాగుతున్నాయి.
పూర్తిగా చదవండి

1 comment:

  1. మీరు చెప్పిన రెండు సంఘటనల్లోనూ నాకూ సరిగ్గా అదే అనిపించింది. మిశ్రా గారి నుంచి త్వరలో మనం ఒక ఆత్మ కథ ఊహించొచ్చు. ధోనీ నాయకత్వం లో ఈ జట్టు విజయ పరంపర కొనసాగించి ఉంటే, అమర్నాథ్ ఈ మాటలు బయట చెప్పుకునేవాడా ? నిబద్దత కలిగిన అధికారి వ్యవస్థ కాలి మసి అవుతుంటే, ఆ మంటనార్పడానికి తనవంతు సాయం చేస్తాడు, అది లేని వాడు, బయట చుట్ట కాల్చుకుంటాడు, బహుశా ఆ నిప్పుతోనే. వార్తల్లేని మీడియాకి ప్రతీదీ వింతే, ఫలాన రోజు సింగు గారు స్నానం చెయ్యకుండానే పార్లమెంటుకు వెళ్ళారోచ్ అని ఆయన ఆంతరంగీకుడెవడైన రేపు న్యూస్ అవర్ లో ప్రత్యక్షం ఐతే మనం అస్సలు విస్తుబోనక్కర్లేదు

    ReplyDelete