Monday, July 5, 2010
లయ
ఇవాళ్టితో వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్ షిప్పు పోటీలు ముగుస్తాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా - ఈ టెన్నిస్ పోటీలుచూడడానికి టీవీకి అతుక్కు పోవడానికి మరో ముఖ్యమయిన కారణం ఉంది.అది "రోలెక్స్" వాచీ ప్రకటన స్పాట్. (ఇప్పటిది కాదుఇంతకుముందు చేసింది ఇప్పుడు వేస్తున్నారు) అది అద్బుతం. ప్రపంచ స్థాయి ఆటగాడు రోజర్ ఫెడరర్ ని అంతే ప్రపంచ స్థాయికెమెరామన్, దర్శకుడు - ప్రపంచ స్థానంలోనే 30 సెకన్ల చిత్రాన్ని నిర్మించాడు. ఇంత కంటే వివరించడానికి నాకు మాటలు చాలవు.మీరు చూడాలి . వెలుగు నీడల్లో ఫెడరర్ బంతిని కొట్టే భంగిమలు ప్రయత్నించినా నిర్ణయించగలిగేవికావు. ఒక మహా 'కళాకారుడు ' (గమనిచండి - ఆటగాడు అనడంలేదు) ఒక తన్మయ దశలో అలవోకగా చేయగలిగేవి. ఆ శరీరం కదలికలో సంగీతం పలుకుతుంది.ఆ సంగీతాన్ని - వెలుగునీడల సమ్మేళనంగా - స్పాట్లో ఆఖరి ఫేడవుట్లో బంధించారు - అద్బుతం.
Subscribe to:
Post Comments (Atom)
మీరు రాసిన వ్యాసాల లో ఇది ఒక అద్భుతమయిన వ్యాసం. చాలా గొప్ప వివరణ. పాఠకులకు సౌందర్య లహరిని ఒక కొత్త కోణంలో చూపారు.ఇంత కంటే వివరించడానికి నాకు మాటలు చాలవు.
ReplyDeleteగురువుగారు,
ReplyDeleteమీరు చెప్పిన వీడియో ఈ లింకులో లభ్యం.
http://www.youtube.com/watch?v=6eCYUl4iKlE&feature=related
పరమాత్మ తత్వం చిన్న చిన్న విషయాలలో కూడా ఎలా విస్తరించుకుని ఉంటుందో చక్కగా వివరించారు. ఏకాగ్రతతో, శ్రద్ధతో సాధన చేసి పైకి వచ్చిన వ్యక్తులని చూస్తే, వారిది ఏ రంగమయినా, మీరు చెప్పిన "లయ" తప్పక కనిపిస్తుంది. అందుకే, బాలూ పాట, టెండూల్కర్ బ్యాటింగ్,ఇళయరాజా ట్యూన్..... యివన్నీ దాదాపుగా ఒకే అందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. మీరు చెప్పినట్లు ఇది ప్రవచనం కాకపోయినా, మాచేత చాలాసేపు చదివించింది. ఇలాంటి కాలమ్స్ మాకు మీనుంచీ చాలా చాలా కావాలి. అదీ భగవద్గీతలాంటి, జీవితానికి ఉపయోగపడే, పుస్తకాల మీద అయితే ఇంకా బావుంటుంది.
ReplyDeletedear venkateswararao gaaru,rao gaaru rolex/lion vanti examples lo cheppindi kevalam oka"sowndaryalaharini" maatramae kaadu,geethanu koodaanu.ఈ సకల చరా-చర సృష్టిలో ,ఏ ప్రాణి/ప్రాణ కాని వాటిలో ఏ లేస మాత్రపు అద్భుతం కనిపించినా అది నేనే తెలుసుకోమ్మన్నాడు ఆ కృష్ణ పరమాత్మ.మరిచిపోయారా ?--Rao je.hats-off to ur observation nd implementory skills in this matter/challa.jayadevaananda sastry-chennai-17......
ReplyDeleteIam surprised at the given examples, at the same time shocked over and saddned by the (real) story. I couldn't close with the happy note as you did, maybe because I'm not perfectly tuned to the Lord's 'laya'.
ReplyDelete