Monday, December 9, 2013

నల్ల సూర్యుని అస్తమయం

2003లో మా అబ్బాయి క్రికెట్‌ ప్రపంచ కప్పు ఆటలకు దక్షిణాఫ్రికా వెళ్లి వస్తూ నాకో బహుమతిని తెచ్చాడు. నెల్సన్‌ మండేలా ఆత్మకథ -ఎ లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడమ్‌. "స్వాతంత్య్రానికి సుదీర్ఘ ప్రయాణం" దాదాపు తెనుగు సేత. అప్పటికి ఆత్మకథల మోజులో ఉన్న నేను -నా ఆత్మకథ రచనకు ఉపక్రమించబోతున్న నేను -వదలకుండా కొన్ని రోజులు చదివాను. చదివాక కొన్ని సంవత్సరాలు నన్ను వెంటాడిన పుస్తకం -కాదు -వెంటాడిన జీవితం మండేలాది. మండేలాకీ మన దేశానికీ దగ్గర బంధుత్వం ఉంది. మహాత్ముని అహింసాయుతమైన పోరాటాన్ని -శాంతియుత సమరాన్ని స్ఫూర్తిగా తీసుకున్న రెండో వ్యక్తి -నెల్సన్‌ మండేలా. మొదటి వ్యక్తి -మార్టిన్‌ లూధర్‌ కింగ్‌.
పూర్తిగా చదవండి

1 comment:

  1. ఐనిస్టీన్ కూడా తప్పు చెప్పాడు..! "ఇలాంటి వ్యక్తీ భూమి మిద నడిచాదంటే ముందు తరాలు నమ్మవని (మహాత్ముణ్ణి ఉద్దేశించి)" అన్నాడు.. అంటే అలంటివాడు మరో సారి పుట్టాడని, అలంటి వాళ్ళు ఇక ముందు ఉంటారని ఆతను నమ్మలేదు. కాని మరో తర౦ నమకాన్ని నిలబెట్టడానికి "వెలుగునిచ్చే సూరీడు" మండేలా తన జీవితాన్ని నిదర్శనంగా నిలబెట్టి చూపించాడు. ఆతను నల్లజాతి కి మాత్రమె కాదు, అందరికి వెలుగులు చూపిన సూరీడు.
    మీ వ్యాసం ఎప్పటిలాగే చాల బాగుంది!
    గొల్లపూడి గారికి, మీ మాటలు వింటూ, చదువుతూ పెరిగినవాళ్ళం. ఇంకా మా లాంటి వారికి స్పూర్తి నిస్తూ మీ కాలం నిత్య నూతనంగా ఉంది. అందుకు కృతజ్ఞతలతో ..మీకు నమస్కరిస్తూ -వంశీ

    ReplyDelete