మాయాబజార్ లో పింగళిగారు శాకంబరీ వరప్రసాదంగా గోంగూరని అభివర్ణించారుగాని- నా దృష్టిలో ఆ గౌరవం- ఇంకా చెప్పాలంటే మహా శాకంబరీ దేవి పూర్ణావతారంగా వంకాయని నేను పేర్కొంటాను.
పురుషులందు పుణ్యపురుషులలాగ కూరగాయలలో తలమానికం వంకాయ.వంకాయని విశ్వామిత్ర సృష్టి అంటారు. ఆ ఒక్క కారణానికే విశ్వామిత్రుడిని జగన్మిత్రుడిగా మనం కొలుచుకోవాలి. ఓ కవిగారు వంకాయ కూర తిని తిని, పరవశించి, తలకిందులై, కవితావేశంతో ఆశువు చెప్పాడు.
పూర్తిగా చదవండి
Monday, February 8, 2010
Subscribe to:
Post Comments (Atom)
గొల్లపూడిగారూ, నమస్తే.
ReplyDeleteఒక్క వంకాయ గురించేనా భయం. మన పౌరుల్లో చాలామంది బి టి అయిపోయి చాలా కాలమయ్యింది. ఇహ కూరల సంగతేమున్నది, అతి స్వల్ప విషయం మన సమాజానికి.
తరువాత. మనకున్న మిగిలిన కూరల్లో ఇప్పుడు దేశవాళి రకాలు ఎక్కడ ఉన్నాయి. పెండలం దొరికి ఎన్నాళ్ళయ్యింది. ఇదివరకు ఈ దుంపను సాగు చేసి, దాచి, పాతది అయినాక అమ్మేవాళ్ళు, కమ్మటి కూర అయ్యేది. అలాగే అరటికాయలు, చూట్టానికి ఇంతంత లావు ఉండటమే కాని ఆ రుచి ఏది? నా చిన్నప్పుడు సూపర్ వేసి పెంచిన కూరలు అనే వాళ్ళు.
ఇప్పుడు ఎక్కువ పండటానికి, రుచి పణంగా పెట్టి కొత్త వంగడాలు మన దేశంలోనే తీసుకు వచ్చేశారు. కనుమరుగైన కూరలలో టమేటో, కాబేజీ, అరటికాయ, పొట్టి కాకరకాయ,చిక్కుడు కాయ మొ||లగునవి. అంటే ఇవి ఇప్పుడు లేవని కాదు. 30-40 ఏళ్ళ క్రితం దొరికే రకాలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఆ పాత వంగడాల విత్తనాలు మరి ఎక్కడన్నా ఉన్నాయో లేవో తెలియదు. అమెరికా లేదా బ్రిటన్‌లలో ఇప్పటికి కూడ రికార్డుప్లయర్ స్టైలస్, మొటారు రబ్బరు వంటివే కాదు, కీ ఇచ్చే గ్రామఫోను పిన్నులు కూడ దొరుకుతాయి. మనం కొత్తది రాంగానే పాతది ఆవతల పారేస్తాం, ఇక దానికి సంబంధించినవి దొరకనే దొరకవు. కూరల పరిస్థితి కూడ అలాగే ఉన్నది.
అలాగే కొంత కాలానికి, వంకాయ కూడ. ఇలా మనం బాధ పడి బాధపడి చీవరకు రాజీ పడాటమేనా ఇంకేమన్న చెయ్యగలమా అని అలోచించుకోవాల్సిన తరుణం వచ్చింది.
