Sunday, March 28, 2010

నీతి..న్యాయం..చట్టం !

శబ్దార్ధ చంద్రికనీ, శబ్దరత్నాకరాన్నీ ఆశ్రయించినా- నా ఆలోచనకి సరైన న్యాయం జరగలేదు. నీతికీ, న్యాయానికీ కావలసినంత దూరం వున్నదని నా మతం. నీతి అంటేనే న్యాయమని నిఘంటుకారుడు చెప్పి చేతులు కడుగుకున్నాడు. ఇక నా తాపత్రయం నేను పడతాను.
పూర్తిగా చదవండి..

7 comments:

  1. ఖుష్బు గొడవ, సుప్రీంకోర్టు వ్యాఖ్యాలు ఏమోకాని,

    నీతి..న్యాయం..చట్టం అంటే ఏమిటో మీరు చక్కగా వివరించారు.

    దేనినైన మంచి , చెడు అని రెండుగా విభజిస్తే నీతి, న్యాయం >> మంచి అనే ఒకే గొడుకు క్రిందకు వస్తాయి.

    ReplyDelete
  2. మీ విశ్లేషణ బాగుంది. ముఖ్యంగా నీతి-న్యాయం-చట్టంలోని సంక్లిష్టతను వివరించిన తీరు చాలా ఉపయోగకరం.

    ReplyDelete
  3. గోమారా గారు,
    మీరు వ్యాస ప్రారంభం బాగా జరిగింది. కుష్బూ ప్రవేసించాక ఎక్కడొ దారి తప్పినట్టనిపించింది. స్పష్టత తగ్గిపోయింది అనిపిస్తోంది కాని ఎక్కడ అని తెలియట్లేదు. వీలైతే మరోమారు కుష్బూ లేకుండా పరిశీలించండి, నిర్మొహమాటంగా చెప్పగలరనే ఆశిస్తాను.

    ReplyDelete
  4. నాకెందుకో శబ్దార్థ చద్రిక, శబ్ద రత్నాకరం కరక్టేమో అనిపిస్తోంది.

    నీతి కీ న్యాయానికీ అట్టే దూరం లేదు. న్యాయం పుట్టేది నీతి నుంచే!

    మానవ పరిణామ క్రమంలో, క్రమంగా విలువలకీ (నీతి), విచక్షణకీ (న్యాయం) దూరం ఎక్కువైపొతూంటుంది.

    ఆ పరిణామ ప్రయాణంలో, త్యాగరాజు గారు చెప్పినట్టు, మనం నీతి వదిలి నూతిలో మునుగుతాము!

    ReplyDelete
  5. కుష్బూ వ్యవహారంలో మీడియా వాళ్ళు అతి చేయడంతో ఒక ఇష్యూ గా మారిపోయింది. అది కేవలం ఆమె వ్యక్తిగత అభిప్రాయంగా వదిలివేసి వుంటే సరిపోయేది. మీడియా తన పరిమితిలో వుంటే ఇలాంటివి ఇష్యూలు గా మారవు.

    ReplyDelete
  6. భట్టుగారూ!
    కుష్బూ సమీక్ష వ్యక్తి నీతికి సంబంధించినది. కేసులు వ్యవస్థకి జరిగే అన్యాయానికి సంబంధించినవి.
    న్యాయస్థానం ఈ వివరాన్ని అందించకపోగా రాధా కృష్ణుల ప్రేమ వ్యవహారం వివాహేతర లైంగిక సంబంధంగా వర్ణించడం- సర్వత్రా అవగాహనా లోపానికి ఇది గొప్ప మచ్చుతునక అని చెప్పడం నా ఉద్దేశం. సరిగా చెప్పలేకపోతే నన్ను క్షమించగలరు.

    ReplyDelete
  7. I second Bhut.
    Initially, it is clear, later I couldn't follow. Might be my level of understanding is not sufficient though.

    ReplyDelete