Sunday, April 28, 2013

మేధావి అస్తమయం

గొప్ప గాయకుడు, కవి, రచయిత, మిత్రుడు -యివన్నీ నేలబారు విశ్లేషణలు. ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు (పి.బి.శ్రీనివాస్‌)కి యివేవీ సరిపోవు. ఇవన్నీ ఎవరయినా సాధించగలిగినవి. సాధిస్తున్నవీను. ఆయన బ్రతుకు రహస్యం తెలిసిన మనిషి. ఆద్యంతమూ జీవించిన మనిషి. ఆ మధ్య చాలా జబ్బుపడి కోలుకున్నారు. నేను నా నలభైయ్యేళ్ల పరిచయంలో ఏనాడూ ఆయన నిస్పృహతో, నిరాశతో, నిస్సత్తువతో, దైన్యతతో ఉండగా చూడలేదు. ఎప్పుడూ ఆనందంగా -ఎదుటివాడిలో మంచిని గుర్తిస్తూ, కీర్తిస్తూ జీవించిన యోగి. అదీ ఆయన ఆరోగ్య రహస్యం.
పూర్తిగా చదవండి 

Monday, April 22, 2013

మరో తెలుగు పీఠాధిపతి

భారతీయ జ్ఞానపీఠ పురస్కారం మన దేశస్థాయిలో నోబెల్‌ బహుమతి లాంటిది. జాతీయస్థాయిలో అన్ని భారతీయ భాషలలోనూ ఉత్తమ రచయితగా నిలిచి జ్ఞానపీఠాన్ని అధిరోహించడం -తెలుగు దేశానికి, తెలుగు రచయితకి ఇది మూడవసారి. 1970లో కవిసామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణకు 'రామాయణ కల్పవృక్షం' రచనకు బహుమతి లభించింది. 1988లో పద్మభూషణ్‌ సి.నారాయణ రెడ్డిగారికి ''విశ్వంభర'' రచనకిగాను జ్ఞానపీఠ పురస్కారం దక్కింది. ఇప్పుడు రావూరి భరద్వాజకు -వారు రచించిన ''పాకుడురాళ్లు'' నవలకి.
పూర్తిగా చదవండి

Tuesday, April 16, 2013

ఒక ఆలోచన - ఒక మీమాంస

 గొప్పగా మాట్లాడేవారంతా గొప్ప వక్తలు కారు. అలాగే గొప్ప వక్తలంతా గొప్ప విషయాలను మాట్లా డనక్కరలేదు. రెండో నిజానికి గొప్ప ఉదాహరణ -మన రాజకీయ నాయకులు. మరో అనర్థమైన ఉదాహరణ హిట్లర్‌. జాతిని ఊపి ఉర్రూతలూగించి -తన దౌష్ట్యాన్ని అంత గొప్పగా సబబనిపించేలాగ మాట్లాడే వక్త బహు శా మానవ చరిత్రలో మరొకరు లేరేమో.
 పూర్తిగా చదవండి

Monday, April 8, 2013

వింతమనిషి - కొంత నవ్వూ

అమెరికాలో ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం కులపతికి అర్ధరాత్రి ఫోన్‌ వచ్చింది. అటునుంచి ఓ వ్యక్తి ఆతృతగా అడుగుతున్నాడు: ''112 మెర్సన్‌ స్ట్రీట్‌కి ఎటువెళ్లాలో చెప్పగలరా?'' అని. ఆ ప్రశ్నని వినగానే ఈ కులపతి దిగ్గునలేచి కూర్చున్నాడు. ''బాబూ, మీరెవరో తెలీదు కాని -ఇంత అర్ధరాత్రి అంత పెద్దాయన్ని ఎందుకు డిస్టర్బ్‌ చేస్తారు?'' అన్నాడు
పూర్తిగా చదవండి