Wednesday, January 8, 2014

ఓ గొంతు - ఓ గర్జన

అరవై ఐదు సంవత్సరాలు కుళ్ళి, అహంకారంతో, స్వార్థంతో నేరచరిత్రతో గుండెలు దీసిన ధైర్యంతో చట్టాల్నీ, చట్టసభల్నీ కైవశం చేసుకుని దేశాన్ని దోచుకుతింటున్న పాలక వ్యవస్థలో కేవలం 9 నెలల్లో రూపు దిద్దుకుని --ప్రజల మద్దతుని సాధించి, మైనారిటీ వోటుతో మెజారిటీని నిరూపించుకోవడానికి అసెంబ్లీలో నిలబడిన- ఏనాడూ నిలబడాలని,నిలబడతానని ఊహించని ఓ సాదా సీదా నేలబారు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గొంతు విప్పితే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది.
పూర్తిగా చదవండి

2 comments:

  1. బుగ్గ కార్లు లేకుండా హడావిడీ సెక్యురిటీ లేకుండా పాలన సాగిస్తున్న మనోహర్ పారికర్ చేసుకున్న పాపం అతను భా జా పా కి చెందడం!
    ప్రస్తుత మీ నేలబారు మనిషి సాధించ గలిగే ఒకే ఒక కార్యం మోడీ ప్రధాని కాకుండా చేయడం ........అతి కొద్ది రోజుల్లో ఈ నేల బారు మనిషి రాజకీయ నాయకుల 'రకం' లో ఎలా కలిసాడో మీరే రాస్తారు నేను చదువుతాను!
    అయినా మాష్టారు దిళ్ళీ లో ఓ పార్టీ గళ్ళీ కొక పార్టీ పెడుతూ పోతే .. ఈ దేశ ప్రజాస్వామ్యం లో సమస్యల కన్నా పార్టీలు ఎక్కువైపోయేలా ఉన్నాయి...... చేసే ప్రక్షాలణ యేదో పాత పార్టీలో చేరి చెయ్యొచ్చు గదా.... అయినా ఈ నేల బారు మనిషి గురించి రోజుకు కోటి సార్లు అరుస్తున్న మీడియా నిచూస్తే మాకు ఎక్కడో తడుతోంది!!! ప్రాంతీయ పత్రికలు కూడా స్థానిక సమస్యల గురించి లోపలి పేజీల్లో వేసి ముందు పేజీలో ఫొటొ తో సహా.... కనీసం ఒక్క వార్త అయినా వెస్తున్నాయి!

    ఒక పాత పుస్తకం లో చదివా .... 1947 సమయం లో టైంస్ ఆఫ్ ఇండియా అనే పత్రిక జిన్న సిగరెట్టు ముట్టించుకున్న ఒక వార్తలా, లంచ్ లో పదార్థాల లిస్టును కూడా ఒక వార్తలా వేసి లేని హైప్ శృష్టించి పెద్ద నాయకునిగా.... చిత్రీకరించి పాకిస్తాన్ కి పెద్దను చేసిందంట ..... మరి ఈ నాడు ఈ నేలబారు మనిషి విడిపోవాలంటున్న కాశ్మీరుకి పెద్ద అవుతాడేమో!!

    అయినా ఈ ప్రజాస్వమ్యం లో భారతీయులకి రాజ్యాంగం ద్వారా లభించిన ఒక బాధ్యత మరియు ఒక హక్కు ఎంటంటే "మోసపోవటం". మీ తరం వంతు పూర్తి అయింది మా తరం వంతు వచ్చింది ...... మోసపోవటం అలవాటయింది!.

    ReplyDelete
  2. మారుతి రావు గారు, మీ బ్లాగ్ నేను క్రమం తప్పకుండా గా ఫాలో అవుతూ ఉంటాను. ఒక మంచి వ్యక్తి తో మాట్లాడితే ఒక మంచి పుస్తకం చదివినట్టు అని అంటూవుంటారు.. మొన్న ABN లొ మీ Interview చూసినప్పుడు నాకు అలాంటి అనుభూతి కలిగింది :)

    ReplyDelete