కేంద్ర మంత్రి జయరాం రమేశ్ ఈ మధ్య ఓ గొప్ప నిజాన్ని వక్కాణించారు. "దుమ్ము దూసర చెత్తకు ఏదైనా నోబెల్ బహుమతి వుంటే మన దేశానికి పోటీ లేకుండా ఆ బహుమతి దక్కుతుంది” అని.
వెంటనే దుమారం లేచింది. ఈ దేశంలో ఓ గొప్ప సంప్రదాయం వుంది. అధికారంలో వున్న పార్టీలు ఎప్పుడూ అబద్దాలే చెప్పాలి. ఎదుటి పార్టీలు నిజాలు చెప్పాలి. అధికార పార్టీ చెప్పిందికనుక ఎప్పుడూ అబద్దం నిజంగానే చెలామణీ అవుతుంది. ప్రత్యర్ధులు చెప్పారు కనుక నిజం ఎప్పుడూ అబద్దంగానే కనిపిస్తుంది. ఇది అబద్దమని సీబీఐ, పోలీసులు, కొండొకచో న్యాయస్థానాలూ సమర్దిస్థాయి. ఈ వ్యవస్థనే తెలుగులో "ప్రజాస్వామ్యం” అంటారు.
పూర్తిగా చదవండి
Monday, November 23, 2009
Monday, November 16, 2009
సాంబారు వడ కధ
ఇప్పుడిప్పుడు రాష్ట్రమంతా వచ్చే దిన పత్రికలకు జిల్లా అనుబంధాలు వచ్చాయి. జాతీయ స్థాయిలో పది మందీ తెలుసుకోవలసిన వార్తల్ని- బొత్తిగా అనుభవం చాలని స్థానిక సంపాదకులు- జిల్లా అనుబంధానికి అంటగట్టి మరిచిపోవడం కద్దు.
ఒకటి రెండు ఉదాహరణలు. విజయనగరంలో దాదాపు 28 సంస్థలు ఒకటయి- ఏటేటా గురజాడ అప్పారావు స్మారక పురస్కారం యిస్తారు. ఇది విజయనగరానికీ, పుచ్చుకునేవారికీ గర్వకారణం.- అప్పారావుగారి స్మృతి చిహ్నం కనుక. చాలా సంవత్సరాలు- యిప్పటికీ కూడానేమో- ఇలాంటి వార్తలు జిల్లా తోకపత్రికల్లో మాయమవుతూంటాయ్.

Monday, November 9, 2009
రాజ నర్తకి పరిష్వంగం
నాకు చాలా యిష్టమయిన జోక్ ఒకటుంది. నిజానికి ఇది అబ్బూరి రామకృష్ణారావుగారు తమ ఉపన్యాసాల్లో -ఆ రోజుల్లో- తరుచు చెప్పేవారు.
వెనకటికి ఒకాయన అనాధ శరణాలయానికి సహాయం చెయ్యమని ఉత్తరం రాశాడట. ఉత్తరం చూసుకున్న పెద్దమనిషి బాగా ఆలోచించి ఇద్దరు అనాధల్ని పంపాడట.
అహింసకీ, శాంతికీ ప్రతీకగా నిలిచిన మహాత్మాగాంధీ పుట్టిన రోజునాడు ఆన్నార్తులకు రుచికరమైన చికెన్ బిరియానీ పంచితే ఎలావుంటుంది?

Wednesday, November 4, 2009
పుస్తకం డాట్ నెట్ లో నా ఇంటర్వ్యూలు
నేను నా పద్నాలుగోయేటనుంచీ రాస్తున్నాను. అప్పటికే ఏదో చదివేవాడిని. మెల్లగా కూడబలుక్కుని ఇంగ్లీషు కథలు చదివిన గుర్తు. నా మొదటి కథకూడా ఏదో ఇంగ్లీషు కథ పట్ల అవగాహనతో రాసిందనుకుంటాను. మా అమ్మగారు భారత రామాయణాలు శ్రావ్యంగా చదివేవారు. చిన్నతనంలో ఆ స్పూర్తి కొంత ఉపకరించిందని ఇప్పుడు అనిపిస్తుంది. ఏమైనా ఇది ప్రశ్నని బట్టి మెదడులో వెదుకులాటే!
మొదటి భాగం
రెండో భాగం
మొదటి భాగం
రెండో భాగం
Sunday, November 1, 2009
ఓ అజ్ఞాని ఆవేదన
ఇన్నేళ్ళొచ్చినా నాకు లోకజ్ణానం పెరగలేదు. పైగా రాజకీయ జ్ణానం బొత్తిగా కలగలేదు. ప్రాంతీయ జ్ణానం బొత్తిగా కలిసిరాలేదు. కనుక ఈ కాలమ్ ని ఓ అజ్ణాని కాలమ్ గా విజ్ణులు చదువుకోవాలని నా మనవి.
చిత్రకారుడు ఎమ్.ఎఫ్.హుస్సేన్ గారు ప్రముఖులు. సాయిబుగారు. మనదేశంలో మనం ముస్లింలను గౌరవించి నెత్తిన పెట్టుకున్నట్టు ముస్లిం దేశాలే చేస్తున్నట్టు కనిపించదు. ప్రముఖ గజల్ గాయకుడు మెహదీ హస్సన్ పాకిస్థాన్ లో అనారోగ్యంతో డబ్బులేక ఆస్పత్రిలో ఉన్నాడని పేపర్లో చదివాను. మన దేశంలో బిస్మిల్లా ఖాన్ భారతరత్న. జకీర్ హుస్సేన్, ఫక్రుద్దిన్ ఆలీ అహమ్మద్, అబ్దుల్ కలాం గారలు మనకు గౌరవనీయులైన అద్యక్షులు. అబ్దుల్ కలాంగారు భారతరత్న.

Subscribe to:
Posts (Atom)