Monday, February 1, 2010

సాహితీ బంధువు గుమ్మడి

అయిదారు దశాబ్దాలు సినీరంగాన్ని దీప్తిమంతం చేసిన గుమ్మడిగారితో నా బంధుత్వం- ముఖ్యంగా సాహితీ పరమైనదీ, మైత్రీ పరమైనదీ.
విజయవాడ రేడియోకి వచ్చిన తొలిరోజుల్లో(1968 ప్రాంతాలలో) నాదికాని యితివృత్తాన్ని తీసుకుని (న్యాయంగా అమరేంద్ర రాయాల్సినది) రాత్రికి రాత్రి బందాగారి ప్రోత్సాహంతో రాసి, అర్ధాంతరంగా నేనే నిర్వహించాను. ఆ నాటకం పేరు “కళ్యాణి”. దానికి ప్రశంసల వర్షం కురిసింది. వాటిలో ఏరి ఇంతవరకూ మనస్సులో దాచుకున్న ఉత్తరం గుమ్మడిగారిది. నా ఆడ్రసునీ, నన్నూ వెదుక్కుంటూ వచ్చింది. అది మా బంధుత్వానికి ప్రారంభం.
పూర్తిగా చదవండి

6 comments:

  1. ఆ మహానటునితో మీకున్న అనుభంధం కించిత్ అసూయ కలిగించినా, ఏదో తెలియని ఉద్వేగంతో కళ్ళు కూడా చమర్చాయి. ద్రోణ ,విశ్వామిత్రులంటే గుమ్మడి గారే!

    ReplyDelete
  2. ఆ మహానటునితో మీకున్న అనుభంధం కించిత్ అసూయ కలిగించినా, ఏదో తెలియని ఉద్వేగంతో కళ్ళు కూడా చమర్చాయి. ద్రోణ ,విశ్వామిత్రులంటే గుమ్మడి గారే!

    ReplyDelete
  3. గుమ్మడి గారు "సూటి ముక్కు" మనిషే కాక ముక్కు సూటి మనిషి కూడా కావడం వల్లనే ఆయనకు తీపి జ్ఞాపకాలతో పాటు చేదు గురుతులు కూడా మిగిలాయన్నమాట. ఈ పుస్తకం ఆంధ్రజ్యోతి వీక్లీలో సీరియల్ గా వస్తున్నపుడు చదివాను. తర్వాత కొని దాచుకున్నాను కూడా!

    విశ్వామిత్రుడు, తిమ్మరుసు వంటి పాత్రలంటే గుమ్మడి గారు తప్ప ఇంకెవరూ గుర్తుకు రారేమో!

    ఖంగుమని మోగే పదునైన ఆయన స్వరం, అందులోని స్పష్టత, ఆ వాచికం ఎన్నటికీ మరపురానివి.

    మధ్యతరగతి తండ్రిగా వేసినా కోటీశ్వరుడిగా దర్పం చూపించినా ఆ పాత్రకే వన్నె తెచ్చే నటన ఆయనది.

    ReplyDelete
  4. మారుతీ రావు గారూ నమస్తే. మీ వ్యాసం చదువుతుంటే గుమ్మడి గారి అనేక పాత్రలు కళ్లముందు కదలాడాయి. మరీ ముఖ్యం గా అమరేంద్ర గారిని గుమ్మడి గారిని ఒకే వేదిక మీద చూసే వినే అదృష్టం నాకు కలిగింది. 1984 లో గుంటూరు జె.కె.సి కళాశాలకు ముఖ్య అతిథిగా వచ్చారు గుమ్మడి గారు. ఆ రోజు అమరేంద్ర గారు మా కళాశాల ను పదహారు వర్షాల హర్షాల బాల మన కళాశాల అంటూ పలికిన పలుకులు, మీ చప్పట్లు మీ జేజేలు మకు కొత్తేమీ కదు అంటూ పలికిన గుమ్మడి గారి మాటలు 26 సంవత్సరాల తరువాత కూడా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. ఆ రోజుల్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. మహానటుడండి, నాటి చిత్తూరి నాగయ్య గారి నుంచి నేటి చిల్లర నాగయ్యల వరకు చాలమందితో నటించినా, తన నమ్ముకున్న విలువలతో రాజీ పడక, ఎవరినీ పొల్లు మాట అనక...

    ReplyDelete
  6. గుండెపోటు కి పర్యాయ పదం గా మారిన గుమ్మడి గారు
    చాల తక్కువ సినిమాల్లో మాత్రమె గుండెపోటు తో చని పోకుండా
    ఆఖరి వరకు వున్నారంటే అతిశయోక్తి కాదేమో?
    చివరికి అయన నిజ జీవితం లో కుడా గుండె పోటు తో మరణించడం విషాదకరం .
    మహానటులు వోకరోకరు సెలవు తీసుకుని నిస్క్రమిస్తుంటే కళామ తల్లి ఇల్లు చిన్న బోతోంది

    ReplyDelete