ఆకు కూరలలో కుదురు బచ్చలి, ఎంత రుచి కూరగా, పులుసుగా. ఇప్పటి తరానికి తీగ బచ్చలి తప్ప కుదురు బచ్చలి తెలియదు, ఏమో మారు మూల పల్లెటూళ్ళల్లో ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయేమో. పంట వ్యాపర పరంగా ఆటిరాదని ఈ రకం బచ్చలిని కూరగాయల రైతులు వదిలేసినట్టున్నారు. ఇళ్ళల్లో కూరలు పెంచుకోగలిగిన అదృష్టం ఇప్పుడు ఎవరికీ లేదుకదా. పొరపాటున చారెడు స్థళం ఉంటే,అందులో ఎందుకూ పనికిరాని క్రోటన్స్ లాంటివి తప్ప, ఒక సొర పాదో, చిక్కుడు తీగో వేయాలని ఎంతమంది చేస్తున్నరు మహా ప్రభో. నేను బెంగుళూరు వచ్చినాక కొంత పెరడు ఉన్న ఇంట్లో ఉంటున్నాను కాని విత్తనాలు తెచ్చి చిక్కుడు తీగ పెడితే అదేదో వెర్రి తీగ+మొక్క వచ్చింది. ఏదో పొట్టి రకమట మొక్కలాగనే ఉండి విరగ కాస్తుందిట. పూలు తెల్లవి, ఊదా రంగువి కాదు. విరగ కాస్తుంది సరే, మరి రుచి మాటేమిటి. కనీసం ఇళ్ళల్లో పెంచుకుందామని ఉబలాటబడే ఉత్సాహవంతులకి, ఈ దేశవాళి కూరగాయ విత్తనాలు దొరికే చోటు ఎవరన్నా చెప్తే బాగుండును. మా జిప్సీ జీవితంలో ఈ బెంగుళూరులో ఉన్న 2-3 ఏళ్ళు అన్నా కూరల అసలు రుచి అస్వాదించవచ్చు.
అతి వేగంగా పెరిగిపోతున్న జనాభా అవసరాలు తీర్చటానికి ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలను తీసుకు రాక తప్పకపోవచ్చు. ఉన్న భూమి అదే, దేశవాళి రకాల దిగుబడి తక్కువ. మరి కూరల కరువు రాకుండా ఈ లాబ్‌లో తయారయ్యిన వంగడాలే గతేమో మనకి. కాని ఆ తెచ్చే సంకర వంగడాలు ప్రజల ఆరోగ్యాని హాని కలగకుండా ఉండితీరాలి.
మంచి అలోచన ఇచ్చారు, నేను నా బ్లాగులో(http://saahitya-abhimaani.blogspot.com/) కూరల పండుగ అని ఒక వ్యాసం వ్రాస్తాను, కనీసం ఆపాత మధురాలను నాలిక మీద గుర్తుకు తెచ్చుకోవచ్చు
రాజకీయ వంకాయ బాగుంది.
ReplyDeleteదీనిపై నా పోస్టును కూడా చూడగలరుః
గొల్లపూడి గారూ,
ReplyDeleteరాజకీయ వంకాయల గురించి బాగా చెప్పారు. నాకు ఎప్పటినుంచో ఒక సందేహం, ఎక్కడైనా బావ కానీ వంగ తోట కాడ కాదు అంటారు,ఎందుకని?
సీరియస్ గా మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటండీ? జయరాం రమేష్ ( ఆయనకు అసలే చిరాకు ఎక్కువ! చిరాకు పడేది తన ప్రజలపై! అదీ ప్రజాస్వామ్యం!!!!) బలవంతంగా ప్రవేశపెడితే అప్పుడు పరిస్థితి ఏంటి? నిజమైన నిరసనను కూడా పట్టించుకోకపోతే / అది నిరసనే కాదంటే / ప్రతిపక్షాల రైతుల కుట్ర అంటే ఎలా? " ఏముందీ షరా మామూలే ! న్యూస్, టీవీ మీడియాలు రెండు రోజులు పండుగ చేసుకుని తర్వాత వదిలేస్తాయి ! ప్రజలు ఎలక్షన్స్ వచ్చేసరికి మరిచిపొవడమూ మామూలే! " ఇది జోక్ కాదు. సీరియస్సే !! -- ఇట్లు ఓ అజ్ణాని
ReplyDeleteమరిచిపోయా ఇంతకీ పై మంత్రివర్యులు మార్కెటింగ్ సేల్స్ మాన్ గా సైడ్ బిజినెస్ చేస్తున్నారా??
ReplyDeleteవంకాయ కూర గురించే ప్రస్తావించారు గాని
ReplyDeleteప్రసస్తమైన వంకాయ బండ పచ్చడి మరిచి పోయారు .
యి బీటి వంకాయ లోని మతలబు ఏంటంటే
ప్రతీ సారి దీన్ని విదేశాల నుంచి కొనుక్కోవడమే
విత్తనం వుండదు కాబట్టి use అండ్ త్రో టైపు.