వెనకటికి ఒకాయన బెర్నార్డ్ షా నాటకాల్లో నీకు నచ్చిందేమిటని నాటకాల అభిమానిని అడిగాడట.
“ఆండ్రోకిస్ అండ్ ది లైన్” అన్నాడట అభిమాని.
“అందులో నీకు నచ్చిన పాత్ర?”
తడువుకోకుండా సమాధానం చెప్పాడట అభిమాని “సింహం” అని.
ఏ రచయితకయినా పాఠకుడి స్పందన ప్రాణప్రదం. రచన పదిమంది మనస్సుల్లో మెదలాలి. ఆయితే వారి స్పందన సూటిగా రచయితకి అందగలిగితే – ఆ ఆవకాశం గొప్పదీ, ఆశించదగ్గదీను. ఆ లక్ష్యంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. నా రచనలకీ, నా ఆభిప్రాయాలకీ, మీ ఆభిప్రాయాలకీ వేదిక ఈ బ్లాగ్. చక్కని సాహితీ సమాలోచనలకీ, చర్చలకీ ఇది చక్కని ఆవకాశం కాగలదని నా ఆశ. - గొల్లపూడి మారుతి రావు
వెనకటికి ఒకాయన బెర్నార్డ్ షా నాటకాల్లో నీకు నచ్చిందేమిటని నాటకాల అభిమానిని అడిగాడట.
“ఆండ్రోకిస్ అండ్ ది లైన్” అన్నాడట అభిమాని.
“అందులో నీకు నచ్చిన పాత్ర?”
తడువుకోకుండా సమాధానం చెప్పాడట అభిమాని “సింహం” అని.
Article is excellent
ReplyDelete__________________________
ఊహించలేని నైతిక పతనానికి ఒక్కొక్కపుడు “భయం” కూడా పరిష్కారమంటోంది మన పొరుగు దేశం.
__________________________
Well said.
మీ వివరణ ఎప్పట్లాగానే అద్భుతం.
ReplyDeleteక్రమశిక్షణతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి మొదటి విధానమే నిస్సందేహంగా మెరుగైనది మరియు దిర్ఘకాలికమైన కొండకచో శాశ్వతమైన ఫలితాలనందించగలదుకూడా.కానీ అదంతా అయ్యేలోపల వ్యవస్థ గాడితప్పిపోకుండా రెండవవిధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ముఖ్యంగా మనదేశంలో. ఐతే అది చైనాలో లాగా నిరంకుశత్వంగా మరియు శాశ్వతమైన వ్యవస్థగా మారిపోకుండా తగుజాగ్రత్తలు వహించవలసిన అవసరం కూడావుంది.
మీ ఆర్టికల్ కి నా నిజాయితీ అయినా స్పందన ఒక నిట్టూర్పే. వ్యవస్థ ఎంత సమర్థవంతమైనదైనా కావొచ్చు, కాని చివరికి అది వ్యక్తుల విచక్షణకు ఎక్కడో ఒక దగ్గర లొంగక మానదు. దానిని మనం ఆ వ్యవస్థ యొక్క బలహీనత అని కూడా అనలేం, ఎందుకంటే, అన్ని వ్యవస్థలూ మానవ నిర్మితాలే కాబట్టి. (ప్రకృతి తప్ప) మీరు చెప్పిన రెందు విషయాల్లో (భయం మరియు సంస్కారం), భయాన్ని ప్రక్కన పెడితే, సంస్కారం ఎందుకు రోజు రోజుకీ పాతాళానికి దిగజారుతోంది ? ఒక వందేళ్ళ క్రితం మన వాళ్ళు అతి పాపం అని అనుకునే విషయాలు చాలా ఇప్పుడు మన రోజు వారీ జీవితంలో భాగమైపోయాయి.. దీనికి ఎవరిది భాద్యత ?. నాకు ఇక్కడే మతం/సాంప్రదాయం/విశ్వాసం యొక్క అవసరం కనిపిస్తుంది. అందుకే నాకు అనిపిస్తుంది, నిజమైన సమాజ స్వాతంత్ర్యం వ్యక్తుల స్వేఛ్ఛలో కాదు, వాళ్ళ భాద్యతల్లో పరిమళిస్తుంది... కాదంటారా ?
ReplyDelete