ఈ మధ్య ఓ వార్త చదివాను. మీరత్ లో మీనాక్షిపురం అనే గ్రామంలో (నిజానికి యిలాంటి పేరున్న గ్రామం దక్షిణాదిన వుండాలి) సైనీ అనే తెగవారు ఈ దీపావళికి కొత్తరకం దేవుడి బొమ్మలు తయారు చేస్తున్నారట. ఆ బొమ్మలు గణేశ్, లక్ష్మి. (నిజానికి లక్ష్మీ గణపతి విగ్రహం, ఆరాధన ఆంధ్ర దేశంలో ఉభయ గోదావరుల్లో ఎక్కువగా చూశాను నేను. లక్ష్మి తొడమీద కూర్చోబెట్టుకున్న పది చేతుల గణపతి ఓ ప్రత్యేకమైన పూజా ప్రక్రియకి సంకేతం.)
పూర్తిగా చదవండి..
Monday, October 26, 2009
Subscribe to:
Post Comments (Atom)
గో సంరక్షణ కోసం వాళ్ళు చేస్తున్న పని అభినందనీయం.
ReplyDeleteఅంతా బాగుంది కాని, లక్ష్మి దేవిని, గణపతిని ఒకే చోట పెట్టి లక్ష్మిదేవి గణపతికి భార్య అనే భ్రమ కల్పించడం మహాపచారం. మనకు తెలిసిందే, గణపతికి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలున్నారని. కాని, మనవాళ్ళు కొంచెం అతి తెలివి ఉపయోగించి, సరస్వతీదేవిని, గణపతిని, లక్ష్మిదేవిని ఒకే ఫోటో ఫ్రేంలో పెడుతుంటారు. అది మహాపచారం. ఈ విషయమై తాడేపల్లి గారి బ్లాగులో ఒకసారి చర్చ జరిగింది.
నాగ ప్రసాద్ గారూ
ReplyDeleteలక్ష్మీ గణపతి అన్న మాట విన్నప్పుడు నేనూ మీలాగే స్పందించాను. కాని వల్లభా గణపత్యుపాసకులు, మంత్ర శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రిగారిని కలిసినప్పుడు వారు ఈ concept ని వివరించారు. మంత్ర శాస్త్రంలో గణపతి ఉపాసన వున్నది. ఎన్నో విధాలయిన రూపాంతరాలున్నాయ్. బాలా గణపతి, నీలకంఠ గణపతి, అఘోర గణపతి, విద్యా గణపతి- యిలా. ఒక్కో గణపతికి వేర్వేరు ఉపసనా పద్ధతులు, యంత్రాలు ఉన్నాయి. కొంతవరకు ఈ భీజాలను ముత్తుస్వామి దీక్షితార్ తన కీర్తనలలో పొందు పరిచారని చెప్తారు. ఇక లక్శ్మీ గణపతి concept ని వల్లభేశుడు అంటారు. ఇది మరొక ధ్యాన శ్లోకం:
బీజాపూర గదేక్షు కార్ముకరుజా చక్రాబ్జ పాశోత్పలా
వ్రీహ్యగ్ర స్వవిషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహః
ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లుష్టోజ్వలద్భూషయా
విశ్వోత్పత్తి సంస్థితి కరో విఘ్నేశ ఇష్టార్ధ దః
మేము - మాకుటుంబం తరఫున చెన్నైలో రెండు దేవాలయాలను కట్టి లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టలను చేశాం. ఇలాంటి విషయాలు చెప్ప్తున్నప్పుడు నేనూ మాటల గురించి తడువుకుంటాను- సరైన పద్ధతిలో చెప్పగలుగుతున్నానా అని. వేణుగోపాలశాస్త్రిగారు ఈ విషయాలనన్నీ చర్చిస్తూ శ్రీ వల్లభేషోపనిషత్ అనే గ్రంధాన్ని రచించారు.
అణుశాస్త్రంలో పరిశోధనలు జరిపి, ఆంధ్రా విశ్వవిద్యాలయం న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగానికి అదిపతిగా పనిచేసి రిటైరయిన స్వామి జ్ణానానంద గర్గ పురంలో వల్లభ గణపతి విగ్రహ ప్రతిష్ట చేశారట. వీరు రచించిన కైలాస మానస సరోవర్ అనే గ్రంధానికి జవహర్లాల్ నెహ్రూ ఉపోద్ఘాతం రాశారు. ఈయనకి ప్రభుత్వం పద్మశ్రీ గౌరవాన్నిచ్చింది.
ఇంతకంటె చెప్పడానికి నా శక్తి చాలదు. ఏమైనా ఇది బ్లాగుల్లో చర్చించే విషయం కాదు. నాలాగే ఒకప్పుడు పరిమితమైన అవగాహన వున్న మీకు చెప్పాలనిపించింది.
గొల్లపూడి మారుతీ రావు