Monday, January 14, 2013

బురదకొలనులో ఒంటరి మొగ్గ

సినీమా పాఠాలు చెప్పకూడదు. ఆ పని సినీమాది కాదు.
సినీమా చంకలు గుద్దే వెర్రి వేషాలు వెయ్యకూడదు. ఆ పనీ సినీమాది కాదు.
సినీమా విస్కీకాదు. తులసి తీర్ధం కాదు. మార్ఫియా కాదు పాలగ్లాసూ కాదు. కాని ప్రాచుర్యం దృష్ట్యా, అప్పీలు దృష్ట్యా సినీమాకి ఓ బాధ్యత ఉంది. ఇదీ న్యాయంగా ఉండనక్కరలేదు. కానీ ఉండక తప్పని పరిస్థితి - కేవలం దాని ప్రాచుర్యం కారణంగా.
పూర్తిగా చదవండి 

4 comments:

  1. మారుతిరావు గారూ! ‘మిధునం’ గురించి మంచి విశ్లేషణ. ఇది ఉత్తమాభిరుచి గురించి కూడా చక్కని పరిశీలన. ముఖ్యంగా మీ ప్రారంభ వాక్యాలు పాఠకులను విషయంలోకి ప్రవేశపెడుతూ చేసిన పదునైన వ్యాఖ్యానాలు!

    ReplyDelete
  2. నేను మిధునం సినిమా చూడలేదు.. అయినా మీ పోస్ట్ కి నా వ్యాఖ్య వ్రాయాలనిపించింది. నేను రమణ గారి కథ మాత్రమే చదివాను. ఆ కథని సినిమా తీయాలని అనుకోవడము నిజంగా సాహసమే, ఎందుకంటే రమణ గారి వర్ణనలు అలాంటివి. "వర్షం కురిసినప్పుడు ఆ ఇల్లు అద్దం లో కొండ" లాంటివి ఎన్నో.. మీరు అన్నట్టు ప్రలోభాలకు భరణి గారు లొంగక పోవడమే ఆయన బలము, ఈ సినిమా విజయము...ప్రలోభాలకు లొంగిన మహా నటులు ఎందఱో అయిపోవడము చేతనే మన తెలుగు సినిమాల స్థాయి అథః పాతాళానికి చేరుకొని నశిస్తోంది. సృజనాత్మకతే ఊపిరి అయిన కళా రంగములో మంచిని నవ్యత ని వెతుక్కునే దుస్తితి కి అదే కారణము, నిదర్శనము. ఈ సినిమా ని ఉదాహరణ గా తీసుకుని మరికొందరు మహానుభావులు సంధి లో ఉన్న తెలుగు సినిమాకు తులసి తీర్థము పోస్తారని ఆశిస్తూ....

    భవదీయుడు
    సీతారామ శాస్త్రి

    ReplyDelete
    Replies
    1. సమాజంలో భాగమయిన ప్రతీ వ్యక్తికి సామాజిక భాధ్యత ఉండి తీరాలి, అదే సమాజ శ్రేయస్సు. దీనికి ఎవరూ మినహాయింపు కారు, సినిమా అయినా ఆ సినిమాలొ పనిచెసే వ్యక్తులైనా. ఈ మాటని ప్రభుత్వము విస్మరించింది వారి భాద్యతారాహిత్యం వలన, జనాలు విస్మరించారు వారి అలొచనారాహిత్యం వలన, సినిమావారు విస్మరించారు వారి స్వార్థపూరీత ఆలోచనల వలన. ఆన్ని కలసి, అధర్మం మరియు అన్యాయం దిన దిన ప్రవర్ధమానమయి నేడు దెశమంతటా వ్యాపించింది. వీటి ఫలితమే మనం ఇప్పుడు రొజు పత్రికలలొ చదువుకుంటున్నాము.
      సమాజం మళ్ళీ మంచి దారికి రావాలి అంటె టివీ మరియు సినిమ లాంటి ప్రజా మాధ్యమాలు వాటి భాధ్యతని గుర్తించాలి. జనాలకి మంచి-చెడు మరియు నైతిక విలువలను అర్ధమయ్యెలా చెప్పాలి. సమాజంలో మార్పుకు తొడ్పడాలి. దీనికి తొడు పిల్లలకు నైతిక విలువలు, హిందుత్వం, దేశ సంస్క్రుతి వంటి అంశాలు భొధపరిచే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి. నెటి బాలలే రెపటి పౌరులు. వారికి సరయిన దారిని చూపించే భాద్యత మనలొ ప్రతి ఒక్కరికి ఉంది మరియు ఉండి తీరాలి.

      Delete
  3. గొల్లపూడి వారికి,

    మీరు "మిథునం" గురించి రాసిన వ్యాసాన్ని, చదివి, విని, మా కుటుంబాన్ని కూర్చోపెట్టి వినిపించాను.
    సినిమానీ, సినిమాలో కళనీ, సినిమా కి ఉనా స్కోప్ నీ అర్థం చేసుకుని, ప్రేమించి, అందులో ప్రావీణ్యం సంపాదించిన వాడు రాస్తే ఆ వ్యాసం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది !!!

    మిథునం అని నేరుగా మొదలుపెట్టకుండా, సినిమా మీద general discussion లాగా మొదలుపెట్టి, కొసమెరుపు లాగా మిథునం మీదికి topic మరల్చడం "గడుసుతనం"

    ఇప్పుడు నేను రాసిన వాక్యాలు మీ శైలిని copy కొడుతున్నట్టు ఉన్నాయి. What can I say, "imitation is the best form of flattery"

    మీ వ్యాసాల్ని చదవటమే కాకుండా మిమ్మల్ని వినటం చాల బాగుంది. (కాస్త వల్గర్ గా చెప్పాలంటే మంచి కిక్ ఇచ్చింది)
    మీ రేడియో నాటకాలనీ, talks నీ నేను ఎరగను కనుక నాకిది ఇంకా కొత్తగా అనిపించింది. పంచతంత్రం నుంచి ఇవాల్టి దాకా , listening to the narrative is more captivating than reading it.

    facebook లో మిథునం చూడగల, మిథునం గురించి "గొల్లపూడి" రాసిన వ్యాసాన్ని చదవగల taste ఉంది అనుకున్న నా పరిచయస్తులందరికీ, మీ వ్యాసం share చేసాను.

    ఇలాగే మరిన్ని మంచి వ్యాసాలూ, వాక్యాలూ మీ నుంచి రావాలి అని కోరుకుంటూ ...

    ReplyDelete