skip to main |
skip to sidebar
నూరేళ్ల కిందట భారతీయ సినిమా మన దేశంలో అప్పటికి ఉన్న అన్ని పరిమితులనూ పుణికి పుచ్చుకుని పురుడుపోసుకుంది. ప్రపంచ సినిమాకు కలిసివచ్చిన అదృష్టం -సిమోన్ వాన్ స్టాంపర్, డి.డబ్ల్యూ. గ్రిఫిత్, చార్లీ చాప్లిన్ వంటి వైతాళికులు మనకి లేరు. అయితే మన అదృష్టం -చిత్తశుద్దీ, కర్తవ్య దీక్షాగల ఒక స్వాప్నికుడూ, కార్యసాధకుడూ మన సినిమాకి కలిసివచ్చారు. ఆయన దాదా సాహెబ్ ఫాల్కే. కదిలే ఫిలింల ఫ్రేములు దగ్గర్నుంచి, కెమెరా కవాటాల దగ్గర్నుంచి, ఎడిటింగు వరకూ ప్రతీదీ 'ఓం నమ:' అంటూ ఆద్యంతమూ పరిశీలించి ఒడుపుని సాధించిన మహానుభావుడు ఫాల్కే.
పూర్తిగా చదవండి
ఆ మధ్య అట్లాంటాలో ఓ మిత్రుడి ఇంట్లో ఉన్నాం నేనూ మా ఆవిడా. ఆయన రచయిత. ఆయన కూతురు చాలా అందమయినది. చురుకయినది. అయితే విపరీతమైన పెంకితనం. కాగా, ఏ కారణం చేతయినా తల్లిదండ్రులు పసిపిల్లల వొంటిమీద చెయ్యి వెయ్యరాదు -అనేది అమెరికాలో పెద్ద నిబంధన. ఆ విషయం స్కూలుకి వెళ్లిన తొలిరోజుల్లోనే పిల్లలకి చెప్తారట -అలాంటిదేదయినా జరిగితే ఫలానా నంబరుకి ఫోన్ చెయ్యమని. కనుక పిల్లలకి ఒక మొండి ధైర్యం వస్తుంది.
పూర్తిగా చదవండి
మా చిన్నతనంలో ఎవరినయినా పరిచయం చేస్తూ ''ఈయన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్లారు'' అంటే దేవుళ్లని చూసినట్టు చూసేవాళ్లం. ఆనాడు అది అరుదైన త్యాగం. అప్పటి మహానాయకులంతా జైళ్లకి వెళ్లి వచ్చినవారే. తిలక్ జైల్లో 'భగవద్గీత' వ్యాఖ్యానం రాశారు
పూర్తిగా చదవండి
ఇద్దర్ని దర్శించుకోడానికే నేనూ, మా ఆవిడా చాలా సంవత్సరాల క్రితం వారణాశి వెళ్లాం. కాశీవిశ్వేశ్వరుడిని, భారత రత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌ని. ఇద్దరిముందూ సాష్టాంగపడి నమస్కారాలు చేశాం. బిస్మిల్లాఖాన్ కి అత్యంత శ్రద్ధాభక్తులతో శాలువా కప్పాను. లలిత కళలకీ ముస్లింలకీ అవినాభావ సంబంధం. చిత్రకళ, కవిత్వం, సంగీతం, అభిరుచి, అందం -అన్నింటిలోనూ వారికి ప్రథమ తాంబూలం. అది వారి గొప్ప అదృష్టం. సమాజంలో అందరికీ గొప్ప అవకాశం.
పూర్తిగా చదవండి