Sunday, April 28, 2013

మేధావి అస్తమయం

గొప్ప గాయకుడు, కవి, రచయిత, మిత్రుడు -యివన్నీ నేలబారు విశ్లేషణలు. ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు (పి.బి.శ్రీనివాస్‌)కి యివేవీ సరిపోవు. ఇవన్నీ ఎవరయినా సాధించగలిగినవి. సాధిస్తున్నవీను. ఆయన బ్రతుకు రహస్యం తెలిసిన మనిషి. ఆద్యంతమూ జీవించిన మనిషి. ఆ మధ్య చాలా జబ్బుపడి కోలుకున్నారు. నేను నా నలభైయ్యేళ్ల పరిచయంలో ఏనాడూ ఆయన నిస్పృహతో, నిరాశతో, నిస్సత్తువతో, దైన్యతతో ఉండగా చూడలేదు. ఎప్పుడూ ఆనందంగా -ఎదుటివాడిలో మంచిని గుర్తిస్తూ, కీర్తిస్తూ జీవించిన యోగి. అదీ ఆయన ఆరోగ్య రహస్యం.
పూర్తిగా చదవండి 

2 comments:

  1. చెన్నై సంగీత, సాహితీ సభలు ఆయన వెలితిని కప్పిపుచ్చలేవు. కొందరి గొప్పతనం, వారి మాడెస్టీ వెనుక దాగుండిపోతుంది, బహుశా PBS విషయం లో మీలాంటి అతికొద్దిమందికే దాన్ని చూసి ఆనందించే అదృష్టం దక్కింది. మిగతా మేమందరం ఆయన్ని ఆయన పాటలోనే వెతుక్కోవాలి.

    ReplyDelete
  2. వివిధ భాషల్ని నేర్చుకోవడానికి (రాయడంతో సహా) ఆయన అనుసరించిన పద్దతి యేమిటాని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను.మళ్ళీ వాటిల్లో కవితలు రాయడం మాములు విషయం కాదు.ఈ సృష్టిలో ప్రతి మనిషి తనవైన సువాసనలు వెదజల్లి వెళ్ళిపోవడానికి వస్తుంటాడనుకొంటాను.మీకు ధన్యవాదాలు..!

    ReplyDelete