Sunday, February 16, 2014

ఓ నియంత ఆఖరి రోజులు

కొన్ని లక్షల మంది మారణహోమానికి కారణమయి, ఒక శతాబ్దపు దౌష్ట్యానికి, పాశవిక ప్రవృత్తికీ కారణమయిన ఓ నియంతకి ఇంత మర్యాద అక్కరలేదు నిజానికి. 'ఓ నియంత దిక్కుమాలిన చావు' -అన్నా సరిపోతుంది. కాని హిట్లర్‌ చావుని పదేపదే చరిత్ర గుర్తుచేసుకునే సందర్భాలు ఎక్కువ. చాలాకాలం క్రితం -హాలీవుడ్‌ ఓ గొప్ప చిత్రాన్ని నిర్మించింది. ''హిట్లర్‌ ఆఖరి రోజులు'' దాని పేరు. ప్రముఖ నటుడు ఎలెక్‌ గిన్నిస్‌ హిట్లర్‌ పాత్రని ధరించి -నటనకు ఆస్కార్‌ బహుమతిని పుచ్చుకున్న గుర్తు. మరొక మహానటుడు -ఆయన జీవితకాలంలోనే ఓ గొప్ప పారిహాసికని నిర్మించారు: చాప్లిన్‌ 'ది గ్రేట్‌ డిక్టేటర్‌'. ఎందుకని? ఎవరిని ఉద్ధరించడానికి ఈ చిత్రాలు? నిజానికి ఎందుకు ఈ కాలమ్‌? సమాధానం ఉంది.
పూర్తిగా చదవండి

2 comments:

  1. అలెక్ గిన్నెస్ హిట్లర్‌గా నటించిన హిట్లర్ చివరి పది రోజుల గురించి తెలియచేసినందుకు ధన్యవాదాలు. అలెక్ గిన్నెస్ హిట్లర్ గా నటించిన విషయం మీ వ్యాసం ద్వారనే తెలిసింది. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. స్పిల్ బర్గ్ అద్భుత సృష్టి షిండర్ల్స్ లిస్ట్ మూవీ చూసినప్పుడు కళ్లు చెమ్మగిల్లాయి. నాజీల దమనకాండను ఆ చిత్రంలో చూపించినట్టు ఇంకే చిత్రంలోనూ చూపించలేదని చాలా రివ్యూలు చెప్పాయి. అంతే వివాదాస్పాదమూ అయింది కూడానూ.. యూధుడైన స్పిల్ బర్గ్ భావోద్వేగమా అనిపించింది. కానీ.. నియంత ఆఖరి పేజీల్లో సరిదిద్దుకోలేని అచ్చుతప్పులతోనే జీవితం ముగుస్తుందన్న సందేశం ఒకవైపు, నియంతలో మానవత్వం మిణుగురులున్నా... వ్యక్తిత్వ అహాంకారం ఆ మిణుగురులను మింగేస్తాయని మరో వైపు... చాలా హృద్యమైన ఆర్టికల్ సర్... ధన్యవాదాలు. మీ లాంటి పెద్దల వల్లే ఇలాంటి మా తరం చూడగలుగుతోంది.

    ReplyDelete